పేషెంట్లుగా వెళ్లిన పోలీసులు... నకిలీ డాక్లర్లకు బిగ్‌ షాక్‌! | Hyderabad Fake Doctors Arrested When Police Raids Clinics | Sakshi
Sakshi News home page

పేషెంట్లుగా వెళ్లిన పోలీసులు... నకిలీ డాక్లర్లకు బిగ్‌ షాక్‌!

Sep 30 2026 10:28 AM | Updated on Sep 30 2026 10:43 AM

Hyderabad Fake Doctors Arrested When Police Raids Clinics

పట్టుబడిన శ్యాంసుందర్‌

ఆకస్మిక తనిఖీలతో ఐదుగురు నకిలీ వైద్యుల అరెస్ట్‌

మల్లాపూర్‌లో ముగ్గురు, రాంగోపాల్‌పేట, మేడిపల్లిలో ఒకరి చొప్పున

హైదరాబాద్‌: ఐదుగురు నకిలీ వైద్యులు మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. మల్లాపూర్‌ పరిధిలో ముగ్గురు, రాంగోపాల్‌పేట, మేడిపల్లిలో ఒకరి చొప్పున పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి వైద్య విద్యార్హతలు, రిజిస్ట్రేషన్‌, అనుమతులు లేకుండా సేవలు అందిస్తున్న నకిలీ వైద్యుల వద్దకు పోలీసులు రోగుల రూపంలో వెళ్లారు. వైద్యవిధానాన్ని పరిశీలించి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

మల్లాపూర్‌ చండీయానగర్‌లో నవోదయ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ పేరుతో చిక్సిత అందిస్తున్న ఇస్మాయిల్, వెంకటరమణ కాలనీలో రుదీక్ష మెడికల్‌ జనరల్‌ స్టోర్‌ పేరుతో గంగుల సాయితేజ, సూర్యనగర్‌లో వెంకటేశ్వర ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్‌ పేరుతో వైద్యసేవలు అందిస్తున్న పూల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మైబెల్లి తెలిపారు.

గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ‘మైసమ్మ ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌’ పేరుతో క్లినిక్‌ నిర్వహిస్తున్న కేశవరావు అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. క్లినిక్‌ వద్ద రిజిస్ట్రేషన్‌‌ నంబర్‌ పేరుతో వివరాలు ప్రదర్శించినప్పటికీ, పోలీసులు తనిఖీ చేసిన సమయంలో సరైన అనుమతులు, పత్రాలు చూపించలేదని సమాచారం. మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు క్లినిక్‌పై దాడి చేసి కేశవరావును అదుపులోకి తీసుకున్నారు. కాగా, బోడుప్పల్‌ బొల్లిగూడెం శ్రీసాయి నగర్‌ శ్రీలక్ష‍్మీనర్సిహ క్లినిక్‌ నిర్వహిస్తున్న బోడ శ్యాంసుందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: నేను ముందు వెళ్తున్నాను.. తాను ఉదయం వెళ్తుందని చెప్పి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement