సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా | Awarapan 2 OTT Release, Emraan Hashmi Hit Film Now Available For Rent On Prime Video, Read Story Inside | Sakshi
Sakshi News home page

Awarapan 2 OTT: యాక్షన్ క్రైమ్ రొమాంటిక్ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్

Sep 25 2026 12:22 PM | Updated on Sep 25 2026 1:02 PM

Awarapan 2 OTT Streaming Now On Rent

కొన్నిసార్లు పెద్దగా అంచనాల్లేకుండా రిలీజయ్యే కొన్ని సినిమాలు ఊహించని కలెక్షన్స్ సాధించి హిట్ అవుతుంటాయి. పెట్టిన బడ్జెట్‌కి మూడు నాలుగింతలు రాబట్టుకుంటాయి. అలాంటి ఓ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి పెద్దగా హడావుడి లేకుండానే వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి నయన్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

ఇమ్రాన్ హష్మి హీరోగా చేసిన 'అవారపన్' సినిమా 2007లో రిలీజైంది. అప్పట్లో జనాలు పెద్దగా పట్టించుకోలేదు గానీ తర్వాత కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'అవారపన్ 2'.. గత నెల 14న థియేటర్లలోకి వచ్చింది. రూ.45 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.213 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఉచితంగానూ స్ట్రీమింగ్‌లోకి రావొచ్చు. హిందీలో మాత్రమే దీన్ని చూడొచ్చు.'

అవారపన్ 2' విషయానికొస్తే.. ఆలియా హమిద్ (శ్రియ) చావు.. శివమ్ పండిట్(ఇమ్రాన్ హష్మి)ని బాధపెడుతూనే ఉంటుంది. పుట్టినరోజున నివాళి అర్పించేందుకు ఆమె సమాధి దగ్గరకు శివమ్ వెళ్లగా.. అక్కడో పసికందు కనిపిస్తుంది. ఆ పాపకు ఆలియా అని పేరు పెట్టి అనాథశ్రమంలో చేర్పిస్తాడు. అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. పదేళ్ల తర్వాత పాపని ఓ జంట దత్తత తీసుకుంటుంది. అయితే ఓసారి గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ జంటని హత్య చేసి పాపని ఎత్తుకెళ్లిపోతారు.

ఆలియాతో పాటు మరికొందరు పిల్లలని కిడ్నాప్‌ చేసి బ్యాంకాక్‌ తరలిస్తారు. ఆ గ్యాంగ్‌ని అధికారికంగా పట్టుకోలేమని అందుకు సాయం చేయమని ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ సమ్రత్‌ (అతుల్‌ కుమార్‌) శివమ్‌ని అడుగుతాడు. మరి బ్యాంకాక్‌ వెళ్లిన శివమ్‌‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆలియాని శివమ్‌ విడిపించాడా? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: శోభనం రాత్రి ఏం జరిగింది? ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement