గణేష్‌ ఉత్సవాల్లో గ‌లీజు ప‌నులు | Hyderabad SHE teams apprehend 2935 Eve Teasers during Ganesh Festival | Sakshi
Sakshi News home page

షీ–టీమ్స్‌కు చిక్కిన 2,935 మంది పోకిరీలు

Sep 30 2026 3:10 PM | Updated on Sep 30 2026 3:38 PM

Hyderabad SHE teams apprehend 2935 Eve Teasers during Ganesh Festival

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

  • వివరాలు వెల్లడించిన అదనపు సీపీ శ్రీనివాసులు 

వినాయ‌క నిమ‌జ్జ‌న ఉత్స‌వాల్లో పోకిరీలు రెచ్చిపోయారు. సంద‌ట్లో స‌డేమియా త‌ర‌హాలో అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. మ‌హిళ‌లు, బాలికల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌రిస్తూ పైశాచిక ఆనందం పొందారు. ప‌నిలో ప‌నిగా దొంగ‌లు కూడా త‌మ చోర క‌ళ‌ను ప్ర‌ద‌ర్శించారు. భాగ్య‌న‌గ‌ర పోలీసులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి జులాయిలతో పాటు చోరుల‌ ఆట క‌ట్టించారు.

సాక్షి, హైద‌రాబాద్‌: గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని మండపాల వద్ద నేరాలు చేయడానికి అనేకమంది రంగంలోకి దిగారు. స్నాచింగ్స్‌తోపాటు జేబు దొంగతనాలు చేసే ఉద్దేశంతో ఖైరతాబాద్‌ బడా గణేషుడి వద్ద, ఇతర ప్రాంతాల్లో తచ్చాడుతుండగా పలువురిని సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్‌ టీమ్స్‌ పట్టుకున్నాయని అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు మంగళవారం పేర్కొన్నారు.

ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు 25 ప్రత్యేక బృందాలు 1,917 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాయి. వీరిలో 31 మందిని లోతుగా విచారించగా, పది మందికి నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. దీంతో వీరిని ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడుతున్న 2935 మందిని షీ–టీమ్స్‌ అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 858 మందికి కౌన్సెలింగ్‌ చేసి విడిచిపెట్టారు. మరో 69 మందిని న్యాయస్థానంలో హాజరుపరచగా శిక్ష పడింది. 24 మందికి రూ.1050 జరిమానా, 40 మందికి సామాజిక సేవతోపాటు జరిమానా, ఐదుగురికి జరిమానాతోపాటు జైలు శిక్ష పడింది.

ఇదీ చ‌ద‌వండి: వినూత్నంగా హైదరాబాద్‌ పెన్ షో.. ఎక్క‌డో తెలుసా?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement