తెలుగులో ప్రస్తుతం 'ప్యారడైజ్' గురించే డిస్కషన్ నడుస్తోంది. ఈ మూవీ బాగుందని కొందరు.. బాగోలేదని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా తెలంగాణ సినిమాని కావాలనే ఆంధ్రోళ్లు తొక్కేస్తున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజానిజాల సంగతి కాసేపు పక్కనబెడితే సోషల్ మీడియాలో అయితే దీని గురించే చర్చ. ఇదే టైంలో తమిళంలోనూ కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర చేసిన ఓ మూవీ.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది.
(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' నెగిటివిటీపై స్పందించిన హీరో నాని)
పిజ్జా, పేట, జిగర్తాండ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తీసిన లేటెస్ట్ మూవీ 'డోరోతి'. రిషికాంత్, సనత్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు చేశారు. శుక్రవారమే(సెప్టెంబరు 25) థియేటర్లలో తమిళంలో మాత్రమే రిలీజైంది. అయితే ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌లో మెయిన్ పాయింట్ చెప్పకుండా దాచిపెట్టారు. తీరా ఇప్పుడు మూవీని ప్రేక్షకులు చూసి షాకవుతున్నారు. ఎందుకంటే ఇది 'LGBTQ' కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అంటే హీరోలుగా చేసిన ఇద్దరబ్బాయిల మధ్య ప్రేమ పుడుతుంది.
స్టోరీ ప్రకారం సనంత్, రిషికాంత్ ఇద్దరూ స్నేహితులు. అయితే రిషికాంత్ కోసం సనంత్ లింగమార్పిడి చేసుకుని అమ్మాయిగా మారతాడు. క్లైమాక్స్‌లో ఈ ఇద్దరి మధ్య లిప్‌లాక్ సీన్ కూడా ఉంది. ఈ బిట్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కీర్తి సురేశ్ కూడా వర్ణించడానికి వీల్లేని ఓ అభ్యంతరకమైన సీన్ చేసిందని మాట్లాడుకుంటున్నారు.
కొందరు ఈ సినిమా చూసి డిఫరెంట్ బోల్డ్ అటెంప్ట్ అని అంటుండగా.. మరికొందరు మాత్రమే ఈ మూవీతో కోలీవుడ్ పరువు తీశారని తిడుతున్నారు. లింగమార్పిడి, స్వలింగ సంపర్కం లాంటి సున్నితమైన విషయంపై కార్తీక్ సుబ్బరాజు లాంటి స్టార్ డైరెక్టర్ ఓ మూవీ తీయడం.. అందులో కీర్తి సురేశ్ లాంటి స్టార్ హీరోయిన్ నటించడం ఇప్పుడు చర్చనీయాంశానికి కారణం.
(ఇదీ చదవండి: 'మందు తాగి వినాయకుడి ముందు చిందులా? ఒక్కడికైనా మంత్రాలు వచ్చా?': రేణు దేశాయ్)


