చాన్నాళ్లుగా తమిళ సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన రిషికాంత్.. రీసెంట్ టైంలో మొదరాత్రి, డోరతి చిత్రాలతో హిట్స్ కొట్టాడు. అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. ఇతడు రామ్ చరణ్-సుకుమార్ మూవీలోనూ కీలక పాత్ర చేయనున్నాడనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా రిషికాంత్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించాడు.
(ఇదీ చదవండి: ఎందుకు ఇబ్బందిపెడతారు? రేణు దేశాయ్ పోస్ట్ వైరల్)
'నేను రామ్ చరణ్ కొత్త సినిమాలో నటించట్లేదు. మైత్రీ నిర్మాణ సంస్థ తీసిన 'మొదరాత్రి'లో పనిచేశాను. మైత్రీ వాళ్లు ఆహ్వానిస్తేనే ఈ మూవీ పూజా కార్యక్రమానికి వచ్చాను. మళ్లీ మూవీ వచ్చిన తర్వాత చూసి తెలుసుకోవడం కంటే నేనే ఇప్పుడు చెప్పేస్తున్నాను' అని రిషికాంత్ క్లారిటీ ఇచ్చాడు.
రామ్ చరణ్, సుకుమార్.. 2018లో రిలీజైన 'రంగస్థలం' చేశారు. ఇది అప్పట్లో సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి పనిచేస్తున్నారు. మూవీ లాంచ్ అయింది గానీ సంగీత దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఎవరు? అనే విషయాలు బయటకు రాలేదు. బహుశా జనవరి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్‌తో విడాకులు.. అన్నా లెజినోవా కీలక నిర్ణయం)
I am not part of #RC17. I attended the movie pooja because I had worked on #MoothaRathiri with Mythri Productions, and they invited me. Rather than letting people watch the film and later realise I am not part of it, I wanted to clarify it myself. – #Rishikanth https://t.co/SFSUYzDSCr
— Movies Singapore (@MoviesSingapore) November 9, 2026


