ఈ అవార్డు మా ఆవిడదే : సుకుమార్‌ | Sukumar Interesting Comments On His Wife At National Award Ceremony | Sakshi
Sakshi News home page

ఈ అవార్డు మా ఆవిడదే : సుకుమార్‌

Sep 25 2026 6:46 PM | Updated on Sep 25 2026 7:05 PM

Sukumar Interesting Comments On His Wife At National Award Ceremony

- ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు అందుకున్న  దర్శకుడు సుకుమార్

‘పుష్ప’ చిత్రం జాతీయ స్థాయిలో ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజా 72వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం సైతం ఆ సంగతి మరోసారి కళ్ళకు కట్టింది. 

గతంలో ‘పుష్ప-1’ చిత్రానికి అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ అవార్డు వస్తే, ఈసారి అవార్డుల్లో ‘పుష్ప-2’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) రచయితగా దర్శకుడు సుకుమార్‌ అవార్జు అందుకున్నారు.అవార్డుల ప్రదానం అయిపోయిన వెంటనే, సుకుమార్‌తో ఫోటోలు దిగేందుకు యువతీ యువకుల నుంచి పెద్దల దాకా ఎంతోమంది క్యూ కట్టారు. శ్రీమతితో సహా ఈ కార్యక్రమానికి వచ్చిన సుకుమార్, డిజైనర్  త్సాహంగా కనిపించారు.’ సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, “మా సినిమాను దేశ వ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడ్డారో ఇక్కడ చూస్తుంటే మరోసారి అర్థమైంది. అందరి కష్టంతో రూపొందిన ఓ భారీ సినిమాకు వాణిజ్య విజయంతో పాటు పురస్కారాలు సైతం రావడం ఎప్పుడూ ఆనందమే ఇస్తుంది” అన్నారు సుకుమార్.

‘తొలి జాతీయ అవార్డు అందుకున్న ఆనందం పంచుకోమ’ని కోరగానే… “నాకు మాటలు లేవు. గతంలో ‘పుష్ప’కు అవార్డులు వచ్చాయి. అయితే, ఇది నాకు వ్యక్తిగతం గా వచ్చిన తొలి నేషనల్ అవార్డు కూడా కావడంతో  నా కన్నా నా శ్రీమతికి ఎక్కువ సంతోషాన్నిచ్చింది. ఈ అవార్డు ప్రదానోత్సవానికి ఆవిడను వెంట బెట్టుకొని రావడమే కాదు… రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకొని, వేదిక దిగాక  ఆ అవార్డు మా ఆవిడ చేతిలోనే పెట్టాను. ఆమె కళ్ళల్లో ఆనందం కోసమే ఈ శ్రమంతా. అందుకే, ఈ అవార్డు నాది కాదు… నన్ను సహించి, భరించి, నిత్యం నన్ను ప్రోత్సహించే మా ఆవిడది” అని వ్యాఖ్యానించారు సుకుమార్.

మరి, ‘పుష్ప-3’ మాటేమిటి? అదే అడిగితే, “తప్పకుండా ఉంటుంది. ముందుగా రామ్ చరణ్ సినిమా చేస్తాను. అది డిసెంబర్‌లో మొదలవుతుంది. ఆ తరువాత అల్లు అర్జున్ తో ‘పుష్ప-3’ పట్టాలెక్కుతుంది” అని వివరం పంచుకున్నారు సుకుమార్. జనం చుట్టూ మూగి ఫోటోలు అడుగుతుంటే, ఓపికగా అందరికీ ఫోటోలిస్తున్న సుకుమార్ ను దగ్గర నుంచి చూస్తూ శ్రీమతి సుకుమార్ ఆనందంతో ఉప్పొంగి పోవడం వేదిక వద్ద  కనిపించింది. ‘పుష్ప-2’ చిత్రానికే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో శీతల్ ఇక్బాల్ చంద్ శర్మ, దీపాలీ నూర్‌ లు సైతం అవార్డులు అందుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన దీపాలీ నూర్ ప్రత్యేకంగా వారిని సుకుమార్‌కు పరిచయం చేయగా, వారు ఆయనతో ఫోటోలు దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement