ఎన్టీఆర్ జిల్లా: వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామంలో టీడీపీ నేతలు బరితెంగించారు. డీజే తమ ఇంటి ముందు పెట్టొద్దన్నందుకు వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలపై దాడి చేశారు టీడీపీ నేతలు. మహిళలపై జరిగిన దాడిని ప్రశ్నించిన వారి బంధువులపైనా రెచ్చిపోయారు టీడీపీ గూండాలు.
కర్రలతో దాడికి దిగి విచక్షణారహితంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా వీరులపాడు పోలీసులు స్పందించలేదు.
ఇదీ చదవండి: ఎమ్మిగనూరు కూటమిలో భగ్గుమన్న వర్గ విభేదాలు


