స్టార్ హీరోలపై మానస వారణాసి కన్ను..! | Manasa Varanasi sets her Focus on star heroes | Sakshi
Sakshi News home page

ఆచితూచి అడుగులు.. స్టార్ హీరోలపై మానస వారణాసి కన్ను..!

Sep 23 2026 11:11 PM | Updated on Sep 23 2026 11:20 PM

Manasa Varanasi sets her Focus on star heroes

ఓ హీరోయిన్‌కు హిట్ వస్తే వరుస అవకాశాలు రావడం, రెమ్యూనరేషన్ పెరగడం సహజం. అయితే మానస వారణాసి మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. సంతోష్‌ శోభన్‌తో చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ గర్ల్‌ఫ్రెండ్‌ పాత్రలో మానస కనిపించనుంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. లవ్ స్టోరీతో పాటు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఈ సినిమాలో ఉండనుందని సమాచారం. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం మానస వారణాసి టూ టైర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. కానీ రామ్‌ చరణ్, బన్నీ, ప్రభాస్, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ఎప్పుడు దక్కుతుందా అని ఎదురుచూస్తోంది. మానసను చూడ‌గానే స్టార్ హీరోయిన్ మెటీరియ‌ల్ అని అంటారు. పైగా అందాల పోటీల రాణిగా కూడా నిరూపించుకుని వ‌చ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మరే అవకాశం లేకపోలేదు. కానీ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తే మానస కెరీర్ మరింత వేగంగా టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది. అయితే రష్మిక తరహాలో ఆమెకు కూడా వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయా అనేది రానున్న రోజుల్లో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement