సింగరేణి కార్మికుల హక్కులను కాలరాయొద్దు | BRS Working President KTR letter to CM Revanth | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుల హక్కులను కాలరాయొద్దు

Sep 30 2026 5:43 AM | Updated on Sep 30 2026 5:43 AM

BRS Working President KTR letter to CM Revanth

సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సంస్థను బలో పేతం చేయాల్సిన ప్రభుత్వం, దానిని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశా రు. 2023–24లో సింగరేణి రూ.4,701 కోట్ల నికర లాభం ఆర్జించగా, 33 శాతం వాటా ప్రకారం రూ.1,551 కోట్లు రావాల్సి ఉన్నా రూ.796 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. 2024–25లో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినా, రూ.819 కోట్లు మాత్రమే బోనస్‌గా చెల్లించారని తెలిపారు. 

2023 నుంచి 2025 వరకు కార్మికుల బోనస్‌కు సంబంధించిన బకాయిలు రూ.2,342 కోట్లుగా ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొ న్నారు. వాస్తవ నికర లాభాల ఆధారంగా ఈ ఏడాది సింగరేణి కార్మికులకు 36 శాతానికి పైగా లాభాల వా టా చెల్లించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పెర్క్స్‌పై ఆదాయపు పన్ను సమస్యను పరిష్కరించి కార్మికులకు బకాయిలు తిరిగి చెల్లించాలని కోరారు. 

2,500 మందికిపైగా కార్మికులకు మూడు నెలల్లోగా మెడికల్‌ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వ హించి అన్‌ఫిట్‌ అయిన వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. మారు పేర్ల సమస్యను పరిష్కరించి డిస్మిస్‌ అయిన కార్మికులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని, 250 గజాల స్థలంతోపాటు రూ.20 లక్షల వడ్డీలేని రుణంతో సొంతింటి పథకాన్ని అమలు చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌కో, జెన్‌కోల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement