‘కూటమి అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం’ | Gurumoorthy strongly condemned the alleged atrocities of TDP | Sakshi
Sakshi News home page

‘కూటమి అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం’

Nov 9 2026 9:46 PM | Updated on Nov 9 2026 9:46 PM

Gurumoorthy strongly condemned the alleged atrocities of TDP

తిరుపతి జిల్లా: కూటమి అరాచకాలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందని, అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అమలులో లేదన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కేవీబీపురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ గెలిస్తే టీడీపీ గెలిచినట్లు ప్రకటించారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కళత్తూరు ఎంపిటిసి కిడ్నాప్  చేశారని,  ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ గెలిచిన సీటు టిడిపి ఖాతాలో వేశారన్నారు. 

సత్యవేడు నియోజకవర్గంలో బరితెగించిన టిడిపి నేతలు
కాగా, కేవీబీపురం మండలం ఎంపీపీ పదవి కోసం టిడిపి కుట్రలు చేస్తుంది,. వైఎస్సార్‌సీపీకి చెందిన కళత్తూరు ఎంపీటీసీ పట్టాభిరామిరెడ్డిని కిడ్నాప్‌ చేశారు.  దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

ఈనెల 11వ తేదీన ఎంపీపీ పదవి కోసం పరోక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఎంపీటీసీ. జడ్పీటీసీ కౌంటింగ్‌ సమయంలో  కుట్ర రాజకీయాలు చేసిన  టీడీపీ.. ఇప్పుడు ఎంపీపీ పదవుల్ని దక్కించుకునేందుకు మళ్లీ అక్రమాలకు పాల్పడుతుంది.

ఇదీ చదవండి: దొడ్డదేవరపాడులో టీడీపీ నేతల బరితెగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement