సాక్షి, హైదరాబాద్: ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్‌ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా... లేక ప్రాణాలను కబళించే మాయా తెరగా మారుతున్నాయా? అని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రశ్నించారు. బొల్లారంలో జరిగిన ఓ రైలు దుర్ఘటన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో మంగళవారం పోస్టు చేసిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నిండు జీవితం కంటే ఆ ఫోన్‌కాల్ అంత అత్యవసరమా? ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా? ఒక్కసారి ఆలోచించండి. రైల్వే ట్రాక్ పక్కన బాహ్య ప్రపంచపు స్పృహే లేకుండా ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచి్చన రైలు క్షణాల వ్యవధిలో ఢీకొట్టింది.
గుండెలను బరువెక్కించే హృదయ విదారక ఘటన బొల్లారం సమీపంలో ఇటీవల చోటుచేసుకుంది. క్షణకాలం ఏమరుపాటు, అజాగ్రత్త నిండు జీవితాన్ని ఎలా ముగింపునకు తీసుకువెళ్తాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. రోడ్లపై వాహనాలు నడుపుతున్నప్పుడు ఇయర్‌ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం వల్ల ప్రాణాలకే కాకుండా తోటి వాహనదారుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతున్నారు. రోడ్లపై నడుస్తున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు, రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్లు వాడే ప్రాణాంతక అలవాటును తక్షణమే మానుకోవాలి. మీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి’ అని సీపీ సూచించారు.
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రాక్ పక్కనే వ్యక్తి.. రైలు ఢీకొనడంతో స్పాట్లోనే మృతి హైదరాబాద్‌లోని బొల్లారం సమీపంలో చోటు చేసుకున్న దుర్ఘటన ఓ వ్యక్తి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. రైల్వే ట్రాక్ పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాడు అదే టైంలో అటుగా వచ్చిన రైలు.. వ్యక్తిని గమనించి పదే పదే హారన్ కొట్టిన లోకో పైలట్ కానీ ఇయర్ ఫోన్స్ కారణంగా వినిపించకపోవడంతో.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి రైలు ఢీకొట్టిన ధాటికి కొంత దూరం ఎగిరిపడి.. తీవ్ర గాయాలతో మృతి చెందిన వ్యక్తి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటన దృశ్యాలు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 28, 2026


