breaking news
punjab gangsters
-
పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: 30కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న పంజాబ్ గ్యాంగ్‌స్టర్ గుర్విందర్ అలియాస్ అఫ్రిదిని పోలీసులు భారత్‌కు తీసుకొచ్చారు. ఇథియోపియాలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం పంజాబ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అఫ్రిదిపై పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు కూడా గతంలో ప్రకటించింది.పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాకు చెందిన అఫ్రిది.. డోనీ బాల్-ప్రభ్ దస్సువాల్ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఐదు హత్య కేసులతో పాటు హత్యాయత్నం, బెదిరింపులు, అక్రమ వసూళ్లతో పాటు అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. పంజాబ్‌లో జరిగిన పలు కీలక హత్యల వెనుక అఫ్రిది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.2025 మార్చిలో నకిలీ పాస్పోర్టుతో అఫ్రిది ముంబై నుంచి యూఏఈకి పారిపోయాడు. అనంతరం టర్కీ, కెన్యా, అంగోలా మీదుగా ఇథియోపియాకు చేరుకున్నాడు. అతడి కోసం ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా జారీ అయింది.పంజాబ్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ షాహిద్’లో భాగంగా పది నెలల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిఘా కొనసాగించి అతడిని పట్టుకున్నారు. అంతేకాదు ఆఫ్రికా దేశం నుంచి పరారీలో ఉన్న నేరస్థుడిని పంజాబ్ పోలీసులు భారత్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడిని పంజాబ్‌కు తరలించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు.. చైనా సాయం కోరుతున్న అమెరికా? -
ఆ హత్య చేసింది మేమే.. కాదు మేమే!
సాధారణంగా ఏదైనా హత్య జరిగినప్పుడు అది మేం చేయలేదంటే దాంతో మాకు సంబంధం లేదని అందరూ తప్పుకొంటూ ఉంటారు. పంజాబ్‌లో ఈ మధ్య జస్వీందర్ భుల్లర్ అలియాస్ రాకీ అనే గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. ఈ విషయంలో మాత్రం రాకీని చంపింది మేమంటే మేమంటూ అతడి ప్రత్యర్థులు క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు. అది కూడా జైలు నుంచి ఫేస్బుక్లో తెగ అప్డేట్లు పెట్టేస్తున్నారు. పంజాబ్‌లోని వివిధ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లతో పాటు.. పరారీలో ఉన్న వాళ్లలో కూడా చాలామంది ఈ హత్యకు క్రెడిట్ కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసిన రాకీని.. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో హత్యకు గురయ్యాడు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. షేరా ఖుబ్బన్, సన్నీ చంద్ భాన్ గ్రూపులు అతడిని తామే హతమార్చామంటూ ఫేస్బుక్లో కామెంట్ల యుద్ధం మొదలుపెట్టాయి. రాకీని చంపింది తానేనని జైపాల్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్ ఏకంగా పెద్ద పోస్టు ఫేస్బుక్లో పెట్టాడు. డింపీ చంద్భాన్ కొడుకే రాకీని చంపినట్లు కొందరు చెబుతున్నారని, కానీ తన తండ్రి హత్య గురించి కనీసం ప్రకటన కూడా చేయలేని వ్యక్తి రాకీని ఎలా చంపుతాడని ఎద్దేవా చేశాడు. కానీ సన్నీ చంద్భాన్ గ్రూపునకు చెందిన సందీప్ యాదవ్ అనే మరో గ్యాంగ్‌స్టర్ మాత్రం.. సన్నీ కొడుకు డింపీయే రాకీని చంపాడని చెబుతున్నాడు. దీంతో ఇప్పుడు రాకీ హత్యకేసులో ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని అరెస్టు చేయాలోనని తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. పనిలో పనిగా.. ఫేస్బుక్ కామెంట్లు చేస్తున్న గ్యాంగ్స్టర్ల ఆచూకీ కూడా కనుగొని వాళ్లను అరెస్టు చేస్తే ఎలా ఉంటుంనద్న ఆలోచన కూడా పోలీసులకు వస్తోందట.


