గుంటూరు: జైల్లో ప్రత్యేక ఫుడ్డుతో పాటు ప్రత్యేక కేటగిరీ కింద కల్పించాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలంటూ గుంటూరు కోర్టులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన గుంటూరు కోర్టు లేళ్ల అప్పిరెడ్డికి ప్రత్యేక ఫుడ్ తోపాటు ప్రత్యేక కేటగిరీ కింద కల్పించాల్సిన సౌకర్యాలు అన్నీ కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది.
అయితే, తమ జైల్లో ఈ సదుపాయాలు లేవని, తాము ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని కోర్టుకు జైలు అధికారులు తెలిపారు. దానితోపాటు భద్రత కూడా కల్పించలేమని, వేరే జైలుకు తరలించాలని కోర్టులో గుంటూరు జైలు అధికారులు పిటిషన్ వేశారు. దీంతో లిఖితపూర్వకంగా వాదనలు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.


