సూర్యాపేట జిల్లాలో బస్సు బోల్తా | Another Bus Accident In Telangana, Five Injured After Private Bus Overturns On Suryapet–Khammam Highway | Sakshi
Sakshi News home page

సూర్యాపేట జిల్లాలో బస్సు బోల్తా

Sep 30 2026 6:52 AM | Updated on Sep 30 2026 9:45 AM

Private Travels Bus Overturns In Suryapet District

సాక్షి, సూర్యాపేట జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సూర్యాపేట- ఖమ్మం హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మోతె మండలం హుస్సేనాబాద్ వద్ద ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు.

కాగా, సెప్టెంబర్‌ 14న శంషాబాద్‌ కిషన్‌గూడా వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ కంటైనర్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అయితే వేగంగా వస్తున్న ప్రైవేట్‌ టావెల్స్‌ బస్సు దానిని తప్పించబోయి హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మూడు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం ధాటికి హోటల్‌ పరిసరాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 

కాగా, ఇటీవల తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి 19 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. బుధవారం(సెప్టెంబర్‌ 9) అర్ధరాత్రి దాటిన అనంతరం ఓజిలి వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన కామాక్షి ట్రావెల్స్‌ బస్సు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రేపల్లె నుంచి బెంగళూరుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, 19 మంది ప్రయాణికులతో బయలుదేరింది.

మొదటి డ్రైవర్‌ జేడీ ప్రేమ్‌ రాత్రి 10 గంటలకు ఒంగోలు వద్దకు వచ్చేసరికి బస్సును రెండవ డ్రైవర్‌ తిరుపతయ్యకు అప్పగించారు. అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో ఓజిలి పెద్దచెరువు సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్‌ నుంచి కాలిన వాసన, పొగ రావడాన్ని డ్రైవర్‌ తిరుపతయ్య గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బస్సుకు ఉన్న అన్ని తలుపులు తెరిచి ప్రయాణికులను దించి దూరంగా పంపివేశారు. కొద్దిసేపటికి బస్సు డీజిల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలిపోయింది.

ఇదీ చదవండి: బస్సులపై మళ్లీ ప్రకటనలు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement