హిజ్రాలపై అభిప్రాయాన్ని మార్చిన ‘డోరతి’ | Dorothy Success Meet Latest News | Sakshi
Sakshi News home page

హిజ్రాలపై అభిప్రాయాన్ని మార్చిన ‘డోరతి’

Oct 9 2026 7:16 AM | Updated on Oct 9 2026 7:16 AM

Dorothy Success Meet Latest News

కీర్తి సురేశ్ టైటిల్‌ పాత్ర చేసిన సినిమా డోరతి. రిషికాంత్‌, సనంత్‌ హీరోలుగా నటించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. కుటుంబం, స్నేహం వంటి అంశాలను దాటి హిజ్రాల జీవన విధానాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ బుధవారం చైన్నెలోని కమలా థియేటర్‌ లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో నగరంలోని పలువురు హిజ్రాలు పాల్గొని తమ సామాజిక వర్గాన్ని ఉన్నతంగా చూపించిన దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌‌ని అభినందించారు.

పురుషాధిక్యమే మాస్‌ అని చాలా తప్పుడు విషయాలను రుద్దుతూ సినిమాలు చేస్తున్న వారికి డోరతి ఒక చెంప పెట్టు. రోమియో జూలియట్‌‌లా డోరతి అద్భుతమైన ప్రేమకథా సినిమా అని దర్శకుడు వసంత్‌ బాలన్‌ అన్నారు. నేను తమిళ సినిమా దర్శకుడినని గర్వంగా చెప్పుకోవడానికి కారణం డోరతి. హిజ్రాల సామాజిక వర్గం గురించి చిత్రం చేయడానికి దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ ముందుకు రావడమే పెద్ద విషయం అని దర్శకుడు శశి చెప్పారు. ఎంతో ప్రేమాభిమానాలు, ధైర్యం ఉంటేనే ఇలాంటి చిత్రం చేయగలరు. కార్తీక్‌ సుబ్బరాజ్‌కి అవి ఉన్నాయని దర్శకుడు లింగుస్వామి పేర్కొన్నారు.

హిజ్రాల సామాజిక వర్గాన్ని కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ చిత్రంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అని మిస్కిన్‌ ప్రశంసించారు. సినిమా చాలా శక్తివంతమైన ఆయుధం. ప్రజల మనసుల్ని మార్చే శక్తి దానికి ఉంది. హిజ్రా సామాజిక వర్గం గురించి ఇప్పటివరకూ ఉన్న భావనని డోరతి చిత్రం కచ్చితంగా మారుస్తుందని పలువురు ప్రముఖులు నాతో అన్నారు. అదే ఈ చిత్రం విజయం అని భావిస్తున్నాను. వారి ప్రశంసలు పది కాలాలపాటు నేను, మా యూనిట్‌ గుర్తుపెట్టుకుంటామని దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement