ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎవరో తెలుసా? | Tollywood Star Director Childhood Pic Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..!

Sep 23 2026 6:48 PM | Updated on Sep 23 2026 7:10 PM

Tollywood Star Director Childhood Pic Goes Viral In Social Media

ఎవరికైనా సరే చిన్నప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎలాంటి కల్లాకపటం లేని ఆ పసిపిల్లాడిగా ఉన్న రోజులు మన జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు. ఆ రోజులు ఎలాగు తిరిగిరావని మనందరికీ తెలుసు.. కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మన కళ్లముందు కనిపిస్తే ఎలా ఉంటుంది. బాల్యంలోని అరుదైన ఫోటోలు దొరికితే మన ఆనందానికి అవధులుండవు. మన జీవితంలో అన్నింటికీ మించిన అమూల్యమైన దశ మన బాల్యం. అందుకే ఆ రోజులంటే మనకు చాలా ఇష్టం.  ఆ రోజుల నాటి ఫోటోలు కనిపిస్తే ఇప్పుడు ఆగుతామా? వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తాం. తాజాగా మన టాలీవుడ్ డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల కూడా అదే పనిచేశాడు. రెండు జడలతో క్యూట్‌గా ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు. ది ప్యారడైజ్ రిలీజ్‌ వేళ ఆ ఫోటో మరింత స్పెషల్‌గా మారింది.  

తాజాగా ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన చిన్ననాటి ఫోటోను ఆయన షేర్ చేశారు. రెండు జడలతో క్యూట్‌గా పిక్‌ను పంచుకున్నారు. జడల్ పుట్టుక, పోరాటం కల్పితం కావచ్చు... కానీ అతని జడలు, రూపం నా చిన్ననాటి నుండి ప్రేరణ పొందాయి... నేను పెరిగేకొద్దీ ఈ సినిమాలో చాలా సన్నివేశాలు నా చిన్ననాటి జ్ఞాపకాలతో ప్రభావితమయ్యాయని రాసుకొచ్చారు.  

నాకు ఐదారు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అమ్మ జడలు వేసి కట్టేది... నేను పెద్దయ్యాక.. కమర్షియల్ సినిమాలో 70ఎంఎం తెరపై జడలతో ఒక హీరో ఎలా కనిపిస్తాడో అని ఎప్పుడూ ఊహించుకునేవాడిని... ఇక ఇప్పుడు జడల్‌తో ఉన్న నా హీరో నాని అన్నను మీకు పరిచయం చేస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. ఈ ఫోటో కేవలం నా చిన్ననాటిది కాదు.. ఈ చిత్రం నా ప్యారడైజ్.. మీ అందరికీ ది ప్యారడైజ్‌లోకి స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement