కొందరి వయసుని అస్సలు ఊహించలేం... ఉన్న వయసుకన్నా తక్కువగా కనబడుతుంటారు. సినిమా హీరోల్లో అలా కనిపించేవారిలో మహేశ్‌బాబు ఒకరు. ఇప్పుడు వయసు ప్రస్తావన ఎందుకంటే... ‘వారణాసి’ సినిమాలో ఓ కీలక ఎపిసోడ్‌లో మహేశ్ 24 ఏళ్ల కుర్రాడిలా కనిపించనున్నారట. అందుకోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యా రని సమాచారం. ఇలా తక్కువ వయసులో కనిపించడానికి ఇప్పుడు ఏఐతోనో, విజువల్ ఎఫెక్ట్స్‌తోనే మేజిక్ చేయొచ్చు.
కానీ టెక్నాలజీ సహాయంతో కాకుండా రియల్‌గానే తాను 24 ఏళ్ల కుర్రాడిలా కనిపించేలా మహేశ్ మేకోవర్ అయ్యారట. ఈ ఎపిసోడ్‌లో మహేశ్‌బాబు లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. ఈ రెండూ కాకుండా ఇంకొన్ని షేడ్స్‌లోనూ కనిపిస్తారట. గత ఏడాది జనవరిలో ఈ చిత్రంఆరంభమైంది.
తాజాగా తన పాత్రకు సంబంధించిన షూట్‌ని మొత్తం మహేశ్‌బాబు పూర్తి చేశారని తెలిసింది. అలాగే డబ్బింగ్ చెప్పడం కూడా మొదలుపెట్టారట. అక్టోబరు కల్లా మిగతా నటీనటులతో చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలన్నది రాజమౌళి ప్లాన్ అని తెలిసింది. ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో ఎస్‌ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2027 ఏప్రిల్ 7న దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


