నా క్యారెక్టర్ విషయంలో మోసం జరిగింది: ది ప్యారడైజ్‌పై మోహన్ బాబు | Mohan Babu about The Paradise Movie Role Chance to him | Sakshi
Sakshi News home page

The Paradise Movie: 'డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశారు'

Oct 1 2026 3:36 PM | Updated on Oct 1 2026 3:52 PM

Mohan Babu about The Paradise Movie Role Chance to him

నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. గుర్తింపు లేని సవారీలు ‍అనే జాతి పోరాడే కథాంశంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్యారడైజ్ ప్రాంతం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

ఈ మూవీలో టాలీవుడ్ నటుడు మోహన్‌ బాబు కీలక పాత్రలో మెప్పించారు. శికంజమాలిక్‌ రోల్‌లో ఆడియన్స్‌ను భయపెట్టేశారు. తాజాగా తన రోల్‌కు సంబంధించి మోహన్ బాబు మాట్లాడారు. ఎందుకు చేశారు అంటే కారణం చెప్పలేను కానీ... అదేదో ఒప్పుకునేశానని అన్నారు. నాని అంటే నాకు ఇష్టమని.. అందుకే ఓకే చెప్పానన్నారు. అయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనను మోసం చేశాడన్నారు. తనకు జోడీగా ఓ హీరోయిన్‌ ఉంటుందని చెప్పి, షూటింగ్‌ మొదలయ్యాక మాట మార్చాడని సరదాగా అన్నారు. నాకు ఇచ్చిన రోల్‌ చాలా భయంకరమైనది.. గర్భిణీ స్త్రీలను నరకడం లాంటి క్యారెక్టర్‌ ఇచ్చారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement