నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ప్యారడైజ్'. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఇస్తున్నారు. ఇప్పుడు వీటిపై నాని స్వయంగా స్పందించాడు. ట్రోల్స్, మూవీపై వస్తున్న నెగిటివిటీ గురించి ట్వీట్ చేశాడు.
(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)
'మీ అందరి స్పందన, ప్రేమని చూశాను. మీ ఫన్నీ ట్రోల్స్ ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ దానిలా దగ్గరకు తీసుకోవడం నా మనసుని తాకింది. అదే టైంలో విమర్శకులు, రివ్యూయర్లు ఎత్తిచూపిన లోపాల నుంచి కూడా నేను నేర్చుకున్నాను. అన్నింటికీ థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను'
'మీకు ఓ ప్రత్యేకమైన అనుభూతి అందించాలనే ఉద్దేశంతో 'ద ప్యారడైజ్' సినిమాని కష్టపడి తీశాం. ఇప్పుడు ఇది పూర్తిగా మీది. మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదా జడ్జ్ చేయొచ్చు. సినిమాపై మీరు చూపించిన ఉత్సాహం, నాపై మీరు చూపించిన ఆప్యాయత నన్ను ఎంతో సంతోషపడేలా చేశాయి' అని నాని ట్వీట్ చేశాడు.
బానిసలుగా బతుకుతున్న ఓ తెగకు హీరో ఎలా గుర్తింపు తీసుకొచ్చాడు? ఈ క్రమంలోనే ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అనే స్టోరీ లైన్‌తో ఈ సినిమా తీశారు. తొలిరోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రూ.88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించుకున్నారు.
(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' ఫలితం.. చిరంజీవితో సినిమా సంగతేంటి?)


