ఆకాశంలో ఒక తార సక్సెస్.. ఆ క్రెడిట్ అంతా ఆమెకే: రాజమౌళి | SS Rajamouli Comments on Hero Dulquer Salman Success Meet | Sakshi
Sakshi News home page

SS Rajamouli: 'ఆకాశంలో ఒక తార సక్సెస్.. మీరు సోలోగా చేయాలి'

Nov 28 2026 9:07 AM | Updated on Nov 28 2026 9:07 AM

SS Rajamouli Comments on Hero Dulquer Salman Success Meet

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన లేటేస్ట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. ఈ మూవీ హిట్ కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా హీరో దుల్కర్‌ను కొనియాడారు. నిన్ను చూస్తుంటే నువ్వు మా వాడివే ‍అన్నంత ఫీలింగ్ కలుగుతోందని అన్నారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ చూసినప్పుడు నేను కూడా భావోద్వేగానికి గురయ్యానని వెల్లడించారు. స్టూడెంట్‌ నెంబర్‌ 1 సినిమాతో నేను, స్వప్న ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చామని తెలిపారు. అందుకే ఆకాశంలో ఒక తార క్రెడిట్ అంతా‌ తనకే ఇస్తున్నానని ప్రకటించారు. 

గర్ల్‌ఫ్రెండ్, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి లాంటి సినిమాలు అరవింద్‌ చేస్తున్నారు... ఇవన్నీ అవార్డు విన్నింగ్ సినిమాలు అవుతాయన్నారు. కానీ మీరు ఒక్కరే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మగధీర సినిమా తీసినట్టు సోలోగా చేయాలన్నారు. సోలోగా సినిమాలు చేస్తేనే ఆ క్రెడిట్ అంతా మీకు దక్కుతుందన్నారు. లేదంటే ఆ క్రెడిట్ మొత్తం యువ నిర్మాతలు కొట్టేస్తారని అన్నారు.  ఆకాశంలో ఒక తార కథ అందరి మనసులను హత్తుకోవడానికి కారణం అద్భుతమైన స్క్రీన్‌ ప్లేనే కారణమని దర్శకధీరుడు ప్రశంసించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement