అప్పుడు బీర్ తాగలేదు.. అందుకే మెగాస్టార్ అయ్యాను | Chiranjeevi Speech Latest Nasha Mukt Bharat Event | Sakshi
Sakshi News home page

Chiranjeevi: చిరు చెప్పిన పాత సంగతులు.. వీడియో వైరల్

Nov 28 2026 1:52 AM | Updated on Nov 28 2026 1:52 AM

Chiranjeevi Speech Latest Nasha Mukt Bharat Event

చెడు అలవాట్లకు బానిస కావొద్దని హీరో చిరంజీవి, యువతకు చెప్పారు. నటుడు కావాలనే తను చెన్నై వెళ్లినప్పుడు తను ఓ రోజు బీర్ తాగకపోవడమే ఈ రోజు తనని మెగాస్టార్‌గా మీ ముందు నిలబడేలా చేసిందని ఒకప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.

'48 ఏళ్ల క్రితం నేను హీరో కావాలనే లక్ష్యంతో చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి వెళ్లాను. రోజూ సాయంత్రం పాండీ బజార్‌లో సరదాగా తిరగడానికి చిన్నా చితక ఆర్టిస్టులు వచ్చేవారు. మొదటిసారి స్నేహితుడితో కలిసి టీ తాగేందుకు అక్కడికి వెళ్లా. ‘ఎవడ్రా ఈ అబ్బాయి’ అని అందరూ నా వైపు వింతగా చూశారు. ‘యాక్టర్‌ అవుదామని ఇనిస్టిట్యూట్‌లో చేరాడు’ అని నా ఫ్రెండ్‌ చెప్పాడు. ‘ఒక బీర్‌ ఇవ్వండి మనోడికి.. భయమంతా పోతుంది’ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే. తాగాలని ఒత్తిడి చేశారు. వద్దని చెబుతూ ఇబ్బందికరంగా అక్కడి నుంచి వెళ్లిపోయాను. మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లకూడదనుకుని నిశ్చయించుకున్నా. అదే సమయంలో ఓ పెద్ద మనిషి తారసపడి ‘నటుడు అవ్వాలన్న నీ లక్ష్యంవైపే అడుగు వేయ్‌’ అని సలహా ఇచ్చారు. అలా అన్నీ దాటుకుని వచ్చాను కాబట్టే ఇప్పుడు మెగాస్టార్‌గా.. చిరంజీవిగా మీ ముందు నిలబడ్డాను' అని చిరు చెప్పుకొచ్చారు.

డ్రగ్స్.. మీ జీవితాన్ని కబళించే పెనుభూతంలా‌ మారింది. ఎవరూ కావాలని డ్రగ్స్‌కు బానిసలు కారు. తెలియకుండానే అలవాటై వ్యసనపరుడు అవుతాడు. దీని వల్ల నువ్వు ఒక్కడివే నాశనం అయిపోవటం కాదు. నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఆశలు కూడా నీరుగారిపోతాయి. జీవితం అనేది ఒక్కటే. మరొకటి ఉంటుందో లేదో తెలియదు. ఆ జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే బతికున్నా చనిపోయినట్లే అని చిరంజీవి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement