బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు | Hyderabad Officials Warn Rice Traders Against Artificial Shortages And Overpricing, Direct Strict Monitoring Of Stocks And Sales | Sakshi
Sakshi News home page

బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

Oct 28 2026 9:24 AM | Updated on Oct 28 2026 10:14 AM

Chief Rationing Officer Wrong To Rice High price

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని ప్రధాన రేషనింగ్ అధికారి (సీఆర్వో) జీవీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌ హెచ్చిరించారు. మంగళవారం సీఆర్వో కార్యాలయంలో బియ్యం లభ్యత, ప్రస్తుత నిల్వల పరిస్థితి, మార్కెట్‌ ధరలు, సరఫరా తీరుపై ఆయన సమీక్ష జరిపి మాట్లాడారు. లాభాపేక్షతో సరుకును అక్రమంగా నిల్వ చేయడం, నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడకుండా అధికారులు కట్టడి చేయాలని ఆదేశించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా బియ్యం విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

 హోల్‌సేల్,రిటైల్‌ వ్యాపారులు తమ వద్ద తగినంత నిల్వలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలని, షాపుల్లో వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా స్టాక్‌ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వ్యాపారులకు ఆదేశించారు. బియ్యం రకం, మొత్తం నిల్వ పరిమాణం, విక్రయ ధరల వివరాలను   రోజువారీగా నవీకరించాలని సూచించారు. కొనుగోలు, అమ్మకాలు నిల్వలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement