నేడు కరీంనగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి | Telangana CM Revanth Reddy to Visit Karimnagar on September 30 | Sakshi
Sakshi News home page

నేడు కరీంనగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

Sep 30 2026 5:49 AM | Updated on Sep 30 2026 5:49 AM

Telangana CM Revanth Reddy to Visit Karimnagar on September 30

విద్యుత్‌ కాంతుల్లో సభా ప్రాంగణం

సాయంత్రం సిరిసిల్లలో బహిరంగ సభ 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/­సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించను­న్నా­రు. టూర్‌ షెడ్యూల్‌ను సీఎం పర్సనల్‌ సెక్రటరీ నర్మాల శ్రీనివాస్‌ మంగళ­వా­రం సాయంత్రం వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కరీంనగర్‌ చేరుకుంటారు. 3.10 నుంచి 3.40 గంటల మధ్య పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. తెలంగాణ తల్లి విగ్ర­హాన్ని ఆవిష్కరిస్తారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు.

 వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3.40 నుంచి 4.25 గంటల మధ్య నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ భవనంలో కలెక్టర్‌ చాంబర్, ఇతర అధికారుల చాంబర్లను జిల్లా అధికారులతో కలిసి పరిశీలిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలోని హెలిప్యాడ్‌కు సీఎం చేరుకుంటారు. 5.00 గంటలకు అంబేడ్కర్‌ సర్కిల్‌కు చేరుకొని పాదయాత్రగా పాత బస్టాండు, నేతన్న చౌక్‌ మీదుగా సభాస్థలివరకు వెళతారు. 6.00 నుంచి 6.15 గంటల మధ్య సభాస్థలం వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement