breaking news
Dorothy Movie
-
చరణ్‌తో సినిమా.. 'డోరతి' నటుడి క్లారిటీ
చాన్నాళ్లుగా తమిళ సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన రిషికాంత్.. రీసెంట్ టైంలో మొదరాత్రి, డోరతి చిత్రాలతో హిట్స్ కొట్టాడు. అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. ఇతడు రామ్ చరణ్-సుకుమార్ మూవీలోనూ కీలక పాత్ర చేయనున్నాడనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా రిషికాంత్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: ఎందుకు ఇబ్బందిపెడతారు? రేణు దేశాయ్ పోస్ట్ వైరల్)'నేను రామ్ చరణ్ కొత్త సినిమాలో నటించట్లేదు. మైత్రీ నిర్మాణ సంస్థ తీసిన 'మొదరాత్రి'లో పనిచేశాను. మైత్రీ వాళ్లు ఆహ్వానిస్తేనే ఈ మూవీ పూజా కార్యక్రమానికి వచ్చాను. మళ్లీ మూవీ వచ్చిన తర్వాత చూసి తెలుసుకోవడం కంటే నేనే ఇప్పుడు చెప్పేస్తున్నాను' అని రిషికాంత్ క్లారిటీ ఇచ్చాడు.రామ్ చరణ్, సుకుమార్.. 2018లో రిలీజైన 'రంగస్థలం' చేశారు. ఇది అప్పట్లో సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి పనిచేస్తున్నారు. మూవీ లాంచ్ అయింది గానీ సంగీత దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఎవరు? అనే విషయాలు బయటకు రాలేదు. బహుశా జనవరి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్‌తో విడాకులు.. అన్నా లెజినోవా కీలక నిర్ణయం)I am not part of #RC17. I attended the movie pooja because I had worked on #MoothaRathiri with Mythri Productions, and they invited me. Rather than letting people watch the film and later realise I am not part of it, I wanted to clarify it myself. – #Rishikanth https://t.co/SFSUYzDSCr— Movies Singapore (@MoviesSingapore) November 9, 2026 -
ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. అలానే వచ్చినవన్నీ కూడా చిన్న చిత్రాలు. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఉన్నంతలో కాస్త చూడదగ్గ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఒక్కరోజే 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో ప్యారడైజ్, డోరతి, ధూమకేతు, ఐ యామ్ హ్యాండ్సమ్, గజబ్ రాత్, సుమో దీదీ, వరం, నా వైఫ్ మిస్సింగ్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలతో పాటు సిరీస్‌లు చూడొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (అక్టోబర్ 23)అమెజాన్ ప్రైమ్ఐ యామ్ హ్యాండ్సమ్ - తెలుగు సినిమాచార్ యార్ - హిందీ సిరీస్లాల్: హాలోవీన్ సీజన్ 1 - ఇటాలియన్ సిరీస్ఫైనల్ టేబుల్ - కొరియన్ సిరీస్ (అక్టోబర్ 24)నెట్ఫ్లిక్స్ద ప్యారడైజ్ - తెలుగు సినిమాడోరతి - తెలుగు డబ్బింగ్ మూవీధూమకేతు - తెలుగు డబ్బింగ్ సినిమాల్యూపిన్ పార్ట్ 4 - తెలుగు డబ్బింగ్ సిరీస్గజబ్ రాత్ - తెలుగు డబ్బింగ్ సినిమాపొలిటికా ల్యూపిన్ సీజన్ 1 - జపనీస్ సిరీస్సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ - ఇంగ్లీష్ సిరీస్ప్యారలైజ్డ్ బై హోప్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీఫేడింగ్ గ్రాండియర్ - స్పానిష్ సిరీస్హాట్స్టార్వరం - తెలుగు సిరీస్ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్సుమో దీదీ - హిందీ సినిమాఅన్ లక్కీ మై బాస్ - కొరియన్ సిరీస్ద ఇన్వైట్ - ఇంగ్లీష్ మూవీశ్వేత్కాళీ సీజన్ 2 - బెంగాలీ సిరీస్లయన్స్ గేట్ ప్లేలెజెండ్ ఆఫ్ ద వైట్ డ్రాగన్ - ఇంగ్లీష్ సినిమాఆహానా వైఫ్ మిస్సింగ్ - తెలుగు సిరీస్(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాయదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. అయితే అందరూ దసరా పండగ హడావుడిలో ఉన్నారు. సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్నారు. గత వీకెండ్ రిలీజైన రణబాలి, జైలర్ 2 సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి. మరోవైపు ఈ వీకెండ్.. 418, హైకూ, ప్రేమ డైరీలో, 321, జయహో రామానుజ లాంటి చిన్న చిత్రాలే విడుదల కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌లా కీర్తి.. టీజర్ రిలీజ్)మరోవైపు ఓటీటీల్లో 25కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ నాని 'ప్యారడైజ్', కీర్తి సురేశ్ 'డోరతి'తోపాటు సుమో దీదీ లాంటి చిత్రాలతో పాటు నా వైఫ్ మిస్సింగ్, వరం లాంటి తెలుగు సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 19 నుంచి 25 వరకు)హాట్స్టార్మోనా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 21వరం (తెలుగు సిరీస్) - అక్టోబర్ 22ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 23ఆహానా వైఫ్ మిస్సింగ్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 22జీ5సుమో దీదీ (హిందీ మూవీ) - అక్టోబర్ 23ద ఇన్వైట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 23సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 23నెట్ఫ్లిక్స్సైబర్ పంక్: ఎడ్జ్ రన్నర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 20సిక్స్ కింగ్స్ స్లమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21ద మదర్ ఆఫ్ పెంగ్విన్స్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) - అక్టోబర్ 21ద న్యూ స్టాన్‌ఫోర్ట్ ప్రిజన్ ఎక్స్పరీమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21ద ప్యారడైజ్ (తెలుగు సినిమా) - అక్టోబర్ 22డిడ్ సమ్‌వన్ హ్యాపెన్ టూ మెన్షన్ మీ? (జపనీస్ సిరీస్) - అక్టోబర్ 22నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 22ఫేడింగ్ గ్రాండియర్ (స్పానిష్ సిరీస్) - అక్టోబర్ 23గజబ్ రాత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 23ల్యూపిన్ పార్ట్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23ప్యారలైజ్డ్ బై హోప్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 23డోరతి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 23సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23అమెజాన్ ప్రైమ్లవ్ ఇన్ డిస్కూస్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 19ద టెర్మినల్ లిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21చార్ యార్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 23ఫైనల్ టేబుల్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 24ఆపిల్ టీవీ ప్లస్వేర్ ఈజ్ వాండా? సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
ఓటీటీకి కీర్తి సురేశ్ హిట్ మూవీ.. నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్
కీర్తి సురేశ్ లీడ్ రోల్ చేసిన లేటేస్ట్ మూవీ డోరతి. ఈ చిత్రంలో రిషికాంత్, సనంత్ హీరోలుగా నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కుటుంబం, స్నేహం వంటి అంశాలను దాటి హిజ్రాల జీవన విధానంపై తెరకెక్కించారు. ఇటీవల రిలీజైన ఈ చిత్రంల బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తమిళంలో హిట్ కావడంతో వారం రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 2న తెలుగులోనూ రిలీజ్ చేశారు. స్పిరిట్ మీడియా ద్వారా రానా దగ్గుబాటి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే అంతలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.‘డోరతీ’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1995లో తమిళనాడులోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. వేరు వేరు సామానిక నేపథ్యాలు ఉన్న సుబ్బు(సనంత్), కార్తి(రిషికాంత్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. సుబ్బ వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. వాళ్ల నాన్న స్థానికంగా ప్రభావం ఉన్న గ్యాంగ్‌స్టర్. ఇద్దరు అన్నలు కూడా రౌడీయిజం, రాజకీయాలే చేస్తుంటారు. సుబ్బు, కార్తీ కూడా ఆ గ్యాంగ్‌లో చేరతారు. అయితే చిన్నప్పుడు పురుష అహంకారం చూపించే సుబ్బు..పెద్దయ్యాక మాత్రం పూర్తిగా మారిపోతాడు. గ్యాంగ్‌స్టర్ ప్యామిలీ సభ్యుడే అయినా.. రక్తం చూసినా వాంతులు చేసుకుంటాడు. హింసకు దూరంగా ఉంటూ..ఇంట్లోకి కొత్తగా వచ్చిన వదిన డోరతీ(కీర్తి సురేశ్)తో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అయితే అనూహ్యంగా డోరతీ కన్నుమూస్తుంది. వదిన చావుకు తన తండ్రి, అన్నదమ్ములే కారణమని సుబ్బు భావిస్తాడు. ఆమె మరణం తర్వాత సుబ్బు ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? ఆ నిర్ణయం వల్ల సుబ్బు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అసలు పెద్దయ్యాక సుబ్బులో వచ్చిన మార్పులు ఏంటి? ప్రాణ స్నేహితుడైన కార్తి.. సుబ్బుని చంపాలని ఎందుకు ప్రయత్నించాడు? చివరకు కార్తి, సుబ్బులు స్నేహం ఎలా ముగిసింది? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే. -
హిజ్రాలపై అభిప్రాయాన్ని మార్చిన ‘డోరతి’
కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర చేసిన సినిమా డోరతి. రిషికాంత్, సనంత్ హీరోలుగా నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. కుటుంబం, స్నేహం వంటి అంశాలను దాటి హిజ్రాల జీవన విధానాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం చైన్నెలోని కమలా థియేటర్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నగరంలోని పలువురు హిజ్రాలు పాల్గొని తమ సామాజిక వర్గాన్ని ఉన్నతంగా చూపించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ని అభినందించారు.పురుషాధిక్యమే మాస్ అని చాలా తప్పుడు విషయాలను రుద్దుతూ సినిమాలు చేస్తున్న వారికి డోరతి ఒక చెంప పెట్టు. రోమియో జూలియట్‌లా డోరతి అద్భుతమైన ప్రేమకథా సినిమా అని దర్శకుడు వసంత్ బాలన్ అన్నారు. నేను తమిళ సినిమా దర్శకుడినని గర్వంగా చెప్పుకోవడానికి కారణం డోరతి. హిజ్రాల సామాజిక వర్గం గురించి చిత్రం చేయడానికి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ముందుకు రావడమే పెద్ద విషయం అని దర్శకుడు శశి చెప్పారు. ఎంతో ప్రేమాభిమానాలు, ధైర్యం ఉంటేనే ఇలాంటి చిత్రం చేయగలరు. కార్తీక్ సుబ్బరాజ్‌కి అవి ఉన్నాయని దర్శకుడు లింగుస్వామి పేర్కొన్నారు.హిజ్రాల సామాజిక వర్గాన్ని కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అని మిస్కిన్ ప్రశంసించారు. సినిమా చాలా శక్తివంతమైన ఆయుధం. ప్రజల మనసుల్ని మార్చే శక్తి దానికి ఉంది. హిజ్రా సామాజిక వర్గం గురించి ఇప్పటివరకూ ఉన్న భావనని డోరతి చిత్రం కచ్చితంగా మారుస్తుందని పలువురు ప్రముఖులు నాతో అన్నారు. అదే ఈ చిత్రం విజయం అని భావిస్తున్నాను. వారి ప్రశంసలు పది కాలాలపాటు నేను, మా యూనిట్ గుర్తుపెట్టుకుంటామని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చాడు. -
కొత్త తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ఎంత?
ఈ వీకెండ్ చాలానే తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్', దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తీసిన 'సిగ్మా', రోషన్ 'తెల్లకాగితం'తోపాటు అనకాపల్లి, కీర్తి సురేశ్ 'డోరతి' తదితర మూవీస్ ఉన్నాయి. ఇంతకీ వీటికి ఎలా స్పందన వస్తోంది? కలెక్షన్స్ సంగతేంటి?రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరో. అయితే ప్రమోషన్ల గట్టిగా చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. కానీ వీటిని అందుకోవడంలో మూవీ, యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. దీనికి తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.1.65 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫహాద్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమా రివ్యూ)తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో. దీనికి రిలీజ్‌కి ముందు మంచి హైప్ ఏర్పడింది. తీరా చూస్తే టైటిల్ ట్రెండీగా ఉన్నా కంటెంట్ పాతగా ఉందని టాక్ వినిపించింది. ఇకపోతే ఈ చిత్రానికి తొలిరోజు రూ.2.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.(ఇదీ చదవండి: జేసన్ సంజయ్ 'సిగ్మా' తెలుగు రివ్యూ)'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా సినిమా 'తెల్లకాగితం'. గతంలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా దీన్ని తీశారు. అయితే క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ మిగతాదంతా చల్తా చల్తా. ఇది డీసెంట్ మూవీ అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. దీనికి తొలిరోజు రూ.1.58 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించుకున్నారు.(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)కీర్తి సురేశ్ టైటిల్ రోల్ చేసిన సినిమా 'డోరతి'. గతవారం తమిళనాడులోని థియేటర్లలోకి వచ్చింది. ఈ వీకెండ్ తెలుగులో రిలీజైంది. స్వలింగ ప్రేమ అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇదో డిఫరెంట్ మూవీ అని చూసిన చాలామంది మెచ్చుకుంటున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఎంతొచ్చాయనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ 'డోరతి' సినిమా రివ్యూ)ప్రముఖ నిర్మాత లగటపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా 'అనకాపల్లి'. యాక్షన్ ప్రేమకథగా దీనిని తెరకెక్కించారు. అయితే ప్రెజెంటేషన్ పర్లేదనిపించిందని, కత్తి పట్టిన వాడు చివరికి కత్తిపోటుకే ఎలా బలవుతాడు? పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు పడే వేదన ఎలా ఉంటుంది? ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న తేడా ఏంటి? అనే అంశాలని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. దీనికి కూడా తొలిరోజు వసూళ్లెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'అనకాపల్లి' సినిమా రివ్యూ) -
కలలో కూడా ఊహించలేదు.. కీర్తి సురేశ్
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తీసిన లేటెస్ట్ సినిమా 'డోరతి'. కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర పోషించింది. సనంత్, రిషికాంత్ హీరోలుగా నటించారు. గతవారం తమిళంలో రిలీజై టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయిన ఈ చిత్రం.. తాజాగా తెలుగులోనూ రిలీజైంది. అయితే ఇందులో నటించే అవకాశం రావడం తన అదృష్టమని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)నా మనసులోని ఒక భాగాన్ని 'డోరతి' సొంతం చేసుకుంది. అలా మీ హృదయాల్లో నేను చోటు సంపాదించుకున్నాను. డోరతిపై, నాపై నమ్మకం ఉంచి నన్ను మీ గుండెల్లో చోటు సంపాదించుకునేలా చేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు ధన్యవాదాలు. మా డ్రీమ్ చిత్రం (కార్తీక్ సుబ్బరాజ్‌ని ఉద్దేశించి)లో నన్ను నటింపజేసినందుకుగానూ నా కల నిజమైనట్టేనని భావిస్తున్నా. ఇళయరాజా సృష్టించిన మాయాజాలంలో నేనూ ఒక భాగం అవుతానని కలలో కూడా ఊహించలేదు' అని తన పోస్టులో రాసుకొచ్చింది.ఇకపోతే కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర పోషిస్తున్న కొత్త మూవీ 'సత్యవాన్ సావిత్రి' నవంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో న్యాయవాదిగా కీర్తి కనిపించనుంది. ఇది కూడా తెలుగులోనూ విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
‘డోరతీ’ మూవీ తెలుగు రివ్యూ
కీర్తీ సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన ప్రాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డోరతీ’. సెప్టెంబర్ 25న తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఓ వర్గం ఈ సినిమాను తీవ్రంగా ఖండిస్తే..మరో వర్గం ప్రశంసలు జల్లు కురిపించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఇప్పుడీ చిత్రాన్ని స్పిరిట్ మీడియా ద్వారా రానా దగ్గుబాటి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ శుక్రవారం(అక్టోబర్ 2) ఈ చిత్రం తెలుగులో విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘డోరతీ’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1995లో తమిళనాడులోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. వేరు వేరు సామానిక నేపథ్యాలు ఉన్న సుబ్బు(సనంత్), కార్తి(రిషికాంత్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. సుబ్బ వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. వాళ్ల నాన్న స్థానికంగా ప్రభావం ఉన్న గ్యాంగ్‌స్టర్. ఇద్దరు అన్నలు కూడా రౌడీయిజం, రాజకీయాలే చేస్తుంటారు. సుబ్బు, కార్తీ కూడా ఆ గ్యాంగ్‌లో చేరతారు. అయితే చిన్నప్పుడు పురుష అహంకారం చూపించే సుబ్బు..పెద్దయ్యాక మాత్రం పూర్తిగా మారిపోతాడు. గ్యాంగ్‌స్టర్ ప్యామిలీ సభ్యుడే అయినా.. రక్తం చూసినా వాంతులు చేసుకుంటాడు. హింసకు దూరంగా ఉంటూ..ఇంట్లోకి కొత్తగా వచ్చిన వదిన డోరతీ(కీర్తి సురేశ్)తో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అయితే అనూహ్యంగా డోరతీ కన్నుమూస్తుంది. వదిన చావుకు తన తండ్రి, అన్నదమ్ములే కారణమని సుబ్బు భావిస్తాడు. ఆమె మరణం తర్వాత సుబ్బు ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? ఆ నిర్ణయం వల్ల సుబ్బు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అసలు పెద్దయ్యాక సుబ్బులో వచ్చిన మార్పులు ఏంటి? ప్రాణ స్నేహితుడైన కార్తి.. సుబ్బుని చంపాలని ఎందుకు ప్రయత్నించాడు? చివరకు కార్తి, సుబ్బులు స్నేహం ఎలా ముగిసింది? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..జయాపజయాలను పక్కన పెడితే.. కార్తిక్ సుబ్బరాజు కథల్లో ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన సామాజిక కోణం కనిపిస్తూనే ఉంటుంది. ఎలాంటి కథను ఎంచుకున్నా.. దాంట్లో సామాజిక అసమానతలను, కుల, వర్ణ వివక్షల వంటి అంశాలను తనదైన శైలిలో చర్చించే ప్రయత్నం చేస్తుంటారు. వినోదం వెనుక ఓ బలమైన సామాజిక ప్రశ్నను సంధించడం ఆయన కథల్లో కనిపిస్తుంది. ‘డోరతీ’ కూడా అలాంటి కథే. ఇందులో లింగ వివక్ష గురించి చర్చించాడు. ట్రాన్స్ జెండర్ల పట్ల సమాజం తీరు ఎలా ఉంది? వాళ్లకు ఎదురవుతున్న అవమానాలు ఏంటి? పితృస్వామ్య సమాజం మూలంగా వారు అంతర్గతంగా ఎలాంటి క్షోభను అనుభవిస్తున్నారు?అనేది హృదయాలను హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అతి సున్నితమైనది. కొంచెం తేడా వచ్చినా.. అంతే సంగతి. కానీ కార్తిక్ సుబ్బరాజు మాత్రం తాను అవేవి పట్టించుకోకుండా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాడు. ఈ విషయంలో ఆయనను మరోసారి అభినందించొచ్చు. అయితే ఈ కథను ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమయ్యేలా.. ఎంటర్టైనింగ్గా మలచడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. కథనాన్ని ముందుకు, వెనక్కి(నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే) నడిపించడం వల్ల చాలా చోట్ల గందరగోళానికి గురి చేశాడు. అలాగే అసలు పాయింట్ చుట్ట అల్లుకున్న సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. చాలా వరకు కథనం నెమ్మదిగా సాగడంతో ఒకనొక దశలో ఎప్పుడెప్పుడు సినిమా ముగుస్తుందా? అనే ఫీలింగ్ కలుగుతుంది.సుబ్బు, కార్తి పాత్రల మధ్య స్నేహాన్ని, వారి చిన్ననాటి జీవితాన్ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. చిన్నతనంలో సుబ్బు ప్రవర్తన, అతని కుటుంబ నేపథ్యం, గ్రామంలోని కుల రాజకీయాలు, వివక్ష, హింస వంటి అంశాలను చూపించిన తీరు కథపై ఆసక్తిని పెంచుతుంది. డోరతీ పాత్ర ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. సుబ్బు ఆమెతో అన్ని విషయాలు చెప్పుకోవడం.. అంతలోనే ఆమె చనిపోవడం.. అంతలోనే ఇంకో ట్విస్ట్..ఇలా ఫస్టాప్ ప్రారంభం నెమ్మదిగా సాగినా.. ఇంటర్వెల్ సరికి ఆసక్తిని పెంచేస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం చాలా వరకు ఎమోషనల్‌గానే సాగుతుంది. ట్రాన్స్ జెండర్ల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఆయా సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నా..దర్శకుడు అటువైపు వెళ్లలేదు. పైపైనే చూపిస్తూనే. ఈ కథ ద్వారా ఏం సందేశం ఇవ్వాలో అది ఇచ్చేశారు. ఈ క్రమంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. ముగింపు కూడా అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉండదు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమా కథ ఎక్కువగా సుబ్బు, కార్తి పాత్రల చుట్టూనే తిరుగుతుంది. సుబ్బుగా సనంత్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్‌గా మారిన తర్వాత తన హవాభావవాలు, నటన చాలా సహజంగా ఉంటుంది. ఇక కార్తిగా రిషికాంత్ కూడా చక్కగా నటించాడు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కీర్తి సురేశ్ తెరపై కనిపించేది కాసేపే అయినా..గుర్తిండిపోయే పాత్ర చేసింది. మిగిలిన నటీటనలు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధానబలం. పాటలు కూడా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాలా సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
డోరతీ చూసినప్పుడు భయం వేసింది
‘‘డోరతీ’ చిత్రం చూస్తున్నప్పుడు ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఒక్కసారిగా కథ మొత్తం మారిపోయింది. అసలు కార్తీక్ ఎలాంటి కథ తీసుకున్నాడు? అనిపించింది. మొదట భయం వేసింది. ఆ తర్వాత గర్వంగా అనిపించింది. రజనీకాంత్‌లాంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసిన కార్తీక్ ‘డోరతీ’ లాంటి కథతో సినిమా చేయడం సర్ప్రైజింగ్గా అనిపించింది’’ అని రానా దగ్గుబాటి తెలిపారు. కీర్తీ సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డోరతీ’. తమిళంలో ఘన విజయం అందుకున్న ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా ద్వారా రానా దగ్గుబాటి ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. బుధవారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘డోరతీ’ నాకు ప్రత్యేకమైన సినిమా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో, తమిళనాడులో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
'స్వలింగ సంపర్కం' కాన్సెప్ట్.. కీర్తి సురేశ్ ఇలాంటి సినిమా చేసిందా?
తెలుగులో ప్రస్తుతం 'ప్యారడైజ్' గురించే డిస్కషన్ నడుస్తోంది. ఈ మూవీ బాగుందని కొందరు.. బాగోలేదని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా తెలంగాణ సినిమాని కావాలనే ఆంధ్రోళ్లు తొక్కేస్తున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజానిజాల సంగతి కాసేపు పక్కనబెడితే సోషల్ మీడియాలో అయితే దీని గురించే చర్చ. ఇదే టైంలో తమిళంలోనూ కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర చేసిన ఓ మూవీ.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' నెగిటివిటీపై స్పందించిన హీరో నాని)పిజ్జా, పేట, జిగర్తాండ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తీసిన లేటెస్ట్ మూవీ 'డోరోతి'. రిషికాంత్, సనత్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు చేశారు. శుక్రవారమే(సెప్టెంబరు 25) థియేటర్లలో తమిళంలో మాత్రమే రిలీజైంది. అయితే ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌లో మెయిన్ పాయింట్ చెప్పకుండా దాచిపెట్టారు. తీరా ఇప్పుడు మూవీని ప్రేక్షకులు చూసి షాకవుతున్నారు. ఎందుకంటే ఇది 'LGBTQ' కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అంటే హీరోలుగా చేసిన ఇద్దరబ్బాయిల మధ్య ప్రేమ పుడుతుంది.స్టోరీ ప్రకారం సనంత్, రిషికాంత్ ఇద్దరూ స్నేహితులు. అయితే రిషికాంత్ కోసం సనంత్ లింగమార్పిడి చేసుకుని అమ్మాయిగా మారతాడు. క్లైమాక్స్‌లో ఈ ఇద్దరి మధ్య లిప్‌లాక్ సీన్ కూడా ఉంది. ఈ బిట్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కీర్తి సురేశ్ కూడా వర్ణించడానికి వీల్లేని ఓ అభ్యంతరకమైన సీన్ చేసిందని మాట్లాడుకుంటున్నారు.కొందరు ఈ సినిమా చూసి డిఫరెంట్ బోల్డ్ అటెంప్ట్ అని అంటుండగా.. మరికొందరు మాత్రమే ఈ మూవీతో కోలీవుడ్ పరువు తీశారని తిడుతున్నారు. లింగమార్పిడి, స్వలింగ సంపర్కం లాంటి సున్నితమైన విషయంపై కార్తీక్ సుబ్బరాజు లాంటి స్టార్ డైరెక్టర్ ఓ మూవీ తీయడం.. అందులో కీర్తి సురేశ్ లాంటి స్టార్ హీరోయిన్ నటించడం ఇప్పుడు చర్చనీయాంశానికి కారణం.(ఇదీ చదవండి: 'మందు తాగి వినాయకుడి ముందు చిందులా? ఒక్కడికైనా మంత్రాలు వచ్చా?': రేణు దేశాయ్)


