ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ‘మయూఖ’ | mayookha movie creates a sensation in ott | Sakshi
Sakshi News home page

ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ‘మయూఖ’

Nov 27 2026 9:18 PM | Updated on Nov 27 2026 9:19 PM

mayookha movie creates a sensation in ott

యల్ చెంగప్ప దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మయూఖ’. ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్కే((శ్రీకాంత్ కండ్రాగుల)) దర్శకత్వం వహించగా.. శశిధర్ నల్ల నిర్మించారు. సస్పెన్స్ అండ్ ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 9న విడుదలైంది. మంచి ఆదరణ సొంతం చేసుకుంది. 

హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఐనాక్స్ ఓడియన్ థియేటర్‌లో 50 రోజుల ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో పాటు ఓటీటీలోనూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.  జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

కాగా థియేట్రికల్, ఓటీటీ కలెక్షన్లు కలిపి ఈ సినిమా రూ.3 కోట్లకు పైగా బిజినెస్ సాధించినట్లు అంచనా. ఇది సినిమా నిర్మాణ బడ్జెట్ కంటే మూడు రెట్లకు పైగా ఉండటం విశేషం. 

ఇదీ చదవండి: నవ్వులు పూయిస్తున్న ప్రభుదేవా ‘మూన్‌వాక్‌’ ట్రైలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement