చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం గాంధీ జయంతి కావడంతో హాలీడే కలిసి రానుంది. ఈ ఫ్రైడే రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీతో పాటు దళపతి విజయ్ కొడుకు జేసన్ దర్శకుడిగా తొలిసారి చేసిన 'సిగ్మా', తెల్ల కాగితం, అనకాపల్లి, ప్రేమనే ఊరిలో లాంటి మూవీస్ ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేయనున్నాయి.
ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ మూవీ మహేంద్రగిరి వారాహి స్ట్రీమింగ్‌కు రానుంది. దీంతో పాటు మలయాళ హిట్ సినిమా బెత్లెహమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు ఈ శుక్రవారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
#లవ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 02
డూయింగ్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02
షూమాకర్ '94: ద బర్త్ ఆఫ్ ఏ లెజెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02
టైలర్ పెర్రీస్ డూయింగ్ లైఫ్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 02
బ్లూ బాక్స్- సీజన్ 2- (జపనీస్ సిరీస్)- అక్టోబర్ 04
జియో హాట్‌స్టార్
బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02
వార్(హాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 03
మార్షల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04
ట్రాకర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04
అమెజాన్ ప్రైమ్
మహేంద్రగిరి వారాహి(తెలుగు సినిమా)- అక్టోబర్ 02
జీ5
పూజా మేరీ జాన్ (హిందీ సినిమా) - అక్టోబరు 02
మదర్ ప్రామిస్ (కన్నడ చిత్రం) - అక్టోబరు 02
ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02
మడగాస్కర్- ఏ లిటిల్ వైల్డ్(హాలీవుడ్ మూవీ)- అక్టోబరు 02
ఆపిల్ టీవీ ప్లస్..
ద లాస్ట్ ఫస్ట్: వింటర్ కె2 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 02
హెచ్‌బీవో మ్యాక్స్..
ఈవిల్‌డెడ్‌బర్న్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 02


