24ఏళ్ల కుర్రాడిలా మహేశ్‌.. క్లీన్ షేవ్‌ అంటూ.. | Mahesh Babu Clean Shaven Look Sparks Buzz Is This His 24 Year Old Look in Varanasi | Sakshi
Sakshi News home page

Mahesh Babu : 24ఏళ్ల కుర్రాడిలా మహేశ్‌.. క్లీన్ షేవ్‌ అంటూ..

Sep 25 2026 1:23 PM | Updated on Sep 25 2026 1:35 PM

Mahesh Babu Clean Shaven Look Sparks Buzz Is This His 24 Year Old Look in Varanasi

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: గానమే ఈమెకు గుర్తింపు తెచ్చింది.. ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదగానే..

24 ఏళ్ల కుర్రాడిగా..
కాగా.. ‘వారణాసి’లో మహేశ్‌బాబు పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలోని ఓ కీలక ఎపిసోడ్‌లో మహేశ్‌ 24 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను మహేశ్‌ పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే డబ్బింగ్‌ పనులను కూడా ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’..

ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో..
ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్‌బాబు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. క్లీన్ షేవ్‌తో ఉన్న ఆయనను చూసిన అభిమానులు ‘వారణాసి’లోని యంగ్ లుక్‌పై వస్తున్న వార్తలను గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు.. కెమెరా వైపు చూస్తూ మహేశ్‌ నవ్వుతూ, ‘గడ్డం లేదు బాస్‌.. ఇప్పుడు ఏం చేద్దాం?’ అన్నట్టుగా సైగ చేశారు. దీంతో మహేశ్‌ కొత్త లుక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఈ క్లీన్ షేవ్ లుక్‌ ‘వారణాసి’లోని 24 ఏళ్ల యువకుడి పాత్ర కోసమేనా? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement