కేసీఆర్‌ మాదిరిగానే రేవంత్‌ నాటకాలు: కిషన్ రెడ్డి | Kishan Reddy says CM Revanth Reddy is irresponsible | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మాదిరిగానే రేవంత్‌ నాటకాలు: కిషన్ రెడ్డి

Oct 1 2026 11:57 AM | Updated on Oct 1 2026 12:10 PM

Kishan Reddy says CM Revanth Reddy is irresponsible

ఢిల్లీ : సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటూ కేంద్ర గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల పై సీఎం రేవంత్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలను అందరూ చీదరించుకుంటున్నారని అ‍న్నారు. ‘2023లో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు,  420 సబ్ గ్యారెంటీలు అమలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారు. దేవుళ్ళపై అవాకులుచెవాకులు మాట్లాడుతున్నారు’ అని కిషన్‌ రెడ్డి అన్నారు. తన అవసరాల కోసం ఏ గడ్డి తినడానికి అయినా ఆయన వెనుకాడరని, గతంలో కెసిఆర్ ఆడిన నాటకాలే రేవంత్ ఆడుతున్నారన్నారు.

తన వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తున్నారని, హిందువులంటే చులకనగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇతర మతాలపై ఇలా మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించారు. 50 శాతం పెంపు ఫార్ములాతో  దక్షిణ రాష్ట్రాలకు నాయ్యం చేస్తామంటే ఎందుకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదు. సోనియా కుటుంబానికి బానిస అని,  ఆ కుటుంబం కోసం ప్రాణ త్యాగం చేస్తానని రేవంత్ అంటున్నారన్నారు.  ​కాగా ఎల్లుండి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని, నాలుగున తూప్రాన్ లో పాల ఉత్పత్తి సహకార సమాఖ్య భవన్ శంకుస్థాపన చేస్తారని కిషన్‌ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్ చేపట్టనున్నామని, ఫైళ్ల క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: శిష్యుడి మృతి.. ప్రేమానంద ఆశ్రమంలో అసలేం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement