ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఇవాళ అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా కొత్త కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. ఐకాన్‌జా పేరుతో ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా న్యూ ఆఫీస్.. న్యూ బిగినింగ్.. కొత్త అధ్యాయం ప్రారంభం అని ఫోటో షేర్ చేశారు. ఇందులో అల్లు అరవింద్ దంపతులు, చిరంజీవి సతీమణి సురేఖ, శిరీష్-నైనిక, అల్లు వెంకటేష్ దంపతులు కనిపించారు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాకా మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
ICONZA
A new office. A new beginning.
On the birth anniversary of my grandfather, Allu Ramalingaiah garu.
The start of a new chapter. 🖤#ICONZA #ARG pic.twitter.com/vK9KyvVrso— Allu Arjun (@alluarjun) October 1, 2026


