కలలో కూడా ఊహించలేదు.. కీర్తి సురేశ్ | Keerthy Suresh About Dorothy Movie | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్నా

Oct 3 2026 8:42 AM | Updated on Oct 3 2026 8:42 AM

Keerthy Suresh About Dorothy Movie

తమిళ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ తీసిన లేటెస్ట్ సినిమా 'డోరతి'. కీర్తి సురేశ్ టైటిల్‌ పాత్ర పోషించింది. సనంత్, రిషికాంత్‌ హీరోలుగా నటించారు. గతవారం తమిళంలో రిలీజై టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయిన ఈ చిత్రం.. తాజాగా తెలుగులోనూ రిలీజైంది. అయితే ఇందులో నటించే అవకాశం రావడం తన అదృష్టమని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)

నా మనసులోని ఒక భాగాన్ని 'డోరతి' సొంతం చేసుకుంది. అలా మీ హృదయాల్లో నేను చోటు సంపాదించుకున్నాను. డోరతిపై, నాపై నమ్మకం ఉంచి నన్ను మీ గుండెల్లో చోటు సంపాదించుకునేలా చేసిన దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌కు ధన్యవాదాలు. మా డ్రీమ్‌ చిత్రం (కార్తీక్‌ సుబ్బరాజ్‌ని ఉద్దేశించి)లో నన్ను నటింపజేసినందుకుగానూ నా కల నిజమైనట్టేనని భావిస్తున్నా. ఇళయరాజా సృష్టించిన మాయాజాలంలో నేనూ ఒక భాగం అవుతానని కలలో కూడా ఊహించలేదు' అని తన పోస్టులో రాసుకొచ్చింది.

ఇకపోతే కీర్తి సురేశ్ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న కొత్త మూవీ 'సత్యవాన్‌ సావిత్రి' నవంబర్‌ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.  ఇందులో న్యాయవాదిగా కీర్తి కనిపించనుంది. ఇది కూడా తెలుగులోనూ విడుదల కానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement