ర్యాపిడో రైడర్‌ కిడ్నాప్‌ | Engineering Student Kidnapped While Driving Rapido, Escapes From Captors After Being Threatened With Knives | Sakshi
Sakshi News home page

ర్యాపిడో రైడర్‌ కిడ్నాప్‌

Oct 28 2026 11:19 AM | Updated on Oct 28 2026 11:30 AM

Kidnapping of a Rapido Rider In Hyderabad

హైదరాబాద్‌: ప్యాకెట్‌ మనీ కోసం ర్యాపిడో నడిపిస్తూ కిడ్నాప్‌నకు గురైన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి చాకచక్యంగా తప్పించుకున్న ఘటన గోపాలపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం... పటాన్‌చెరులోని ఎల్లంకి ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో భార్గవ్‌ అనే విద్యార్థి తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. బీఎన్‌రెడ్డినగర్‌లోని స్నేహితుడు కల్యాణ్‌ వద్ద ఉంటూ ప్యాకెట్‌ మనీ కోసం వారంరోజులు తన ద్విచక్ర వాహనంతో ర్యాపిడో నడిపిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీ రాత్రి 10.45 గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో సికింద్రాబాద్‌ ఒలిఫెంటా బ్రిడ్జి పిల్లర్‌ నంబర్‌ 1154 వద్ద రైడ్‌ కోసం వేచిచూస్తున్నాడు. అదే సమయంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి డబ్బుల కోసం భార్గవ్‌ను బెదిరించారు.

 కత్తులు చూపించి బెదిరిస్తూ ద్విచక్ర వాహనం కీస్, పర్సు లాక్కుని అతడిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి కాచిగూడకు తీసుకువెళ్లారు. అటు నుంచి రామంతాపూర్‌ తీసుకెళ్లి అతడి ఫోన్‌ లాక్‌ తీసి, ఫోన్‌పే పాస్‌వర్డ్‌ తీసుకున్నారు. రాత్రి 12.30 గంటల సమయంలో భార్గవ్‌ సమయస్ఫూర్తితో తప్పించుకుని తన స్నేహితుడికి ఫోన్‌ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత అతని ఫోన్‌పే నుంచి నిందితులు రూ.700 నిఖత్‌ తస్లీమ్‌ అనే వ్యక్తికి బదిలీ చేసుకున్నారు. మరునాడు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement