ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్‌ భార్య సుమలత హల్‌చల్ | Jani Master Wife Sumalatha Halchal At Film Chamber Office | Sakshi
Sakshi News home page

Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. సుమలత హల్‌చల్

Oct 1 2026 5:00 PM | Updated on Oct 1 2026 5:16 PM

Jani Master Wife Sumalatha Halchal At Film Chamber Office

ఫిల్మ్‌ చాంబర్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫెడరేషన్ సమావేశంలోకి జానీమాస్టర్ సతీమణి సుమలత దూసుకొచ్చింది. ఫెడరేషన్‌ నాయకులతో సుమలత వాగ్వాదానికి దిగింది. సమావేశానికి తనను అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఛాంబర్ బయటే సుమలకు ఆందోళనకు దిగారు. డాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా తనను సమావేశానికి ఎందుకు అనుమతించలేదని సుమలత ప్రశ్నించారు. 

కాగా.. గత కొంతకాలంగా ‘తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో వరుస వివాదాలు కొనసాగుతున్నాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలత(జానీ మాస్టర్‌ సతీమణి)ను పదవి నుంచి తొలగిస్తూ.. ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమలత, రఘు మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తనను అసభ్య పదజాలంతో దూషించారంటూ సుమలత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది. ఈ వివాదం మరింత ముదిరి టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement