మలయాళ ఇండస్ట్రీ అనగానే థ్రిల్లర్ కథలే గుర్తొస్తాయి. నెలకు ఒకటి రెండు అయినా ఈ జానర్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ తరహా స్టోరీలతో సిరీస్‌లు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ట్రైలర్ వదిలారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
'ఉయరే', 'కాణెక్కిణే' సినిమాలతో ఆకట్టుకున్న మను అశోకన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ 'ఐస్'. దేవ్ మోహన్, నిఖిలా విమల్, కని కుసృతి, శృతి రామచంద్రన్, సానియా అయ్యప్పన్ ప్రధాన పాత్రలు చేశారు. వచ్చే శుక్రవారం(అక్టోబరు 09) నుంచి సోనీ లివ్ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ బట్టి చూస్తే మానవ సంబంధాల్లోని చీకటి కోణాలు, మనుషుల మధ్య ఉండే ప్రేమ.. పిచ్చిప్రేమగా మారితే ఏమవుతుందో ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. స్టాకింగ్ (వెంటాడటం), దాని వెనుక ఉన్న మానసిక ధోరణులు, పరిస్థితులు సీరియస్ కాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు. ఇందుకోసం మానసిక ఆరోగ్య నిపుణులు, పోలీసులు కలిసి కేసులని విశ్లేషిస్తూ స్టాకర్ల ప్రవర్తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం.. మహిళలపై జరుగుతున్న ఘటనల దర్యాప్తు నేపథ్యం ఇందులో ప్రధానంగా ఉండనుంది. ట్రైలర్ పర్లేదనేలా ఉంది. మరి సిరీస్ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)


