breaking news
ganesh festival
-
గణేష్ ఉత్సవాల్లో గలీజు పనులు
వినాయక నిమజ్జన ఉత్సవాల్లో పోకిరీలు రెచ్చిపోయారు. సందట్లో సడేమియా తరహాలో అనైతిక చర్యలకు పాల్పడ్డారు. మహిళలు, బాలికల పట్ల అనుచితంగా ప్రవరిస్తూ పైశాచిక ఆనందం పొందారు. పనిలో పనిగా దొంగలు కూడా తమ చోర కళను ప్రదర్శించారు. భాగ్యనగర పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి జులాయిలతో పాటు చోరుల ఆట కట్టించారు.సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని మండపాల వద్ద నేరాలు చేయడానికి అనేకమంది రంగంలోకి దిగారు. స్నాచింగ్స్తోపాటు జేబు దొంగతనాలు చేసే ఉద్దేశంతో ఖైరతాబాద్ బడా గణేషుడి వద్ద, ఇతర ప్రాంతాల్లో తచ్చాడుతుండగా పలువురిని సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ టీమ్స్ పట్టుకున్నాయని అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు మంగళవారం పేర్కొన్నారు.ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు 25 ప్రత్యేక బృందాలు 1,917 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాయి. వీరిలో 31 మందిని లోతుగా విచారించగా, పది మందికి నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. దీంతో వీరిని ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడుతున్న 2935 మందిని షీ–టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 858 మందికి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టారు. మరో 69 మందిని న్యాయస్థానంలో హాజరుపరచగా శిక్ష పడింది. 24 మందికి రూ.1050 జరిమానా, 40 మందికి సామాజిక సేవతోపాటు జరిమానా, ఐదుగురికి జరిమానాతోపాటు జైలు శిక్ష పడింది.ఇదీ చదవండి: వినూత్నంగా హైదరాబాద్ పెన్ షో.. ఎక్కడో తెలుసా? -
నిద్ర లేకుండా చేస్తున్నారు.. పోలీసులకు మెగా హీరో కంప్లైంట్
-
నిర్విఘ్నం.. నిమజ్జనం
ఖైరతాబాద్/లక్డీకాపూల్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనం నిర్విఘ్నంగా పూర్తయింది. 69 అడుగుల ఎత్తులో విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టాన్ని కేవలం 6 గంటల 20 నిమిషాల్లో పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 9:35 నిమిషాలకు ప్రారంభమైన శోభాయాత్ర సాగర తీరానికి చేరుకోగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మధ్యాహ్నం 2:45 నిమిషాలకు నిమజ్జనం పూర్తయింది. శోభాయాత్ర ఇలా... ⇒ గురువారం అర్ధరాత్రి తర్వాత ఖైరతాబాద్ మహాగణపతిని భారీ వాహనంపై ఉంచారు. అంతకుముందే రాత్రి 8 గంటలకు కలశపూజ నిర్వహించి విగ్రహ నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, మహాగణపతిని లిఫ్ట్ చేసి వాహనంపై ఉంచే క్రేన్‌కు సాంకేతిక లోపం రావడంతో ఉదయం 9:35 నిమిషాలకు ప్రారంభమైంది. మహాగణపతి 2:45 నిమిషాల సమయంలో.. అధికారులు అప్పటికే మార్క్ చేసి ఏర్పాటు చేసిన రెడ్ ఫ్లాగ్‌ల మధ్యలో నీటిని తాకుతూ మెల్లగా గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. గత సంవత్సరం మధ్యాహ్నం 1:45 నిమిషాలకు సంపూర్ణ నిమజ్జనం కాగా, ఈ సంవత్సరం గంట ఆలస్యంగా నిమజ్జనం పూర్తయింది. ⇒ మహాగణపతిని పైకి లిఫ్ట్ చేసి 30 నిమిషాలు గాల్లోనే ఉంచి నలువైపులా తిప్పుతూ గంగమ్మ ఒడిలో మార్క్ చేసిన ప్రాంతంలో నిమజ్జనం చేశారు. క్రేన్ ఆపరేటర్ బల్విందర్‌సింగ్ చాకచక్యంగా మహాగణపతి నిమజ్జనం చేయించారు. ⇒ ఎలాంటి విఘ్నాలు లేకుండా నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు, అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు సంతోషంగా డ్యాన్స్ చేశారు. పాటలకు స్టెప్పులు వేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తయింది : మంత్రి పొన్నం హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేశ్ నిమజ్జనోత్సవం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. శుక్రవారం నగరంలో గంట పాటు నిమజ్జన ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ ద్వారా సంబంధిత ఉన్నతాధికారులతో కలసి మంత్రి పరిశీలించారు.ఏరియల్ వ్యూ అనంతరం బేగంపేట విమానాశ్రయంలో మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలాతో కలసి మంత్రి పొన్నం మాట్లాడారు. 11వ రోజు గణేశ్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత రూట్లు, నిర్దేశించిన పాయింట్లలో నిరంతరం వివిధ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయండి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు సహకరించి విగ్రహాల మూమెంట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం లేదా వీలైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ ఏడాది పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదు : డీజీపీ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, నిమజ్జనాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని చెప్పారు.గతేడాది 1.15 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, ఈసారి సంఖ్య పెరిగిందన్నారు. అపార్ట్మెంట్లు, ఇళ్లు, వ్యక్తిగత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలిపితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.5 నుంచి 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని డీజీపీ తెలిపారు. ఇంకా మిగతా విగ్రహాలు శనివారం ఉదయానికి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. 13 మంది మృతి.. గణేశ్ ఉత్సవాల సందర్భంగా గత పది రోజుల్లో 13 మంది మృతి చెందడం బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నిమజ్జన విధులకు హైదరాబాద్ వచ్చిన కొత్తగూడెం ఎస్ఐ వెంకన్న మృతి బాధాకరమన్నారు. సైబరాబాద్ పరిధిలోని పటాన్చెరులో ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరమని చెప్పారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒకరు మృతి చెందగా, నిర్మల్‌లో గుండెపోటుతో ఒకరు మృతి చెందినట్టు తెలిపారు. డీజే శబ్దాల కారణంగా కూడా కొందరు మృతి చెందినట్టు పేర్కొన్నారు. మొత్తం 26 మంది ప్రమాదాల్లో గాయపడగా, మల్కాజిగిరిలో 17 మంది గాయపడినట్లు డీజీపీ తెలిపారు. -
పెన్సిల్ ముల్లుపై కొలువైన సూక్ష్మ గణపతి
సూరత్: వినాయక చవితి వేడుకల సందర్భంగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ యువ కళాకారుడు అద్భుతమైన సూక్ష్మ కళను ఆవిష్కరించాడు. పాటిల్ మయాంక్ దినేష్‌భాయ్ అనే కళాకారుడు కేవలం 6 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పెన్సిల్ మొనపై చెక్కాడు. ఈ సూక్ష్మ శిల్పాన్ని రూపొందించేందుకు ఐదు రోజుల పాటు ఎంతో ఏకాగ్రతతో పనిచేశానని మయాంక్ తెలిపారు. పెన్సిల్ మొనపై గణేశుడి విగ్రహాన్ని చెక్కాలనే ఆలోచన తనకు రెండేళ్ల క్రితం వచ్చిందని మయాంక్ చెప్పారు. తొలుత సరదాగా పెన్సిల్ మొనపై తన పేరులోని అక్షరాలను చెక్కినట్లు తెలిపారు. ఆ తర్వాత అదే విధంగా గణేశుడి విగ్రహాన్ని కూడా తయారు చేయవచ్చా అనే ఆలోచన వచ్చిందన్నారు. ఆ ప్రయత్నాన్ని కొనసాగించడంతో చివరకు 6 మిల్లీమీటర్ల గణేశ విగ్రహం రూపుదిద్దుకుందని వివరించారు.ఐదు రోజుల పాటు ఎంతో ఏకాగ్రతఇంత చిన్న పరిమాణంలో శిల్పాన్ని చెక్కడం సాధారణ విషయం కాదు. విగ్రహాన్ని రూపొందించేందుకు ఐదు రోజుల పాటు కష్టపడి, ఎంతో ఏకాగ్రతతో పనిచేసినట్లు మయాంక్ తెలిపారు. పెన్సిల్ మొనపై ఉన్న పరిమిత ప్రదేశంలో శిల్పాన్ని రూపొందించాల్సి రావడంతో ప్రతి కదలికను ఎంతో జాగ్రత్తగా నియంత్రించాల్సి వచ్చిందని చెప్పారు. చిన్నపాటి కదలిక కూడా శిల్పంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అత్యంత జాగ్రత్తగా పనిచేసినట్లు తెలిపారు. #WATCH | Gujarat | Surat artist Patel Mayank Dineshbhai crafts a 6 mm Lord Ganesha idol on a pencil tip, captivating devotees amidst grand Ganeshotsav celebrations across Gujarat https://t.co/r6zLHuubaS— ANI (@ANI) September 23, 2026సూక్ష్మ కళలో ప్రత్యేక ఆకర్షణసాధారణంగా వినాయక చవితి వేడుకల్లో భారీ విగ్రహాలు, భారీ మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే మయాంక్ రూపొందించిన ఈ విగ్రహం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కేవలం 6 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పటికీ గణేశుడి రూపాన్ని సూక్ష్మంగా తీర్చిదిద్దడం విశేషంగా మారింది. చిన్న స్థలంలోనూ కళాకారుడి నైపుణ్యం, సహనం, ఏకాగ్రత ఎంతటి ఫలితాన్ని ఇవ్వగలవో ఈ శిల్పం చూపిస్తోంది. ఈ సూక్ష్మ గణేశ విగ్రహాన్ని కేవలం కళాఖండంగా ఉంచుకోవాలని మయాంక్ భావించడం లేదు. సంప్రదాయ గణేశోత్సవ ఆచారాలను పాటిస్తూ, పూజ పూర్తయిన తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: Australia: ప్రభుత్వ డేటాలోకి ఓపెన్ఏఐ ఏజెంట్ చొరబాటు కలకలం -
Mumbai: షుగర్ వ్యాధిగ్రస్తులకు గణపయ్య ప్రసాదం
ముంబై: ముంబైలో జరుగుతున్న గణేశ్ ఉత్సవాల్లో భాగంగా అంధేరీ ఈస్ట్‌లోని సాకినాక్యాచా మహారాజ్ గణపతికి భారీ మోదకాన్ని నైవేద్యంగా సమర్పించారు. ప్రముఖ చెఫ్ హర్ష్ కేడియా, ఆయన బృందం కలిసి ఏకంగా 350 కిలోల బరువున్న, 4.5 అడుగుల ఎత్తైన షుగర్‌ఫ్రీ మోదకాన్ని తయారు చేశారు. 20 గంటలకు పైగా శ్రమించి సిద్ధం చేసిన ఈ భారీ మోదకాన్ని అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.20 గంటల శ్రమతో భారీ మోదకంసాకినాక్యాచా మహారాజ్ గణపతి విగ్రహం వద్ద సమర్పించేందుకు ప్రత్యేకంగా ఈ మోదకాన్ని రూపొందించారు. తయారీ పూర్తయ్యాక ప్రత్యేక ఏర్పాట్లతో మండపానికి తరలించి, నిర్వాహకుల అనుమతితో గణపతి విగ్రహం ముందు ఉంచారు. అనంతరం భక్తులకు ప్రసాదంగా అందజేశారు.చక్కెర లేని ప్రత్యేక తయారీచెఫ్ హర్ష్ కేడియా షుగర్‌ఫ్రీ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న పండుగ వంటకాలకు ప్రసిద్ధి చెందారు. ఈ భారీ మోదకాన్ని కూడా షుగర్‌ఫ్రీ పద్ధతిలో తయారు చేశారు. దీనిపై భారతదేశంలో పండించిన కోకోతో తయారు చేసిన చాక్లెట్ పొరను ఉపయోగించారు. తయారీ, రవాణా, వేదికపై ఉంచే సమయంలో ఆహార భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు పాటించినట్లు కేడియా తెలిపారు.‘ఎంతో భావోద్వేగం’ఈ భారీ మోదకం తయారీ ఓ వంటకానికి సంబంధించిన రికార్డు కాదని కేడియా పేర్కొన్నారు. గణేశుడికి సమర్పించే నైవేద్యం కావడంతో ఇది ఎంతో భావోద్వేగంతో కూడుకున్నదని సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఎంతో ప్రేమతో మోదకాన్ని తయారు చేసి గణపతి మండపానికి తీసుకొచ్చినట్లు చెప్పారు.భక్తులకు ప్రసాదంగా పంపిణీభారీ మోదకాన్ని కేవలం ప్రదర్శన కోసం తయారు చేయలేదు. గణపతికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత నిర్వాహకుల అనుమతితో భక్తులకు ప్రసాదంగా పంచారు. సాకినాక్యాచా మహారాజ్ ముందు ఉంచిన ఈ భారీ మోదకానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.42 అడుగులకు పైగా సాకినాక్యాచా మహారాజ్సాకినాక్యాచా మహారాజ్ గణపతి విగ్రహం 42 అడుగులకు పైగా ఎత్తుతో ఉంది. 2026లో ముంబైలో అత్యంత ఎత్తైన గణేశ విగ్రహంగా గుర్తింపు పొందింది. అయితే ఖేత్వాడిలోని మరో గణేశ మండపం కూడా తమ విగ్రహం 42 అడుగులకు పైగా ఉందని సమాచారం. కాగా షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా ఈ ప్రసాదం తినవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇదీ చదవండి: బుకర్ ప్రైజ్ 2026.. తుది జాబితాలో ఆరు నవలలు -
ఎల్ నినోకు చెక్.. గణపయ్యల నిమజ్జనానికి సరికొత్త విధానం!
ఇండోర్: ఎల్‌నినో ప్రభావం కారణంగా దేశంలోని నదులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో గణపయ్యల నిమజ్జనం పెద్ద సవాల్‌గా నిలిచింది. ఎండిపోయిన నీటి వనరుల్లో గణపతి విగ్రహాలను వేయాల్సిరావడం పలువురిలో ఆవేదన కలిగిస్తున్నది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపల్ కొర్పొరేషన్ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. గణేశ్ నిమజ్జనానికి సంబంధించి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఐఎంసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నగరవ్యాప్తంగా ప్రజల నుంచి నిమజ్జనానికి సిద్ధమైన గణేశ్ విగ్రహాలను సేకరించేందుకు 100కుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది.సేకరించిన గణేశ్ విగ్రహాలను సంప్రదాయ ఆచారాల ప్రకారం సెప్టెంబర్ 25, 26 తేదీల్లో మున్సిపల్ అధికారులు నిమజ్జనం చేయనున్నారు. ధార్ రోడ్డులోని జవహర్ టేక్రి క్వారీలో వర్షపు నీటితో ఏర్పడిన జలాశయంలో ఈ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మతపరమైన భావోద్వేగాలు దెబ్బతినకుండా నిమజ్జనం నిర్వహణకు ఐఎంసీ ఇంజినీర్లు ప్రత్యేక హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. విగ్రహాలను ఈ ప్లాట్‌ఫామ్‌పై ఉంచి యాంత్రిక విధానంలో వాటిని నీటిలోకి దించనున్నారు.అనంతరం నియంత్రిత ఓపెనింగ్ వ్యవస్థ ద్వారా విగ్రహాలు నీటి ఉపరితలం కిందకు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం ద్వారా విగ్రహాలను నేరుగా చేతులతో నీటిలోకి దించే అవసరం ఉండదని అధికారులు తెలిపారు. మరోవైపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా భారీ శోభాయాత్రలు జరిగే అవకాశం ఉండటంతో నగరంలోని ఏడు కిలోమీటర్ల ఊరేగింపు మార్గంలో రోడ్ల పునరుద్ధరణ, నిర్వహణ పనులను అధికారులు వేగవంతం చేశారు.ఇదీ చదవండి: ఏఐతో వైద్యరంగం గందరగోళం.. సమస్య ఎక్కడుంది? -
గణేశ మండపంలో అవయవదాన సందేశం
సూరత్: భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అవగాహనకు గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహిస్తున్నగణేశోత్సవం వేదికగా నిలుస్తున్నది. వాస్తవ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ అనే థీమ్‌తో వినూత్న గణేశ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాందేర్ రోడ్‌లోని తాడ్వాడీ చార్ రాస్తా వద్ద బేజన్వాలా కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మండపం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.వినాయక మండపం నేపథ్యంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆకర్షణీయమైన పోస్టర్లు, స్ఫూర్తినిచ్చే వాస్తవ ఘటనలు, సందేశాల ద్వారా మరణానంతరం అవయవదానం చేయడం ద్వారా అవసరమైన వారికి జీవితంపై కొత్త ఆశ కల్పించవచ్చని వారు భక్తులకు వివరిస్తున్నారు. ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవదానం ద్వారా 8 నుంచి 9 మంది వరకు ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.అవయవదానానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను వివిధ దృశ్యాలు, సందేశాల ద్వారా ప్రదర్శించారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి కుటుంబ సభ్యులకు అవయవదానంపై కౌన్సెలింగ్ ఇవ్వడం, కుటుంబ సభ్యుల సమ్మతి అనంతరం అవయవదాతకు గార్డ్ ఆఫ్ ఆనర్తో గౌరవప్రదంగా వీడ్కోలు పలకడం, గ్రీన్ కారిడార్ ద్వారా అవయవాలను ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించే ప్రక్రియను ఇందులో చూపించారు.డొనేట్ లైఫ్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నీళేశ్ మండలేవాలా మాట్లాడుతూ.. 2047 నాటికి అవయవాల కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోని పరిస్థితి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గణేశోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో యువతకు ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ సందేశాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు! -
ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు!
ఒకవైపు బియ్యం గింజపై సైతం ఇమిడిపోయేంత చిన్నగా వెండితో రూపొందించిన గణేశుడి అష్టవినాయక రూపాలు.. మరోవైపు ఏకంగా 50 వేల గణేశ విగ్రహాలతో ఏర్పాటు చేసిన భారీ సేకరణ.. గణేశ్ ఉత్సవాల వేళ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు విశేషాలు భక్తి, కళ, సృజనాత్మకతకు భిన్నమైన రూపాలను ప్రదర్శిస్తున్నాయి. మైక్రో ఆర్టిస్ట్ రాజేశ్ సోనీ కేవలం 6 మిల్లీమీటర్ల పొడవు, 70 మిల్లీగ్రాముల బరువున్న వెండి అష్టవినాయక కళాకృతిని రూపొందించగా.. సంజయ్ క్షత్రియ 50,000 గణేశ విగ్రహాలను సేకరించి భద్రపరిచారు. ఒకటి సూక్ష్మ కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిస్తే.. మరొకటి గణేశుడి వివిధ రూపాలు, కళా సంప్రదాయాలను ఒకేచోట చేర్చిన ప్రత్యేక సేకరణగా నిలుస్తోంది.బియ్యపు గింజపై ఇమిడే గణేశుడుమధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లా జావద్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రాజేశ్ సోనీ వెండితో గణేశుని అష్టవినాయక రూపాలను అత్యంత సూక్ష్మంగా రూపొందించారు. మొత్తం కళాకృతి పొడవు కేవలం 6 మిల్లీమీటర్లు కాగా, బరువు 70 మిల్లీగ్రాములు. పరిమాణం చాలా చిన్నగా ఉండటంతో దీనిని బియ్యం గింజపై లేదా పూజలో ఉపయోగించే దూర్వ గడ్డిపైన కూడా ఉంచవచ్చు. గణేశుడి అష్టవినాయక రూపాలను ఇంత చిన్న పరిమాణంలో రూపొందించడం ఈ కళాకృతికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.ఎనిమిది రూపాలు.. అద్భుత కళాకృతిరాజేశ్ సోనీ రూపొందించిన సూక్ష్మ కళాకృతిలో శ్రీ మయూరేశ్వర, శ్రీ సిద్ధివినాయక, శ్రీ బల్లాలేశ్వర, శ్రీ వరదవినాయక, శ్రీ చింతామణి, శ్రీ గిరిజాత్మజ, శ్రీ విఘ్నేశ్వర, శ్రీ మహాగణపతి రూపాలను పొందుపరిచారు. దీంతో దూర్వపై ఉంచిన ఈ సూక్ష్మ కళాకృతి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.మిల్లీమీటర్ల భాగాలతో రూపకల్పనఈ కళాకృతిని రూపొందించేందుకు ఒక్కో గణేశ రూపంలోని తల, తొండం, పొట్ట, చేతులు, కాళ్లు, చెవులను విడివిడిగా తయారు చేశారు. ఒక్కో భాగం 2 నుంచి 3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంది. అనంతరం గ్యాస్‌పై అత్యంత తక్కువ మంటతో వాటిని కలిపారు. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతను నియంత్రించడం ప్రధాన సవాలుగా మారింది. మంట కొద్దిగా ఎక్కువైనా వెండి సన్నని తీగ కరిగిపోయే అవకాశం ఉండటంతో అత్యంత జాగ్రత్తగా ఈ పనిని పూర్తి చేసినట్లు రాజేశ్ సోనీ తెలిపారు.మైక్రో ఆర్ట్‌లో ఇప్పటికే ఎన్నో ఘనతలురాజేశ్ సోనీకి మైక్రో ఆర్ట్ రంగంలో గతంలోనూ అనేక ప్రత్యేక కళాకృతులు రూపొందించిన అనుభవం ఉంది. ప్రపంచంలోనే అతి చిన్న తాజ్‌మహల్, ప్రపంచ కప్ ట్రోఫీ వంటి కళాకృతులను ఆయన రూపొందించారు. ఈ కళాకృతులకు సంబంధించి ఆయన పేరు ప్రపంచ రికార్డుల్లో నమోదైంది. తాజాగా వెండితో రూపొందించిన అష్టవినాయక కళాకృతి కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.మరోవైపు 50 వేల గణేశ విగ్రహాలుమహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్‌కు చెందిన సంజయ్ క్షత్రియ గణేశుడిపై తనకున్న ఆసక్తిని విస్తృతమైన విగ్రహాల సేకరణగా మార్చుకున్నారు. ఆయన వద్ద ప్రస్తుతం 50,000 గణేశ విగ్రహాలున్నాయి. వివిధ పరిమాణాలు, డిజైన్లు, రూపాలు, కళా శైలలలో ఉన్న ఈ విగ్రహాలను ఆయన కొన్ని ఏళ్లుగా సేకరించి భద్రపరిచారు. గణేశ్ ఉత్సవాల సమయంలో ఈ సేకరణకు ప్రత్యేక ఆదరణ లభిస్తోంది.ఒక్కో విగ్రహానిదో ప్రత్యేక శైలిక్షత్రియ సేకరణలో సంప్రదాయ రూపాల నుంచి ఆధునిక కళాత్మక రూపకల్పనల వరకు వివిధ రకాల గణేశ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల భంగిమలు, ముఖ కవళికలు, కిరీటాలు, ఆభరణాలు, రంగుల కలయికలు, సున్నితమైన అలంకరణలు ఒక్కో విగ్రహానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. వివిధ పదార్థాలు, కళాత్మక పద్ధతులతో రూపొందించిన విగ్రహాలు భారతీయ విగ్రహ తయారీ సంప్రదాయాల్లోని వైవిధ్యాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.మారుతున్న గణేశ కళకు దృశ్య రికార్డుమహారాష్ట్ర సామాజిక, సాంస్కృతిక జీవనంలో గణేశుడు కీలక భాగంగా ఉన్నారు. ఇళ్లలో జరిగే వేడుకల నుంచి భారీ బహిరంగ గణేశ ఉత్సవాల వరకు విగ్రహాల రూపం, ప్రదర్శనలో కాలక్రమేణా మార్పులు వచ్చాయి. సంజయ్ క్షత్రియ సేకరణలోని విభిన్న విగ్రహాలు ఈ మారుతున్న కళా సంప్రదాయాలను ఒకేచోట చూడటానికి అవకాశం కల్పిస్తున్నాయి. కళాకారులు తమ భక్తిని వివిధ రూపాలు, డిజైన్లు, సృజనాత్మక ఆలోచనల ద్వారా ఎలా వ్యక్తం చేశారో ఈ సేకరణ ద్వారా చూడవచ్చు.భక్తి.. కళ.. వారసత్వం50 వేల విగ్రహాలను సేకరించి భద్రపరచడం సాధారణ విషయం కాదు. ఇంత పెద్ద సేకరణకు సరైన నిల్వ సౌకర్యాలు, క్రమం తప్పకుండా శుభ్రపరచడం, సంరక్షణ అవసరం. సంజయ్ క్షత్రియకు ఇది కేవలం సంఖ్యల సమాహారం కాదు. ప్రతి విగ్రహం ఒక ప్రత్యేక కళాత్మక వ్యక్తీకరణకు ప్రతీకగా ఆయన సేకరణలో భాగమైంది. అదే సమయంలో రాజేశ్ సోనీ రూపొందించిన 6 మిల్లీమీటర్ల అష్టవినాయక కళాకృతి సూక్ష్మ కళలోని నైపుణ్యాన్ని చాటుతోంది. ఈ రెండు ఉదాహరణలు గణేశుడిపై భక్తి ఎలా విభిన్న కళారూపాల్లో వ్యక్తమవుతుందో తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: సంతోషం కోసం వెతకొద్దు.. ఈ సూత్రాలు పాటించండి! -
ఆడంబరాలకు దూరంగా.. వందేళ్ల 32 గణేశ మండపాలు
ముంబై: ముంబైలో గణేశోత్సవం అంటే భారీ విగ్రహాలు, వైభవంగా కనిపించే అలంకరణలు, లక్షలాది భక్తుల సందడే గుర్తుకొస్తుంది. అయితే ఈ వేడుకల మూలాలు మాత్రం నిశ్శబ్దంగా సాగే సామాజిక ఉత్సవాల్లో ఉన్నాయి. నగరంలోని వందేళ్లకు పైబడిన కొన్ని గణేశ మండపాలు ఇప్పటికీ తమ పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయి. చిన్న విగ్రహాలు, సంప్రదాయ పూజలు, కుటుంబసభ్యులు, స్థానికులతో కలసి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ముంబైలో వందేళ్ల చరిత్ర కలిగిన 32 గణేశ మండపాలు ఉన్నాయని, వాటిలో 24 గిర్గావ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయని నగరంలో పర్యటనలు నిర్వహించే ‘ఖాకీ టూర్స్’ తెలిపింది.గిర్గావ్లోని వీపీ రోడ్డులో ఉన్న 105 ఏళ్ల అంగ్రేవాడి గణేశోత్సవ మండల్లో ఈసారి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. నితిన్ గాడ్రే, స్వాతి జోషి అనే ఇద్దరు స్థానికులు గత నెల కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల అనంతరం వారు గల్లంతైన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవారని కమిటీ సభ్యుడు మిలింద్ పోంక్షే తెలిపారు.అంగ్రేవాడిలో గతంలో సుమారు 100 మరాఠీ కుటుంబాలు గణేశోత్సవంలో పాల్గొనేవి. 1971లో నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో నాటకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంత్ర పఠనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ 30-40 మరాఠీ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ 2.5 అడుగుల విగ్రహంతో 10 రోజులపాటు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 8-10 మంది పూజారులు మంత్ర పఠనం, హారతి నిర్వహిస్తున్నారు. గణేశుడికి సంస్కృత స్తుతితోపాటు ప్రసాదంగా ఉసల్ తయారు చేసే సంప్రదాయం కొనసాగుతోంది.ఖాదిల్కర్ రోడ్డులోని కేశవ్జీ నాయక్ చాల్‌లోని శ్రీ సార్వజనిక గణేశోత్సవ సంస్థ 133వ ఏడాదిని జరుపుకొంటోంది. 1901లో లోకమాన్య తిలక్ ఈ చాల్ను సందర్శించి అక్కడ ఆతిథ్యం స్వీకరించినట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇక్కడ రెండు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి, లౌడ్స్పీకర్లు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనే పరిమితమైన గణేశోత్సవాన్ని స్వాతంత్య్ర యోధుడు తిలక్ ప్రజా ఉద్యమంగా మార్చారు. బ్రిటిష్ పాలనలో రాజకీయ సమావేశాలపై ఆంక్షలు విధించిన సమయంలో, ప్రజలను ఒకచోట చేర్చేందుకు, స్వరాజ్య సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు.కింగ్స్ సర్కిల్లో 1925లో ఏర్పడిన దక్షిణీ బ్రాహ్మణవాడి మండల్ రెండు రోజుల గణపతి ఉత్సవాన్ని నిర్వహించింది. స్థానికుల నుంచి కొద్దికొద్దిగా ధాన్యం సేకరించి, మహాప్రసాదం ఏర్పాటు చేయడం ఇక్కడి సంప్రదాయం. వివాహం అనంతరం ఈ ప్రాంతం విడిచి వెళ్లిన మహిళలు సైతం పూజల్లో పాల్గొనేందుకు ఇక్కడికి తిరిగి వస్తుంటారు. మరాఠీ నాటకాలు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.ఇదీ చదవండి: 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఒంటరి మెదడు’ హెచ్చరిక? -
వినాయకుని దర్శనానికి 15 గంటలు
ముంబై: గణపతి ఉత్సవాల్లో భాగంగా ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణేశోత్సవం 93వ సంవత్సరం వేడుకలు సెప్టెంబరు 14న ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల తొలిరోజే లక్షలాది మంది భక్తులు లాల్‌బాగ్‌లోని గణేశ్ మండపానికి తరలివచ్చారు. అర్ధరాత్రి కూడా భక్తుల రాక కొనసాగింది. భారీగా క్యూలు ఏర్పడ్డాయి. ముంబైతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూశారు.భారీ రద్దీ కారణంగా క్యూలలో తోపులాటలు చోటుచేసుకున్నట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. కొందరు భక్తులు 15-16 గంటలపాటు క్యూలో వేచి ఉన్నట్లు పోస్టులు పెట్టారు. అదే సమయంలో వీఐపీలకు సులభంగా దర్శనం లభిస్తుండటంపై చర్చ మొదలైంది. సాధారణ భక్తులకు కూడా గౌరవప్రదమైన, దర్శన సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. తొలిరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ లాల్బాగ్చా రాజాను దర్శించుకుని పూజలు చేశారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సభ్యులతో కలిసి మండపానికి వచ్చారు.సాధారణ దర్శనం ఉచితమేనని, భక్తుల కోసం అధికారికంగా ఎలాంటి చెల్లింపు పాస్‌లు లేవని నిర్వాహకులు స్పష్టం చేశారు. రద్దీ నియంత్రణ, భద్రత కోసం మండపం పరిసరాల్లో పోలీసులను మోహరించారు. ఏఐ ఆధారిత కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. మండపానికి రాలేని భక్తుల కోసం 24 గంటల ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంది.భారీ రద్దీ నేపథ్యంలో ముంబై పోలీసులు లాల్బాగ్, కాలాచౌకీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. సెప్టెంబరు 14 నుంచి 25 వరకు పరిస్థితిని బట్టి అవసరమైన చోట 24 గంటలపాటు రహదారుల మూసివేత కొనసాగనుంది. లాల్బాగ్చా రాజా ఉత్సవాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నప్పటికీ, భారీ రద్దీని సురక్షితంగా నిర్వహించడం నిర్వాహకులు, అధికారులకు సవాలుగా మారింది.ఇదీ చదవండి: ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే.. -
గణేశ్ మండపంలో దారుణ హత్య
బిలాస్పూర్: గణేశ్ చతుర్థి వేడుకల సందడి మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. గణేశ్ మండపం వద్ద సౌండ్ సిస్టమ్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. సక్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబల్పురి గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సౌండ్ సిస్టమ్ విషయమై అమన్ సూర్యవంశీ (23), ఆకాశ్ సూర్యవంశీ (22) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అది ఘర్షణకు దారి తీసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రేషన్ దుకాణం ఎదుట గణేశ్ ఉత్సవాల కోసం మండపం ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం అక్కడ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు విషయంలో అమన్, ఆకాశ్ మధ్య మాటామాటా పెరిగింది. వివాదం ముదరడంతో అమన్ కత్తి తీసుకుని ఆకాశ్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ అక్కడికక్కడే కుప్పకూలాడు.సమాచారం అందుకున్న గ్రామస్థులు డయల్-112కు ఫోన్ చేశారు. తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ను సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి, అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన అనంతరం పోలీసులు అమన్ సూర్యవంశీని అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి అసలు కారణం, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై అతడిని విచారిస్తున్నారు.ప్రాథమిక దర్యాప్తులో సౌండ్ సిస్టమ్ విషయంలోనే వివాదం తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. నిందితుడు మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తిగా చెబుతున్నారు. గణేశ్ మండపం సమీపంలోనే హత్య జరగడంతో గ్రామంలో కలకలం రేగింది.ఇదీ చదవండి: గణపయ్య వేడుకల్లో మళ్లీ ‘గోవిందా’.. కనిపించని సునీత! -
దద్దరిల్లిన ఖైరతాబాద్ వీడియో చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
-
పండగపూట పూజాసామగ్రిపై అధిక ధరలు
-
45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ..
గణేశ్ చతుర్థి వచ్చిందంటే చాలు.. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పాటు డీజేల్లో మారుమోగే కొన్ని పాటలు పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తాయి. అలాంటి పాటల్లో నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాట ‘దేవా హో దేవా గణపతి దేవా’. 1981లో విడుదలైన ఈ పాట ఇప్పటికీ గణేశ్ చతుర్థి వేడుకల్లో నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. ఒకే పాటకు ఆరుగురు ప్రముఖ గాయకులు తమ గాత్రాన్ని అందించడం ఈ పాటకున్న ప్రత్యేకత.45 ఏళ్లుగా అదే జోష్గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని హిందీ చిత్రసీమలో ఎన్నో గణపతి పాటలు వచ్చాయి. అయితే వాటిలో ‘దేవా హో దేవా గణపతి దేవా’ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. సుమారు 45 ఏళ్ల క్రితం విడుదలైన ఈ గీతం ఇప్పటికీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సందడి చేస్తుంటుంది. పండగ సమయంలో డీజేలు, ఇతర వేడుకల్లో ఈ పాట వినిపించడం సర్వ సాధారణంగా మారింది.‘హమ్ సే బఢ్కర్ కౌన్’తో అనుబంధంఈ పాట 1981లో విడుదలైన ‘హమ్ సే బఢ్కర్ కౌన్’ అనే హిందీ చిత్రంలోనిది. ప్రముఖ దర్శకుడు దీపక్ బహ్రీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నటుడు అమ్జద్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో కనిపించారు. ఈ చిత్రంలోని ‘దేవా హో దేవా గణపతి దేవా’ పాట 1980లలో భక్తి గీతంగా విశేష ప్రజాదరణ పొందింది.సినిమాను మించిన హిట్సినిమాలో భాగమైనప్పటికీ ఈ పాటకు వచ్చిన ఆదరణ ప్రత్యేకంగా నిలిచింది. అమ్జద్ ఖాన్, మిథున్ చక్రవర్తి, డ్యానీ డెంజోంగ్పా, రంజితా కౌర్, నీతా మెహతా తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. అయితే సినిమా కంటే ఈ పాటకే ఎక్కువ గుర్తింపు లభించిందని చెబుతుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా గడిచినా గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఆరుగురు దిగ్గజాల స్వరాలుఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒకే పాట కోసం హిందీ సంగీత ప్రపంచానికి చెందిన ఆరుగురు గాయకులు కలిసి తమ గాత్రాన్ని అందించారు. వారిలో మొహమ్మద్ రఫీ, ఆశా భోస్లే, శైలేంద్ర సింగ్, భూపేంద్ర, రామ్‌లక్ష్మణ్, సప్నా చక్రవర్తి ఉన్నారు. ఇంతమంది ప్రముఖ గాయకుల స్వరాలు కలవడం ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.గణపతి వేడుకల్లో ఇప్పటికీ మార్మోగుతూ..1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాటకు 45 ఏళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రతి గణేష్ చతుర్థి సమయంలో ఈ పాట వినిపిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటుంది. తరాలు మారినా గణపతి వేడుకల్లో ఈ పాటకు ఆదరణ కొనసాగుతుండటం దీని ప్రత్యేకతను తెలియజేస్తున్నది.ఇదీ చదవండి: ఒక చేతిలో ‘బ్రహ్మోస్’.. మరో చేతిలో సెమీకండక్టర్ చిప్.. -
ఒక చేతిలో ‘బ్రహ్మోస్’.. మరో చేతిలో సెమీకండక్టర్ చిప్..
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్లో గణేశోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 14 నుంచి పది రోజులపాటు దేశభక్తి, సాంస్కృతిక అంశాలతో మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముంబై, చెన్నైతో పాటు దక్షిణాది కళాకారులు ఢిల్లీకి రానున్నారు. ‘ఢిల్లీ కా మహారాజా’ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి వినూత్న థీమ్‌ను ఎంచుకున్నారు. 9 అడుగుల గణపతి విగ్రహం చేతుల్లో సంప్రదాయ వస్తువులకు బదులుగా బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, సెమీకండక్టర్ చిప్‌ను ఉంచారు. ‘విఘ్నహర్త నుంచి వికాసకర్త’ అనే ఇతివృత్తంతో దేశ పురోగతిలో సాంకేతికత, భద్రత, యువత పాత్రను చాటనున్నారు. 80 అడుగుల ప్రదర్శన వేదికపై సంప్రదాయ ఆలయాలు, రాకెట్లు, డ్రోన్లు, 10 అడుగుల బుల్లెట్ రైలు నమూనాలను ప్రదర్శించనున్నారు.2,100 శంఖాలతో ఘన ప్రారంభంలాల్బాగ్ కా రాజా గణపతి మహోత్సవం సెప్టెంబర్ 14న ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు 2,100 మంది భక్తులు ఒకేసారి శంఖాలు ఊది కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ముంబైలోని లాల్బాగ్చా రాజా విగ్రహాలను రూపొందించే కళాకారులు తయారుచేసిన 18 అడుగుల గణపతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రోజుకు సుమారు 20 వేల నుంచి 25 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ఢిల్లీలో మహారాష్ట్ర సందడి29వ సార్వజనిక గణేశ్ ఉత్సవంలో మహారాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించనుంది. మరాఠీ గజల్స్, నాటకాలు, లావణి, సంగీత కార్యక్రమాలతో పాటు పూరణ్ పోళీ, ఉక్కడిచే మోదక్ వంటి సంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంటాయి. పైఠణీ, ఇర్కల్ చీరల విక్రయాలు, ప్రత్యేక నిమజ్జన ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు.చెన్నై కళాకారుల గణపయ్యమయూర్ విహార్‌లోని శ్రీ శుభ సిద్ధి వినాయక మందిరంలో చెన్నై కళాకారులు రూపొందించిన నాలుగు అడుగుల గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సెప్టెంబర్ 14న 25 మూలమంత్ర జపం అనంతరం 5,000 మోదకాలను నైవేద్యంగా సమర్పించనున్నారు. దక్షిణాది కళాకారులు సంప్రదాయ భజనలు నిర్వహించనున్నారు.నోయిడాలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలునోయిడాలోని శ్రీ వరసిద్ధి వినాయక మందిరంలో ఐదు రోజులపాటు గణేశ్ చతుర్థి వేడుకలు జరగనున్నాయి. హవనం, అభిషేకాలు, సహస్రనామ పారాయణాలతో పాటు భరతనాట్యం, వేణుగానం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: అద్దెకు ఫైబర్ గణేశుడు.. 10 అడుగుల విగ్రహం మూడు వేలకే.. -
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
ఓ బొజ్జ గణనాథుడా.. రావయ్యా..రా.. ఏటా ఖరీఫ్ ప్రారంభించి నాట్లు పడిన వెంటనే నువ్వు వస్తావని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లం. వర్షాలు అనుకూలించి పంటలు ఆశాజనకంగా ఉన్న వేళ ఆనందంతో నీ ఉత్సవాలు వైభవంగా చేసి, ఇష్టంగా కొలిచి, నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకం, పప్పుబూరెలు నైవేద్యంగా పెట్టేవాళ్లం. వాటిని ఆరగించి, మూసిక వాహనంపై ప్రయాణిస్తూ భక్తులకు వరాలు కురిపించేవాడి. ఈ ఏడాది వర్షాలు లేవు. వరినాట్లు సరిగ్గా పడలేదు. ఎరువుల కొరత, అధిక ధరలు. ఏమీ చేయాలో తోచని పరిస్థితి. ఈ తరుణంలో నీకు కష్టాలు చెప్పుకుందామనుకునేలోపే నిన్ను పిలవడానికే బాధేస్తుంది. వినాయక చవితికి వచ్చే నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకాలు పెట్టలేని స్థితి ఏర్పడింది. బెల్లం ధర అమాంతంగా పెరిగిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.45లు ఉండే బెల్లం ధర ఇప్పుడు రూ.80 పలుకుతోంది. పప్పుల, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా మొర నువ్వైనా వింటావా.. గతంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతీ ఇంటికి నగదుసాయం అందేది. ఇప్పుడు ఏ సాయం లేదు. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. బెల్లానికి బదులు పంచదారతో ఉండ్రాళ్లు చేద్దామంటే పంచదార సైతం కిలో రూ.75లు పలుకుతోంది. కందిపప్పు కిలో ధర రూ.140లు పైబడి ఉంది. గతంలో రేషన్ దుకాణాల్లో పండగ సమయాల్లో బెల్లం, పంచదార, కందిపప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవు. మేం ఎలాగూ కొనలేం... తినలేం. నీకు నైవేద్యం పెడదామన్నా ధరలు తట్టుకోలేకపోతున్నాం. పోనీ ఉత్తి బియ్యిం పిండి ఉండ్రాలు పెడదామంటే బియ్యం కిలో ధర రూ.60లు నుంచి రూ.70లు ఉంది. ఈ ధరాఘాతంలో మేం ఎలా బతికేది. మా మొర విని, ఈ ఏడాది నీ బొజ్జ నిండేట్టు పెట్టలేని మా బతుకులకు ఆర్థిక భరోసా కల్పించే కొత్త ఆసరా ఇవ్వ తండ్రీ. ఇట్లు.. గట్టిగా పిలవలేక పిలుస్తున్న నీ భక్తులు -
చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య!
వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా గణేశుడి ఉత్సవాల సందడి నెలకొంది. అయితే రాజస్థాన్‌లోని ఓ పురాతన గణేశ ఆలయం తన ప్రత్యేక సంప్రదాయంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా దేవుడికి మొక్కులు, పూజలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కానీ ఇక్కడ భక్తులు తమ కోరికలు, సమస్యలు, శుభవార్తలను లేఖల రూపంలో స్వయంగా గణేశుడికి పంపిస్తారు. రోజుకు వెయ్యికి పైగా లేఖలు ఈ ఆలయానికి చేరుతుండటంతో దీనికి దేశవ్యాప్తంగా ‘లెటర్-వాలా గణేశ్ టెంపుల్’ అనే పేరు వచ్చింది.రోజూ వెయ్యికి పైగా లేఖలురాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రణతంబోర్ కోటలో త్రినేత్ర గణేశ్ ఆలయం ఉంది. డిజిటల్ యుగంలో ప్రముఖ ఆలయాలు ఆన్లైన్లో పూజలు, ప్రసాద సేవలు అందిస్తున్నప్పటికీ.. ఈ ఆలయం మాత్రం చేతిరాత లేఖల సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ప్రతిరోజూ 1,000కు పైగా లేఖలు, పోస్టుకార్డులు, ఆహ్వాన పత్రాలు ఆలయానికి వస్తుంటాయి. వాటిలో సమస్యలను వివరిస్తూ రాసిన లేఖలు, వివాహ ఆహ్వానాలు, శిశువు జననం, కొత్త వ్యాపారం ప్రారంభం, కొత్త ఇల్లు కొనుగోలు వంటి శుభ సందర్భాల సమాచారంతో కూడిన లేఖలు ఉంటాయి. కొందరు భక్తులు తమ వ్యక్తిగత సమస్యలను వివరిస్తూ దేవుని సహాయం కోరుతూ లేఖలు పంపుతారు.కోరికలు.. కష్టాలు.. కృతజ్ఞతలుత్రినేత్ర గణేశ్ ఆలయంలో ఈ ప్రత్యేక సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. భక్తులు తమ కోరికలు, సమస్యలు, కృతజ్ఞతలను వివరంగా లేఖల్లో రాస్తారు. ఆ లేఖలను ఆలయానికి చేరుకున్న తర్వాత సేకరించి గణేశుడి ముందు ఉంచుతారు. పూజా సమయంలో పూజారులు భక్తుల ప్రార్థనలను విగ్రహం ముందు చదివి వినిపిస్తారని కూడా చెబుతారు. ముఖ్యంగా కుటుంబాల్లో వివాహం నిశ్చయమైనప్పుడు మొదటి వివాహ ఆహ్వాన పత్రికను త్రినేత్ర గణేశుడికి పంపడం శుభప్రదమైన ఆచారంగా భావిస్తారు.1300లో ఆలయ నిర్మాణంత్రినేత్ర గణేశ్ ఆలయం సుమారు క్రీస్తుశకం 1300 ప్రాంతంలో రాజు హమ్మీర్ దేవ్ పాలనలో నిర్మించినట్లు చెబుతారు. రణతంబోర్ కోటపై అలావుద్దీన్ ఖిల్జీ సుదీర్ఘకాలం ముట్టడి కొనసాగించిన సమయంలో హమ్మీర్ రాజుకు గణేశుడు కలలో కనిపించాడని స్థలపురాణం చెబుతోంది. మరుసటి రోజు కోట గోడపై మూడు కళ్లతో ఉన్న గణేశుడి రూపాన్ని రాజు చూశాడని, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారని కథనం. గణేశుడికి మూడు కళ్లుండటంతోనే ఆయనను ‘త్రినేత్ర గణేశ్’గా పిలుస్తారు.కుటుంబ సమేతంగా గణేశుడి దర్శనంఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. గణేశుడిని ఆయన కుటుంబ సమేతంగా పూజించే అరుదైన ఆలయాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడ గణేశుడితో పాటు ఆయన భార్యలు రిద్ధి, సిద్ధి, కుమారులు శుభ్, లాభ్ కూడా పూజలందుకుంటారు. అందువల్ల భక్తులకు ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన క్షేత్రంగా నిలిచింది.ప్రపంచం నలుమూలల నుంచి లేఖలు పంపొచ్చుభక్తులు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా తమ లేఖలను ఆలయానికి పంపవచ్చు. ఇందుకోసం Shree Trinetra Ganesh Ji Temple, Ranthambore Fort, Sawai Madhopur, Rajasthan – 322001 చిరునామాకు పోస్టు చేయవచ్చు. వివాహ ఆహ్వాన పత్రికలు లేదా కుటుంబంలోని ఇతర శుభకార్యాలకు సంబంధించిన పత్రాలను కూడా భక్తులు పంపుతుంటారు. ఆలయానికి చేరుకున్న తర్వాత వాటిని పూజారి గణేశుడి ముందు సమర్పిస్తారు.దర్శన వేళలు.. ఎలా చేరుకోవాలి?త్రినేత్ర గణేశ్ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ సవాయ్ మాధోపూర్ జంక్షన్. ఆలయం నుంచి ఇది సుమారు 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయానికి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ట్యాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆలయంలో సాధారణంగా ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. రోజులో ప్రాతఃకాల ఆరతి, శృంగార ఆరతి, భోగ్ ఆరతి, సాయంసంధ్య ఆరతి, శయన ఆరతి వంటి పలు ఆరతులు జరుగుతాయి. గణేశుడికి బుధవారం ప్రత్యేకమైన రోజుగా భావించడంతో ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదీ చదవండి: నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం -
Hyderabad: గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా సాగే ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుండి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్‌గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్‌బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6:00 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధితో నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి.అలాగే బాలాపూర్ గణేష్ మండపం నుండి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 23:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ నాగిరెడ్డి వివరించారు. -
గణపతి ఉత్సవాలకు కార్పొరేట్ హంగులు
ముంబై: మహానగరం ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలకు కార్పొరేట్ సంస్థల సహకారం అంతకంతకు పెరుగుతోంది. ముంబయిలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా, చించ్పోక్లీచా చింతామణి మండపాలు ఈ వరుసలో ముందున్నాయి. ఈ ఏడాది చించ్పోక్లీచా చింతామణికి అదానీ గ్రూప్ సహకారం అందిస్తున్నది. గత ఏడాది అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా మండలిలో అధికారికంగా చేరారు. ప్రముఖ మండపాలతో అనుబంధం ద్వారా కార్పొరేట్ కంపెనీలు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.లాల్బాగ్చా రాజా మండపానికి ఉన్న విస్తృత ప్రజాదరణ, ప్రముఖుల సందర్శనలను తమ ప్రచారానికి అనువుగా కార్పొరేట్ కంపెనీలు మలచుకుంటున్నాయి. అదానీ గ్రూప్ నుంచి రూ.3.5 కోట్లు పొందిన చింతామణి మండపం మరింత వ్యవస్థీకృత విధానాన్ని అనుసరిస్తోంది. అర కిలోమీటరు పొడవైన ప్రత్యేక ప్రచార ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, సొంత మార్కెటింగ్ బృందాన్ని నియమించింది. తొలిసారిగా ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేసింది. ఉత్సవానికి ముందే చింతామణి విగ్రహం ఆగమన్‌కు పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయడంతో భారీగా జనం తరలివచ్చారు.లాల్బాగ్చా రాజా వద్ద సర్దార్ హోటల్ నుంచి కాలాచౌకీ పోలీస్ స్టేషన్ వరకు ప్రధాన రహదారులపై బ్రాండింగ్ కేంద్రీకృతమైంది. భారీగా భక్తులు వచ్చే ప్రాంతాల్లో స్పాన్సర్ల బ్రాండింగ్‌ను ఏర్పాటు చేశారు. చింతామణి మండపంలో నిర్వాహకులే ప్రచార సందేశాలు, కంటెంట్‌ను నిర్వహిస్తూ భక్తుల భాగస్వామ్యం, స్పాన్సర్లకు కనిపించే స్థాయికి ప్రాధాన్యమిస్తున్నారు. చింతామణితో అనుబంధం తమకు గౌరవప్రదంగా ఉందని అదానీ ప్రతినిధి తెలిపారు. భక్తుల భద్రత, జనసమూహాల నిర్వహణపైనే తమ దృష్టి ఉందని, అదే సమయంలో చింతామణి సంప్రదాయాలను గౌరవిస్తూ, పరిరక్షిస్తున్నామని చెప్పారు.విగ్రహాల వద్దకు వెళ్లే రహదారులు, సందులు కూడా ప్రకటనల స్థలాలుగా మారుతున్నాయి. గణేశోత్సవ సమయంలో లక్షలాది భక్తుల కోసం ప్రత్యేక దర్శన మార్గాలు, బ్యారికేడ్లు, ప్రజలకు అందుబాటులో ఉండే మార్గాలకు అనుమతులు తీసుకుంటారు. ఈ మార్గాల్లోని బ్యారికేడ్లు, స్వాగత తోరణాలు, బ్యానర్లు, దిశానిర్దేశక బోర్డులు తదితరాలు స్పాన్సర్‌షిప్‌లో భాగమవుతున్నాయి. క్యూల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ప్రకటనదారులకు ఒకే చోట లభించే వినియోగదారులుగా మారుతున్నారని, జనసందోహం పెరిగే కొద్దీ ఈ ప్రాంతాల వాణిజ్య విలువ కూడా పెరుగుతోందని స్పాన్సర్‌షిప్‌తో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు.స్పాన్సర్ల ప్రాధాన్యం పెరుగుతుండటంపై ఉత్సవ నిర్వాహకుల్లో చర్చ మొదలైంది. వాణిజ్య భాగస్వామ్యం ఉత్సవ స్వభావాన్ని మార్చడం లేదని, భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు ఇది అవసరమని నిర్వాహకులు చెబుతున్నారు. అయినప్పటికీ సంప్రదాయానికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని, ఆచారాలు, పూజా విధానాలు, ఉత్సవ నిర్ణయాలు సంప్రదాయాలు, విలువల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.ఇదీ చదవండి: నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం -
మహాగణపతి దర్శనానికి వెళ్తున్నారా? ఈ రూట్లు గుర్తుంచుకోండి!
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ పెరగడంతో ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి మింట్ కాంపౌండ్ వైపునకు వెళ్లే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి రాజ్‌దూత్ చౌరస్తా మీదుగా ఖైరతాబాద్ మహాగణపతి వైపునకు వెళ్లే వాహనాలను ఎక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. ఎక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఈ వాహనాలను సచివాలయ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ప్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ పోస్టాఫీస్ లైన్ మీదుగా రైల్వే గేటు వైపు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఖైరతాబాద్, షాదాన్ కాలేజీ, అయోధ్య, నిరంకారి, పాత సైఫాబాద్ పోలీస్‌స్టేషన్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం జంక్షన్, నెక్లెస్ రోటరీ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడవచ్చని, అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.వాహనాల పార్కింగ్ వాహనాల పార్కింగ్ కోసం నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులు రేస్ కోర్స్ రోడ్డు, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానం, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్కు చేసుకోవాలని, ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తులు విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంతంలో వాహనాలు పార్కు చేసుకోవాలని తెలిపారు.ఇవీ చదవండి: తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే! -
పండుగ రిస్క్ కు పాలసీ షీల్డ్
పండుగలంటే కేవలం ఆధ్యాత్మికత, వినోదమే కాదు. రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు పండుగలో భాగంగా మారుతోంది. భారీ పందిళ్లు, విలువైన ఆభరణాలు, పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ప్రమాదాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలకు ఇది కొత్త మార్కెట్ అవకాశంగా మారుతోంది. పండుగ ఎంత గ్రాండ్‌గా జరిగితే రిస్క్ అంత పెద్దదిగా ఉంటుంది. ఆ రిస్క్‌కు ఇప్పుడు బీమానే రక్షణ కల్పిస్తోంది.సాక్షి, బిజినెస్ డెస్క్: గణేశ్ ఉత్సవం అంటే భక్తుల సందడి, , భారీ పందిళ్లు, విరాళాల వెల్లువ. అయితే ఈసారి ఆ సందడితో పాటు రిస్క్ మేనేజ్మెంట్ పైనా నిర్వాహకులు ఫోకస్ పెట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, చోరీలు, అల్లర్లు, ప్రమాదాలు వంటి ముప్పుల నుంచి రక్షణ కోసం గణపతి పందిళ్లు బీమా బాట పడుతున్నాయి. బీమా కంపెనీలకు వినాయకచవితి పండుగ కొత్త వ్యాపార అవకాశంగా మారుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీమా తీసుకుంటున్న గణపతి పందిళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా గణనీయంగాపెరిగిందని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే భారీ జంప్ గత ఏడాది సుమారు 20నుంచి 30 పందిళ్లకు బీమా అందించిన ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 100 పందిళ్లకు బీమా చేసింది. చిన్న చిన్న పందిళ్ల నిర్వాహకులు కూడా బీమా ప్రీమియం చెల్లిస్తూ కవరేజీ కోరడం ఈ పెరుగుదలకు కారణమవుతోంది. సాధారణంగా పందిళ్లకు 7లక్షల కవరేజీకి రూ.3000 వరకు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఈ కాంప్రెహెన్సివ్ పాలసీలో అగ్నిప్రమాదాలు, వరదలు, విరాళాల చోరీలు, అల్లర్లు, గణేశ్ విగ్రహం, ఆభరాణాలు పందిళ్లలో పనిచేసే సిబ్బందికి వ్యక్తిగత ప్రమాద బీమా వంటి రిస్క్ లన్నిటికీ కవరేజీ లభిస్తుంది. పందిళ్లకు పెరిగిన టెన్షన్ వర్షాలు, వరదలు, అల్లర్లను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అధిక బీమాను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది బీమా తీసుకుంటున్న గణపతి పందిళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్ వరదలు, మహారాష్ట్రను ముంచెత్తుతున్న వర్షాలు, ముంబై నగరాన్ని అకస్మాత్తుగా అల్లకల్లోలం చేస్తున్న వర్షాల అంచనాలు నిర్వాహకులను అప్రమత్తం చేశాయి. ప్రకృతి వైపరీత్యాలతో పాటు, ఉత్సవ సమయంలో జరిగే అల్లర్లు, గణపతి ప్రతిష్ట, నిమజ్జనం ఊరేగింపులో సంభవించే ప్రమాదాలు, పందిళ్లలో జరిగే చోరీలపై కూడా నిర్వాహకుల్లో అవగాహన పెరిగింది. బీమాను ఇపుడు ఖర్చుగా కాకుండా రిస్క్ మేనేజ్మెంట్ సాధనంగా చూస్తున్నారని ఇన్వెస్టాక్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ డైరెక్టర్ హితేష్ లఖానీ తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలకు కూడా బీమా కృష్ణాష్టమి మరుసటి రోజు నిర్వహించే ‘దహీ హండి’ వేడుకలకు కూడా బీమా చేయడం అలవాటుగా మారింది. ఈ వేడుకలో కొంత మంది యువకులు (గోవిందులు) మానవగోపురాలుగా ఒకరిపై ఒకరు నిలబడి పెద్ద హ్యూమన్ పిరమిడ్‌ను ఏర్పరుస్తారు. మరికొందరు వారిపైనుంచి పైకెళ్లి గాల్లో ఎత్తులో కట్టిన పెరుగు (దహీ) వెన్నతో నింపిన మట్టి పాత్రను (హండీ)ని పగులగొట్టడం ఈ ఆట ఉద్దేశం. కుండను పగులగొట్టే సమయంలో పడిపోవడం, గాయపడడం వంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అందుకు వ్యక్తిగత ప్రమాదంతో పాటు ఆసుపత్రి ఖర్చుల కవరేజీ కీలకంగా మారింది. ఈ ఏడాది ఒక్కో గోవిందాకు హస్పిటలైజేషన్ కవరేజీ రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు నిర్వాహకులు పెంచారు. మహారాష్ట్ర రాజ్య దహీ హండీ గోవిందా అసోసియేషన్ ఈ బీమా ప్రీమియం ఖర్చు చెల్లిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బీమాకు రూ.కోటి కేటాయించినట్లు సమాచారం. ఈ ఏడాది దహీహండి వేడుకల్లో పాల్గొన్న 1,65,535 మంది గోవిందులకు బీమా కలి్పంచారు. గతేడాది ఈ సంఖ్య 1.60 లక్షలు. ఒక్క గోవిందునికి రూ.75 ప్రీమియంతో సుమారు రూ.10 లక్షల ప్రమాదబీమా అందిస్తున్నారు. విగ్రహం కంటే ఆభరణాలే ఖరీదు పెద్ద పెద్ద గణపతి పందిళ్ల నిర్వాహకులు సాధారణ బీమాతో ఆగడంలేదు. వినాయకుడి విగ్రహానికి అలంకరించే బంగారు ఆభరాణాలకు ప్రత్యేకంగా బీమా కవరేజీ తీసుకుంటున్నారు. భారీ స్థాయిలో విలువైన నగలతో అలంకరించే పందిళ్లలో ఇది కీలకమైన రిస్క్ కవర్ గా మారింది. మహారాష్ట్రలో ప్రముఖ పందిళ్లయిన జీఎస్బీ సేవా మండల్, లాల్ బగీచ రాజ సార్వజనిక్ గణేశ్ ఉత్సవ మండల్ భారీ స్థాయిలో బీమా తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్ వర్గాల ప్రకారం జీఎస్బీ సేవా మండల్ ఈ ఏడాది రూ. 703 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది. గత ఏడాది ఇది రూ.474 కోట్లుగా ఉంది. -
నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధం.. 47 చెరువుల్లో ఏర్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గ్రేటర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు విస్తృత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. భారీ విగ్రహాల నిమజ్జనం, లక్షలాది మంది భక్తుల రాక, ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, చెత్త పేరుకుపోవడం వంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని అధికారులు వివిధ విభాగాల సమన్వయంతో కార్యాచరణ రూపొందించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద క్రేన్లు, ఈతగాళ్లు, పడవలు, వైద్య శిబిరాలు, మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ధ్య బృందాలను అందుబాటులో ఉంచనున్నారు.జీహెచ్ఎంసీలో 47 చెరువులు.. జీహెచ్ఎంసీ పరిధిలో 47 సరస్సులు, చెరువుల వద్ద నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో 17 సరస్సులు, 30 చెరువులు, కొలనులు ఉన్నాయి. వీటి వద్ద 110 క్రేన్లు కేటాయించే ప్రణాళిక సిద్ధమైంది. ఖైరతాబాద్, అంబర్‌పేట, జల్పల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో 41 క్రేన్లు, ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద 21 క్రేన్లు ఉంటాయి. నిమజ్జన ప్రాంతాల వద్ద 770 మంది పారిశుద్ధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు.సైబరాబాద్ పరిధిలో 54 నిమజ్జన కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. వీటిలో 32 సరస్సులు, 13 బేబీ పాండ్లు, 7 తాత్కాలిక పాండ్లు, ఒక పోర్టబుల్ పాండ్, మరో పాండ్ ఉన్నాయి. 81 క్రేన్లు, 1,138 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 130 టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో కొత్త తాత్కాలిక నిమజ్జన పాండ్లను ప్రతిపాదించారు. దుర్గం చెరువు, అంబీర్ చెరువు, పరికి చెరువు, ఐడీఎల్ లేక్, ఊర చెరువు, పెద్ద చెరువు లతోపాటు కొల్లూరు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోనూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో 1,138 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.కేబుళ్ల తొలగింపు..తాత్కాలిక లైట్లు నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు మార్గాల్లో ఫోకస్ లైట్లు, తాత్కాలిక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు వేలాడుతున్న కేబుళ్లను తొలగించనున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు, గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులు, ఫుట్‌పాత్‌లకు రంగులు వేయడం వంటి పనులు చేపట్టనున్నారు.రంగంలో గణేశ్ యాక్షన్ టీమ్స్ నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో చెత్త పేరుకుపోకుండా గణేశ్ యాక్షన్ టీమ్స్(జీఏటీ)ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆయా మార్గాల వారీగా పారిశుద్ధ్య సిబ్బంది, శానిటరీ సూపర్వైజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను కేటాయించి మూడు షిఫ్టుల్లో పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా: సీఎండీ ఖైరతాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని, అలాగే ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గణేష్ ఉత్సవాలపై సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన మండపాలు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాల వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్టాండ్‌బై జనరేటర్లు ఏర్పాటు చేయాలని, నగరానికి విద్యుత్ సరఫరా అందించే 220 కేవీ, 132 కేవీ స్టేషన్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు.ఎంఎంసీలో 40 ప్రాంతాల్లో..మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ విగ్రహాల తరలింపు, నిమజ్జన ప్రక్రియ కోసం 84 క్రేన్లు, 1,356 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 62 మొబైల్ టాయిలెట్లు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోనూ చెరువుల వద్ద క్రేన్లు..రోడ్లపై జీఏటీలు, వినాయకులను తరలించే మార్గాల్లో బారికేడ్లు.. అత్యవసర సేవలకు వైద్య, ఫైర్, రెస్క్యూ బృందాలు, విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బంది సిద్ధంగా ఉండనున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించేందుకు మూడు కార్పొరేషన్ల కమిషనర్లు కర్ణన్, సృజన, వినయ్‌కృష్ణారెడ్డి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి: తెలంగాణకు ఇది చీకటి రోజు -
గణేష్ మండపాల వద్ద డీజేలపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి కొద్దిరోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో మండపాల వద్ద శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. డీజేల మోత మోగిస్తే స హించేది లేదని తేలి్చచెబుతున్నారు. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గర్భిణులు, నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండటంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. నిబంధనలు కచి్చతంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించారు.సౌండ్ పెంచితే సీజ్ ఖాయం.. నగర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల్లో డీజే సిస్టంలపై పోలీసులు సైలెంట్ అటాక్ ప్రారంభించారు. శబ్ద తీవ్రతను కొలిచేందుకు ప్రత్యేకంగా డెసిబుల్ మీటర్లతో ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లు, డీజేలు వాడటానికి వీల్లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నివాస ప్రాంతాల్లో 55 డెసిబుల్స్, పగటిపూట గరిష్టంగా అనుమతించిన స్థాయులనే పాటించాలి. స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధిని నో నాయిస్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో శబ్దం చేస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.హామీ పత్రం ఇస్తేనే అనుమతి ఈ ఏడాది ఉత్సవ కమిటీలకు పోలీసుల అనుమతి లభించాలంటే కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మండపంలో శబ్ద పరిమితులు దాటవని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఆపివేస్తామని నిర్వాహకులు రాతపూర్వక పత్రం సమరి్పంచాలి. డీజే, సౌండ్ సిస్టమ్స్ సరఫరా చేసే యజమానులకు ముందస్తుగానే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. గతేడాది గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. గతేడాది శబ్ద కాలుష్య నియమావళిని దాటిన వారిపై 250కి పైగా కేసులు నమోదు చేయగా, 150కి పైగా భారీ డీజే సెట్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి ఉల్లంఘనలకు పాల్పడితే డీజే పరికరాలతో పాటు రవాణా చేసిన వాహనాలను కూడా జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: అప్పుడు ఓనర్.. ఇప్పుడు డ్రైవర్! -
గణేశ్ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు
ముంబై: రాబోయే గణేశ్ ఉత్సవాల్లో ఆరు అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వినాయక విగ్రహాలను తప్పనిసరిగా కృత్రిమ చెరువుల్లోనే నిమజ్జనం చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ).. కోర్టు తీర్పు మేరకు ఆదేశించింది. సెప్టెంబర్ 14 నుంచి పది రోజుల పాటు గణేశ్ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రభుత్వ అధికారులు, గణేశ్ మండపాల ప్రతినిధులు, విగ్రహ తయారీదారుల సమీక్షా సమావేశం అనంతరం బీఎంసీ ఈ వివరాలను వెల్లడించింది.హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తుది తీర్పు వచ్చే వరకు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ముంబై వ్యాప్తంగా 281 కృత్రిమ చెరువులు, 44 బీచ్‌లు/జెట్టీలు, 23 సహజ సరస్సులతో కలిపి మొత్తం 348 నిమజ్జన ప్రాంతాలను సిద్ధం చేశారు. కృత్రిమ చెరువుల వివరాలను క్యూఆర్ కోడ్లు, గూగుల్ మ్యాప్స్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉంచనున్నారు. భద్రత కోసం 1,132 మంది లైఫ్‌గార్డులు, 85 అంబులెన్స్‌లు, 34 క్రేన్లు, 10 మోటార్ బోట్లను రంగంలోకి దించుతున్నారు. వీటితో పాటు 498 చెత్త సేకరణ డబ్బాలు, 326 డంపర్లు, 6,052 ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.విగ్రహాల రవాణా మార్గాల్లోని 506 రహదారులపై ఉన్న 4,279 గుంతలను, 171 డ్రైనేజీ మూతలను బీఎంసీ మరమ్మతు చేసింది. 281 చోట్ల అడ్డంకిగా ఉన్న కేబుళ్లను తొలగించి, 515 ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను కత్తిరించింది. పర్యావరణహిత వేడుకల కోసం తయారీదారులకు 858 టన్నుల మట్టి, 25,400 లీటర్ల ఎకో-ఫ్రెండ్లీ రంగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1,136 మంది విగ్రహ తయారీదారులకు అనుమతులు మంజూరయ్యాయి.ఉత్సవాల సందర్భంగా ‘శ్రీ గణేశ ఆరోగ్యచ’ పేరిట మండళ్ల వద్ద ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ముంబై మేయర్ రీతు తావ్డే తెలిపారు. వీటిలో సాధారణ ఆరోగ్య, నేత్ర పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేపడతారు. భక్తులకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని, రద్దీ ఉండే ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేక గదులు, మరుగుదొడ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ‘డాడీ గుర్తొస్తున్నావ్..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్‌స్టా పోస్ట్! -
గణేశ్ మండపంలో సింగర్ సునీత.. ఒళ్లు పులకరించిపోయేలా..(ఫోటోలు)
-
Ganesh Chaturthi: మండపాల్లో ‘ఫ్రీ శాంపిల్స్’.. ఎగబడుతున్న జనం
ముంబై: గణపతి నవరాత్రులు మహారాష్ట్రంలోని ముంబైని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాడవాడలా ఏర్పాటైన గణేశ్ మండపాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. దీనికితోడు అక్కడ హోరెత్తిస్తున్న భక్తి పాటలు, డప్పుశబ్ధాలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. అయితే ఈ ఉత్సవాలు వ్యాపారవర్గాలకూ భలే కలిసి వస్తున్నాయి. వివిధ సంస్థలు పనిలో పనిగా వివిధ గణేశ్ మండపాల్లో తమ బ్రండ్లకు ప్రమోషన్ చేసుకుంటున్నారు.ఎఫ్ఎంసీజీ దిగ్గజాల నుండి రియల్ ఎస్టేట్ సంస్థల వరకు అన్ని కంపెనీలు ఉత్సవాల్లో తమ బ్రాండ్లకు ప్రచారం కల్పించుకుంటున్నారు. కిరాణా సామగ్రిని విక్రయించే కొన్ని క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు పది నిమిషాల్లో డెలివరీ పేరుతో వినాయక పూజకు సంబంధించిన సామగ్రితో పాటు మోదకాలను కూడా విరివిగా విక్రయిస్తున్నాయి. తమ కంపెనీల స్థాళ్లను వినాయక మండపాల వద్ద పెట్టి, వినియోగదారులను వివిధ ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి.ప్రముఖ బిస్కెట్లు, స్వీట్ల కంపెనీ గణేశ్ మండపాల వద్ద తమ బ్రాండ్ స్టాల్స్ పెట్టి, అక్కడికి వచ్చే భక్తులకు శాంపిల్స్‌ను అందిస్తున్నాయి. అలాగే తమ వంటకాల రుచులను కూడా చూపిస్తున్నాయి. మోదక్ చాక్లెట్ల పేరుతో వినియోగదారులకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ‘ఆర్గానిక్ తత్త్వ’ అనే కంపెనీ వినాయక ఉత్సవాలనే టార్గెట్‌గా చేసుకుని తమ ఉత్పత్తులకు విరివిగా ప్రచారం కల్పిస్తోంది. ఆర్గానిక్ బెల్లం, పప్పు దినుసులను విక్రయిస్తోంది.ఒక ప్రముఖ పెయింటింగ్ కంపెనీ రాబోయే దీపావళికి మీ ఇంటికి మా రంగులు వేయించుకోండి అంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఆఫర్లు కూడా ప్రకటించింది. దీనిని ప్రతిబింబించేలా ఒక ప్రకటన కూడా రూపొందించి గణేశ్ మండపాల వద్ద ప్రదర్శిస్తోంది. ఒక వంట నూనెల సంస్థ.. తమ ఆయిల్‌తో వంటకాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయని చెబుతూ, మండపాలకు వచ్చే భక్తులకు వివిధ శాంపిల్ రుచులను చూపిస్తోంది. ఈ విధమైన బ్రాండ్ల ప్రచారాన్ని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మనకెందుకులే అనుకుంటూ, మండపాల వద్ద బ్రాండ్ శాంపిల్స్ తీసుకుంటూ మురిసిపోతున్నారు. -
Lalbaugcha Raja: తొలిరోజే నిండిన హుండీలు.. భారీగా బంగారు, వెండి కానుకలు కూడా..
ముంబై: దేశవ్యాపంగా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గణపతి ఉత్సవాలను మహారాష్ట్ర పెట్టింది పేరు. ముఖ్యంగా ముంబైలో జరిగే గణనాథుని ఉత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతాయి. ఇక్కడి ‘లాల్బాగ్చా రాజా’ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లక్షలాదిగా భక్తులు ఈ గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తూ నగదును, విలువైన కానుకలను అందిస్తున్నారు. VIDEO | Devotees throng Mumbai’s iconic Lalbaugcha Raja to offer prayers and seek blessings during the ongoing Ganesh Chaturthi celebrations.#Ganeshotsav #GaneshChaturthi2025(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/6foYt5XqiL— Press Trust of India (@PTI_News) August 30, 2025గణపతి నవరాత్రుల తొలిరోజునే లాల్ బాగ్చారాజాకు భారీగా విరాళాలు, కానుకలు అందాయి. అలాగే బంగారం, వెండి కానుకలు కూడా గణనీయంగా వచ్చాయని లాల్బాగ్చా రాజా సార్వజనిక్ గణేశోత్సవ మండల్ నిర్వాహకులు తెలిపారు. స్టేజ్ హుండీ నుండి రూ. 25.50 లక్షలు, రంగ్ హుండీ ద్వారా మరో రూ. 20.50 లక్షలు విరాళాలుగా అందాయని, తొలిరోజున మొత్తం విరాళాలు రూ. 46 లక్షలని నిర్వాహకులు వివరించారు. అలాగే పలువురు భక్తులు 144.050 గ్రాముల బంగారం, 7,159 గ్రాముల వెండిని సమర్పించారని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబైలో లాల్బాగ్చా రాజాను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థనలు చేసి, నగదు లేదా నగల రూపంలో విరాళాలు సమర్పిస్తుంటారు. ఈ విరాళాలను లెక్కించే ప్రక్రియ ఉత్సవాల రెండవ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఉత్సవ నిర్వాహకుల పర్యవేక్షణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జీఎస్ మహానగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు విరాళాలను లెక్కిస్తారు. -
Tadepalli: గణపతి పూజలో వైఎస్ జగన్
-
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి శోభ
-
YS Jagan: వినాయక చవితి శుభాకాంక్షలు
-
బాలగణపతి భళా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ పంచముఖాంజనేయ స్వామి ఆలయం వద్ద హైందవసేన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలగణపతి విగ్రహం ఆకట్టుకుంటోంది. మట్టితో తయారు చేసి, పర్యావరణహిత రంగులు పూసిన ఈ 15 అడుగుల విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల వారు సైతం భారీగా వస్తున్నారు. ఇక్కడ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలు ఉత్సవ సమితులు సైతం ఈ విగ్రహం గురించి అడిగి తెలుసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో తయారీ.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు సమీపంలో మిలాన్ చక్రవర్తి అనే విగ్రహాల తయారీదారు ఈ బాలగణపతి విగ్రహాలను తయారు చేస్తున్నాడు. నిజామాబాద్‌కు చెందిన హైందవ సేన ఉత్సవ సమితి సభ్యులు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ విగ్రహాన్ని చూసి జనవరిలో ఆర్డర్ ఇచ్చారు. పూర్తిగా ఎండు గడ్డి, బంక మట్టితో తయారు చేసిన ఈ విగ్రహం లంబోదర ఆకృతిలో ఉంది. రాయ్‌పూర్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్‌కు ఈ విగ్రహాన్ని తరలించేందుకు 5 రోజుల సమయం పట్టింది. ఈ విగ్రహానికి ఇన్‌స్ట్రాగామ్‌లో 22 లక్షల వ్యూస్ వచి్చనట్లు హైందవ సేన ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. ఇప్పటివరకు కొందరు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను పంచిపెడుతూ వస్తున్నాయి. కానీ అవి చిన్న విగ్రహాలే. భారీ విగ్రహాలు మాత్రం 95 శాతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవే. ఈ క్రమంలో మట్టి విగ్రహాల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ కష్టంతో కూడుకున్నది కావడంతో.. ఆ మేరకు తయారీదారులు, ఉత్సవాలు నిర్వహించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు. -
తాడేపల్లి వైఎస్సార్సీపీ ఆఫీస్ లో వినాయక చవితి ఉత్సవాలు
-
Vinayaka Chavithi 2024: వినాయక వ్రత కథ, కష్టాలు తొలగి, సమస్త సౌఖ్యాలు సొంతం
Vinayaka Chavithi 2924: వినాయక వ్రత కథ, కష్టాలు తొలగి, సమస్త సౌఖ్యాలు సొంతం
-
వినాయక చవితి 2024 : మహాగణపతి పూజా విధానం
వినాయక చవితి 2024 : మహాగణపతి పూజా విధానం
-
గణపతి రూపాన్ని మార్చకండి..అన్ని రూపాలకు మూలం గణనాధుడు
-
కలశం వేలం ఎందుకంటే..
-
వినాయకుడి తొండం ఎటువైపు తిరిగి ఉంటే శ్రేయస్కరం
-
వినాయక చవితి విశిష్టత..!
-
ధన త్రయోదశి రోజున పూజ ఏ విధంగా చేయాలి ?
-
వినాయకుని పూజకు ముఖ్యంగా అవి ఉండాల్సిందే!
ఆదిదంపతుల మానసపుత్రుడు, ఓంకార స్వరూపుడు, విఘ్నాలను శాసించే వాడు, సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వ దేవతా లక్షణసమన్వితుడు, స్వల్పకాలంలో భక్తులకు ముక్తినిచ్చే మోక్షప్రదాత మన గణపయ్య.. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ చేయ్యాల్సిందే.. తలచిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాల్సిందే! దైవారాధనలో, పూజాదికాలలో, సర్వ శుభకార్యాల ఆరంభంలో ఈ మొత్తం జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడే అందుకే ఆయన్ని ‘జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం’ అన్నది వేదం. జపహోమాదుల్లోనూ గణపతిపూజే ప్రథమ కర్తవ్యం. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అనేది అందుకే! అమ్మ చేతిలో పసుపుముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు, విద్యాప్రదాత కూడా! అందుకే కోరిన విద్యలకెల్ల ఒజ్జయైయుండెడి పార్వతీ తనయ, ఓయి! గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తూ ఉంటాము. వినాయకచవితి నాడు ఉదయాన్నే మేల్కొని, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానమాచరించి, శుభ్రమైన దుస్తులు ధరించి, వ్రతమాచరించాలి. ఇంటిని శుభ్రపరచుకొని, స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, అరటిబోదెలతో మంటపాన్ని ఏర్పాటు చేసుకొని, పాలవెల్లి కట్టిన పీఠంపై తెల్లటి వస్త్రం పరచి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, ఆహ్వానించి దూర్వా (గరిక) తదితర ఏకవింశతి (21) రకాల పత్రాలతోను, షోడశోపచారాలతో పూజించి, వినాయకోత్పత్తి కథను చదువుకొని, అక్షతలను శిరస్సుపై ధరించాలి. స్వామివారికి వడపప్పు, కొబ్బరి, చెరకు, బెల్లం, ఉండ్రాళ్లు, లడ్డూలు, మోదకాలు, కుడుములు నివేదించాలి. మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజూ ఓ పండుగే! పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం. వినాయకుడు అనే పేరు విన్నా, పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించి ఆనందం కలుగుతుంది. గణపతి తనగోడు వింటాడు, తను తలచిన ఏ కార్యక్రమానికైనా ఎటువంటి ఆటంకం కలుగనీయడు అని ప్రతి భక్తుడు భావిస్తాడు. భక్తుల భావాల్లో ఇంతగా సుప్రతిష్ఠమైన గణపతిని ఆరాధించటంలో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. భాద్రపదమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. ఆనాడు ఆదిదేవుడైన వినాయకుడి ఆవిర్భావం జరిగిన రోజు. ఆరోజు గణపతి పూజ విశేష ఫలితాన్నిస్తుంది. ఎన్ని కష్టాలు, అవరోధాలున్నా, వాటన్నిటినీ తొలగించే తొలిదైవం వినాయకుడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయక చవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతియైన ఆ విఘ్నేశ్వరున్ని భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నింటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడు. ఈ వ్రత పరమార్థం సమాజంలో ఐకమత్యాన్ని, దైవభక్తిని, జీవనశైలిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింప జేయటమే కాక, భావసమైక్యతకు సహజజీవన సిద్ధాంతానికి నిదర్శనం. పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు. పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశం మీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము. నైవేద్యం: ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి. పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి, ఆయా మంత్రాలతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపము కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి. పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామివారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము. పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు తమ ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఏ వృత్తి వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం. మట్టి వినాయకుడ్ని పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం !! మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టిధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
హుస్సేన్ సాగర్ చుట్టూ 200 సీసీ కెమెరాల ఏర్పాటు
-
పూర్వం నుంచి మట్టిని దైవంగా భావించే ఆచారం మనది
-
ఎవరైతే “ఈ వృత్తాన్ని" వినాయక చవితి రోజు వింటారో వాళ్లకు అనుగ్రహం కలుగుతుంది
-
గరం గరం ముచ్చట్లు 31 August 2022
-
ఆగస్టు 31న మాంసం విక్రయాలు, జంతు వధ నిషేధం
కర్ణాటక: బెంగళూరులో ఆగస్టు 31న మాంస విక్రయాలను, జంతు వధను నిషేధించారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆగస్టు 31న గణేష్ చతుర్థి సంధర్భంగా ఈ నిషేధాన్ని విధించినట్లు పేర్కొంది. అంతేకాదు నిషేధం విధిస్తూ పౌరసరఫరాల సంస్థ సర్యులర్ కూడా జారీ చేసింది. పైగా మరింత సమాచారం కోసం నిషేధం కాఫీని కూడా జత చేసింది. పశుసంవర్ధక శాఖ జాయింట డైరెక్టర్ బృహత్ బెంగళూరు మహానగర కార్పొరేషన్ పరిధిలోని దుకాణాల్లో జంతువులను వధించడం మాంసం విక్రయించడం నిషేధమని తెలియజేశారు. ఇంతకమునుపు ఈ నెల ప్రారంభంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా మాంసం అమ్మకాలను, జంతువులను చంపడాన్ని నిషేధిస్తూ పౌర సరఫరాల శాఖ సర్క్యులర్ జారీ చేసింది. (చదవండి: హిజాబ్ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు) -
గణేష్ మండపాలపై ఏపీలో ప్రతిపక్షాల నీచ రాజకీయాలు
-
‘గణేష్ మహరాజ్ కి జై బోలో’.. భక్తుల సందడి (ఫొటోలు)
-
అమ్మ ఆరోగ్యం కోసం వినాయకుడి చేతిలోని లడ్డూ చోరీ
సాక్షి, వేములవాడ(కరీంనగర్): గణేశ్ విగ్రహం వద్దనున్న లడ్డూను తీసుకొచ్చి తినిపించడంతోపాటు ఇంటి చుట్టూ చల్లితే అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందనే సెంటిమెంట్‌తో 9వ తరగతి చదువుతున్న బాలుడు మార్కెట్ ఏరియాలోని వినాయడి చేతిలోని లడ్డూ ను దొంగిలించి సీసీ కెమెరాకు చిక్కాడు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నలుగురు వచ్చి వినాయకుడి చేతిలోని లడ్డూను తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. లడ్డూ చోరీ చేసిన వారంతా బాలురు కావడం విశేషం. వీరిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు. ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని సీఐ వెంకటేశ్ తెలి పారు. మరో లడ్డూ మాయం వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలోంచి మంగళవారం రాత్రి 10 కేజీల లడ్డూ మాయమైందని నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వేములవాడలో ఇది రెండో లడ్డూ దొంగతనానికి గురైంది. మూఢనమ్మకాలను నమ్మరాదు ఏదోఒక సెంటిమెంట్ అంటూ మైనర్లు, యువకులు వినాయక మంటపాల్లోని లడ్డూలను దొంగతనంగా తీసుకెళ్లడం సరైందికాదు. ఆరోగ్యం బాగుండాలంటే వైద్యం చేయించాలి. ఇలాంటి మూఢనమ్మకాలతో మండపాల నిర్వహణలో అల్లర్లు, గొడవలు జరిగే అవకాశాలున్నాయి. ప్రతీ మంటపం వద్ద నిర్వాహకులు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. – సీఐ వెంకటేశ్ -
గణేష్ ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
గుత్తి: పట్టణంలో వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్ద కుళ్లాయప్ప(25) అనే యువకుడు వినాయక మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. పట్టణంలోని స్వీపర్స్ కాలనీకి చెందిన ఓబుళమ్మ కుమారుడు పెద్ద కుళ్లాయప్ప శనివారం రాత్రి 11 గంటల సమయంలో స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మంటపానికి వెళ్లాడు. అక్కడే సుమారు గంటన్నర పాటు గడిపాడు. తర్వాత మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా చనిపోయి ఉండొచ్చని మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సీఐ రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి: కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం? -
మండపాలకు లంబోదరుడు
-
గణపతి బప్పా మోరియా...
-
హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు
-
TS: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు అమలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి గురువారం ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ప్రత్యేక కుంట్లలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని హైకోర్టు సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..) -
ఢిల్లీ లో వినాయక చవితి వేడుకల పై ఆంక్షలు
-
నేడు ఖైరతాబాద్ మహా గణపతికి నేత్రోత్సవం
శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ నెల 10న వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందే పనులు పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా 11 అడుగులకే పరిమితమైన మహాగణపతి విగ్రహ ఎత్తును ఈసారి 40 అడుగులకు పెంచారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ సూచన మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ప్రజలను కాపాడేందుకు శివుడి రుద్ర అవతారమైన పంచముఖ రుద్ర మహాగణపతిగా నామకరణం చేశారు. (చదవండి: పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!) మహాగణపతి కుడివైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాగా మహా గణపతికి శనివారం ఉదయం 11.30 గంటలకు నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. మహాగణపతికి కంటి పాపను పెట్టడం ద్వారా మహాగణపతికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు. –సాక్షి, ఖైరతాబాద్ -
మట్టి గణనాదుల పై పెరుగుతున్న అవేర్ నెస్
-
ఖైరతాబాద్ గణేష్ తయారీ విశేషాలు
-
‘గణేష్ ఉత్సవాలను బాగా జరుపుకోవాలి’
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల నిర్వాహణపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల నుంచి కరోనా వలన గణేష్ ఉత్సవాలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని అన్నారు. అయితే, ఈసారి దేవుని ఆశీస్సులతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నాం... గణేష్ ఉత్సవాలను కూడా ఇలానే జాగ్రత్తగా నిర్వహించుకోవాలని తెలిపారు. వినాయక నిమజ్జన కోసం.. ప్రత్యేకంగా క్రేన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈసారి ట్యాంక్ బండ్ నిండుకుండలాగా ఉందని అన్నారు. కాగా, విగ్రహల ఎత్తు గురించి ప్రభుత్వం ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదని అన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వారు గణేష్ విగ్రహల ఏర్పాటుకి అనుమతి ఇస్తారని అన్నారు. చదవండి: Hyderabad: రెండు కేజీ బంగారు నగల బ్యాగు మిస్సింగ్ -
గణేష్ ఉత్సవాలపైమంత్రులు, ఉత్సవ కమిటీ సమావేశం
-
తిరుపతిలో ఈ సారి భిన్నంగా చవితి వేడుకలు
-
జై..జై..గణేశా..
-
జై.. జై.. గణేశా..!
-
మెల్బోర్న్లో వైభవంగా గణేష్ ఉత్సవాలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు, అభిమానుల ఆధ్యర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితిగా ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ నాయకుడు దినేష్ గోరిసెట్టి, ఎం.టి.ఎఫ్ సంఘం అధ్యక్షుడు వెంకట్ నూకాల హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనా ధీమా వ్యక్తం చేశారు. తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కలిల్ కాట్పల్లి, వినాయక్ కొలపేలతో పాటు దాదాపు మూడువేల మంది ప్రవాసభారతీయులు పాల్గొన్నారు. -
ఎవరిని కదిలించినా కన్నీళ్లే
-
గణేష్ నిమజ్జనం : అప్ డేట్స్
సాక్షి, హైదరాబాద్ : బొజ్జగణపయ్య నిమజ్జన పర్వం ప్రశాంతంగా కొనసాగుతోంది. జై భోలో గణేష్ మహరాజ్ కీ... జై అంటూ నినాదాలతో హోరెత్తుతోంది. బాలాపూర్ శోభా యాత్ర మంగళవారం రాత్రి 9గంటలకు పాత బస్తీ దాటడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ హుస్సేన్ సాగర్‌లో వినాయకుల నిమజ్జనం కొనసాగుతోంది. నగరం నలుమూలల నుంచి నడిబొడ్డులోని హుస్సేన్ సాగర్‌కు గణనాధుల వాహన శ్రేణులు మంగళవారం రాత్రి దాటిన తర్వాత కూడా ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే గణనాధుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఎటుచూసినా రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అశేషమైన భక్తజన సందోహం నడుమ మంగళవారం మధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌లోని క్రేన్ నం-4వద్ద ఖైరతాబాద్ మహా వినాయకుడు, క్రేన్ నం-8 వద్ద సాయంత్రం బాలాపూర్ గణేష్ గంగమ్మ ఒడికి చేరారు. పూర్తి అప్డేట్స్ ఇవి.. ♦ మధ్యాహ్నం 1.45 గంటలకు.. మహా గణపతి నిమజ్జనం పూర్తి ముందుగా అనుకున్నట్లే మధ్యాహ్నం 12 గంటల కల్లా గణనాథుని నిమజ్జనం పూర్తవుతుందని భావించినా... మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో మహా గణపతి గంగమ్మ ఒడిలో చేరాడు. మరోవైపు నిమజ్జనానికి వేలాదిగా గణనాథులు తరలి వస్తున్నారు. ♦ సాయంత్రం 6.12 గంటలు..క్రేజ్ నం-8 వద్ద బాలాపూర్ గణేష్ నిమజ్జనం ♦7 గంటల పాటు సాగిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ♦వినాయక నిమజ్జనంలో అపశ్రుతి ♦పీపుల్స్ ప్లాజా వద్ద సెల్ఫీ తీసుకుంటూ నీటిలో పడ్డ యువకుడు ♦యువకుడి కోసం గాలిస్తున్న సహాయక బృందాలు ♦ సాయంత్రం 5.29 గంటలు..నిమజ్జనం ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఏరియల్ సర్వే ♦ సాయంత్రం 5.21 గంటలు.. ట్యాంక్ బండ్‌కు చేరుకున్న బాలాపూర్ వినాయకుడు ♦ సాయంత్రం 5.15 గంటలు.. ఇప్పటివరకూ 664 విగ్రహాలు నిమజ్జనం ♦ సాయంత్రం 4.52 గంటలు.. వినాయక విగ్రహాల నిమజ్జనానికి నృత్యాలు, కోలాటాలతో ట్యాంక్ బండ్‌కు తరలి వస్తున్న భక్తులు ♦ మధ్యాహ్నం 3.51 గంటలు చార్మినార్ లో శోభాయాత్రను పరిశీలించిన డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, అందరు సహకరించాలి: డీజీపీ, సీపీ ♦మధ్యాహ్నం 3.49 గంటలు రూ.3.66 లక్షలు పలికిన కూకట్పల్లి గణేష్ లడ్డు లడ్డును దక్కించుకున్న బీజేపీన నేత నరేందర్ ♦ మధ్యాహ్నం 03.15 గంటలు చార్మినార్ దాటిన బాలాపూర్ గణేషుడు ♦ మధ్యాహ్నం 01.50 గంటలు మూసాపేటలో నిమజ్జనానికి బయల్దేరిన 30 అడుగుల మట్టి గణపతి ♦ మధ్యాహ్నం 01.49 గంటలు చార్మినార్ వద్దకు చేరిన శోభాయాత్ర ♦ మధ్యాహ్నం 01.48 గంటలు పాతబస్తీలోకి ప్రవేశించిన బాలాపూర్ వినాయకుడు ♦ మధ్యాహ్నం 01.47 గంటలు చార్మినార్ చేరుకున్న అలియాబాద్ గణేషుడు ♦ మధ్యాహ్నం 01.40 గంటలు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం.. క్రేన్-4 వద్ద ఏర్పాట్లు ♦ మధ్యాహ్నం 01.45 గంటలు ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం పూర్తి ప్రారంభమైన శోభాయాత్ర.. ♦ ఉదయం 04.30 గంటలు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది.. ♦ ఉదయం 05:00 గంటలు ఖైరతాబాద్ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ♦ ఉదయం 08:00 గంటలు మండపం నుంచి బయల్దేరిన ఖైరతాబాద్ వినాయకుడి ఊరేగింపు ప్రస్తుతం లక్డీకపూల్‌కు వెళ్లే దారి వద్దకు చేరుకుంది. ♦ ఉదయం 08:30 గంటలు ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభం కావడం జనసందోహం కొంచెం తక్కువగా ఉంది. దీంతో గణేశుడి విగ్రహాల ఊరేగింపు కూడా వేగంగా జరుగుతోంది. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల నిమజ్జనం కూడా అనుకున్న సమయాని కంటే ముందే జరగొచ్చని భావిస్తున్నారు. ♦ ఉదయం 09:00 గంటలు ఖైరతాబాద్ గణేశుడి ఊరేగింపు ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంది. తెలుగు తల్లి ఫై ఓవర్ పక్క నుంచి నక్లెస్ రోడ్ వద్దకు ఊరేగింపు వెళ్లనుంది. ♦ ఉదయం 09.12 గంటలు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర పూర్తి. లడ్డూ వేలం పాటకు భారీగా ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వహకులు. ఇప్పటివరకూ లడ్డూలు గెల్చుకున్న 17 మందితో పాటు కొత్తగా మరో నలుగురికి వేలం పాటలో అవకాశం. ♦ ఉదయం 09.28 గంటలు సెక్రటరియేట్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ అనంత మహాగణపతి ♦ ఉదయం 10.03 గంటలు ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం పాట. ♦ ఉదయం 10.04 గంటలు బాలాపూర్ లడ్డూ దేవుడి పాట 1,116/- ♦ ఉదయం 10.06 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.8 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.07 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.08 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.14.25 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.08 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.14.60 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.08 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.14.95 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.08 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.15.05 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.09 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.15.50 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.09 గంటలు బాలాపూర్ లడ్డూను రూ.15.60 లక్షలకు వేలంలో దక్కించుకున్న నాగం తిరుపతి రెడ్డి. ♦ ఉదయం 10.52గంటలు ట్యాంక్ బండ్ చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడు. ♦ ఉదయం 11.37గంటలు కాసేపట్లో నాలుగో క్రేన్ వద్ద అనంత చండీ మహా గణపతి విగ్రహ నిమజ్జనం. క్రేన్‌ను నిమజ్జనానికి సిద్ధం చేసిన అధికారులు. నగరమంతా కోలాహలం... ♦ ఇప్పటికే మూడు, ఐదు, ఏడు రోజుల పూజలందుకున్న వినాయకుల నిమజ్జన ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి మహానగర వ్యాప్తంగా సుమారు 60 వేల వినాయక ప్రతిమలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్లు బల్దియా వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ సహా గ్రేటర్ నలుమూలలా ఏర్పాటుచేసిన 23 నిమజ్జన కొలనుల్లో పదివేల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అంచనావేస్తున్నారు. మహానిమజ్జనానికి ఏర్పాట్లు ♦ జీహెచ్ఎంసీ, పోలీసు, హెచ్ఎండీఏ, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖ, రవాణా, ఆర్టీసీ, రైల్వే, తదితర విభాగాలన్నీ రంగంలోకి దిగాయి. ♦ సామూహిక నిమజ్జన వేడుకలు జరుగనున్న ట్యాంక్‌బండ్‌కు రెండు వైపులా భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ వైపు 18 క్రేన్లు, నెక్లెస్‌రోడ్డు వైపు 9 క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ♦ బాలాపూర్ విగ్రహంతో బయలుదేరిన తరువాత ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని సైతం ఈ సారి ఉదయమే నిమజ్జనానికి తరలించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ రెండు విగ్రహాలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలన్నీ ట్యాంక్‌బండ్ వద్ద కలుస్తాయి. ♦ ఉదయం నుంచే విగ్రహాలు తరలిరానున్న దృష్ట్యా అందుకు తగిన విధంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసు బలగాలు మోహరించారు. ♦ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ♦ గడిచిన మూడు రోజులుగా భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో మంగళవారం సుమారు 10 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు..... ♦ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ♦ హుస్సేన్‌సాగర్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా సాగేందుకు ఫ్లాట్‌ఫాంలను సిద్ధం చేశారు. ♦ పారిశుధ్య ఏర్పాట్లులో భాగంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్‌లలో పురుషులకు 20 తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, మహిళలకు 10 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ♦ 101 ప్రాంతాలలో కౌంటర్లు, టెంట్లు, మంచినీటి ప్యాకెట్లను వాటర్‌వర్క్స్ విభాగం సిద్ధం చేశారు. ♦ శోభాయాత్ర జరిగే మార్గంలో ప్రతి 3–4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 165 గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఒక శానిటరీ సూపర్వైజర్, శానిటరీ జవాన్, 21 మంది వర్కర్లు మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ♦ శోభాయాత్ర జరిగే ప్రధాన వీధుల్లో 354 కిలోమీటర్ల మేర ఈ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. గణేష్ యాక్షన్ టీమ్‌లలో మొత్తంగా పదివేల మంది సభ్యులుంటారని తెలిపింది. ♦ నిమజ్జనం కోసం 236 వివిధ రకాల వాహనాలను వినియోగించనుంది. హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్ వద్ద భారీ గణనాథుల నిమజ్జనానికి 27 భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. ♦ అనేక చోట్ల అదనంగా వీధి లైట్ల ఏర్పాటు. ♦ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక గజ ఈతగాళ్లను నియమించారు. ♦ గణేష్ నిమజ్జనం పూర్తయిన వెంటనే 14 స్వీపింగ్ మిషన్ల పరిశుభ్రత పనులు. నిమజ్జనం జరిగే ప్రాంతాలు 1. కాప్రాచెరువు, 2. సరూర్‌నగర్, 3. రాజన్నబావి, 4. మీరాలంట్యాంక్, 5. పల్లెచెర్వు, 6. పత్తికుంట చెరువు, 7. దుర్గం చెరువు, 8. మల్కం చెరువు, 9. గోపీనగర్ చెరువు, 10. పెద్దచెరువు, 12. గురునాథం చెరువు, 13. కాయిదమ్మకుంట, 14. ఈర్లచెరువు, 15. రాయసముద్రం చెరువు, 16. సాకిచెరువు, 17. ఐడీఎల్ ట్యాంక్, 18. ప్రగతినగర్ చెరువు, 19. హస్మత్‌పేట్ చెరువు, 20. సున్నం చెరువు, 21. పరికి చెరువు, 22. వెన్నెలగడ్డ చెరువు, 23. సూరారం చెరువు, హుస్సేన్ సాగర్ వద్ద.... ♦ ప్రతి మూడు, నాలుగు కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటు. ♦ ప్రతి యాక్షన్ టీమ్‌లో ఒక శానిటరీ సూపర్వైజర్, ముగ్గురు ఎస్ఎఫ్ఏలు, 21మంది పారిశుధ్య సిబ్బంది ఉంటారు. ♦ మొత్తం 388.5కిలోమీటర్ల విస్తీర్ణంలో 165 గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ♦ 295మంది శానిటరీ సూపర్వైజర్లు, జవాన్లు, 688 మంది ఎస్ఎఫ్ఎలు, 9,710మంది పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక నియామకం. ♦ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ వద్ద 85 మంది స్విమ్మర్లు, డైవర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్రేన్ వద్ద ఇద్దరు స్విమ్మర్లు ఉంటారు. ♦ చెరువుల వద్ద వెయ్యి మంది ఎంటమాలజి వర్కర్లు నియామకం. ♦ రూ. 1.05కోట్ల వ్యయంతో 236 వాహనాల ఏర్పాటు. ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు... ♦ నిమజ్జన సందర్భంగా ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ♦ నిమజ్జనం సందర్భంగా ప్రజలు తమ సమస్యలను చెప్పడానికి ప్రత్యేకంగా డయల్ 100, జీహెచ్ఎంసి కాల్ సెంటర్ నెంబర్ 040-21111111 లకు సంప్రదించవచ్చు. అలాగే ‘ మై జీహెచ్ఎంసి’ యాప్ ద్వారా సమస్యలను అధికారులకు వివరించవచ్చు. ♦ ప్రతి మూడు క్రేన్ల వద్ద షిఫ్టుల వారీగా పనిచేయడానికి 231 మంది ఎంటమాలజి సిబ్బందిని నియమించారు. ♦ నిమజ్జనం సందర్భంగా వెలువడే వ్యర్థాల తొలగింపునకు 25టన్నుల సామర్థ్యం గల 6 వాహనాలను సిద్ధం చేశారు. ♦ మరో 40 మినీ టిప్పర్లు, 6 ఫ్రంట్ ఎండ్ లోడర్లు, 4జె.సి.బిలు, 6 బాబ్కాట్లు, 20 స్మాల్ స్వీపింగ్ మిషన్లు, 6 బిగ్ స్వీపింగ్ మిషన్లను సిద్ధంగా ఉంచారు. జలాశయాల్లో కలిసే వ్యర్థాలు.... ♦ నిమజ్జనం సమయంలో హుస్సేన్‌సాగర్ సహా ఆయా నిమజ్జన కొలనుల్లో కలిసే రసాయన రంగుల అవశేషాలు : లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. ♦ హానికారక మూలకాలివే : కోబాల్ట్, మ్యాంగనీస్ డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. పర్యావరణ హిత నిమజ్జనానికి సూచనలు... ♦ జలాశయంలో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి. ♦ మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. ♦ వినాయక విగ్రహాలతోపాటు జలాశయాలంలోకి ఆకులు, పూలు, కొబ్బరికాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథీన్ కవర్లను వేయొద్దు. ♦ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. వాటిని జలాశయం వద్దకు తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి. వ్యర్థాల తొలగింపునకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు... ♦ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి జీహెచ్ఎంసీ డంప్‌యార్డుకు తరలించేందుకు హెచ్ఎండీఏ ఏర్పాట్లుచేసింది. ఈ కృషిలో మూడు జేసీబీలు, 6 టిప్పర్లు, 4 ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఇక వ్యర్థాల తొలగింపు పనుల్లో 480 మంది కూలీల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఎమర్జన్సీ టీంలు : సీసీ కెమరాలతో పర్యవేక్షణ ♦ 24 గంటలపాటు అందుబాటులో ఉండే విధంగా ప్రతి సర్కిల్లో ఒక ఎమర్జెన్సీ టీం ఏర్పాటు ♦ బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 800 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ♦ ప్రతి 2 కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీం, ఒక సూపర్వైజర్, ఇద్దరు ఎలక్ట్రిషన్లతో మూడు విడతల వారీగా అందుబాటులో ఉంటారు. ♦ సుమారు 25 వేల మంది పోలీసులతో బందోబస్తు చేశామని, 310 అత్యంత సున్నిత, మరో 605 సున్నిత ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ♦ 410 మొబైల్ పోలీసు బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. ♦ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్‌లో 16, ట్యాంక్‌బండ్ వద్ద 25, మినిస్టర్ రోడ్డులో 3, రాజన్నబౌలి వద్ద 3, మీరాలంట్యాంక్‌లో 2, ఎర్రకుంటలో 2 క్రేన్లను సిద్దం చశారు. ♦ అనేకచోట్ల అంబులెన్స్‌లు, జనరేటర్లు, వైద్యబందాలు, మెకానిక్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ♦ నిమజ్జనం జరిగే మార్గాలలో 117 పాయింట్లను గుర్తించి దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చుతో తాత్కాలిక మరమ్మతు పనులను చేపట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ♦ భక్తులకోసం ఆర్టీసి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి 16 మార్గాల గుండా ట్యాంక్‌బండ్‌కు 500 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ లో గణపతి శోభాయాత్ర
-
తెలుగుతల్లి ఫ్లైఓవర్ చేరుకున్న గణేశుడు
-
ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర..
-
శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
-
గణేషుడి లడ్డూలకు భలే డిమాండ్
శామీర్‌పేట్: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శనివారం రాత్రి లడ్డూ వేలం నిర్వహించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు పవన్‌గౌడ్ రూ.42,000 స్వామివారి లడ్డూను కైవసం చేసుకున్నారు. శామీర్‌పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి చేతిలోని లడ్డూను జేఎల్ఎం ప్రశాంత్‌రెడ్డి రూ.20,100 వేలంలో దక్కించుకున్నాడు. -
‘లక్ష్మీ’గణపతి
మంచిర్యాల టౌన్ : మంచిర్యాలలోని విశ్వనాథాలయంలో వినాయకుడిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో రూ.11,11,111 కరెన్సీ నోట్లతో అలంకరించారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిలువేరు వైకుంఠం, కార్యదర్శి చందూరి సుధాకర్, కోశాధికారి గొలుసుల ముఖేశ్ కుమార్, యువజన సంఘం అధ్యక్షుడు ముత్యాల సుజిత్, చంద్రశేఖర్, నారాయణ, తిరుపతి, కాచం సతీశ్ పాల్గొన్నారు. -
విభిన్న రూపాలు
-
మహిళా భక్తుల భద్రతకు పెద్దపీట
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జన ఉత్సవాల్లో మహిళా భక్తులతో అనుచితంగా వ్యవహరించే వారిపై సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల షీ– టీ మ్స్ నిఘా వేయనున్నాయి. ఈవ్‌టీజింగ్ చేస్తూ పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నాయి. నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్ ట్యాంక్, సఫిల్‌గూడ చెరువు, కాప్రా చెరువుతో పాటు చర్లపల్లి చెరువుల వద్ద జరిగే నిమజ్జనోత్సవంలో పెద్ద సంఖ్యలో బాలికలు, యువతులు, మహిళలు పాల్గొంటారు. ఇక్కడికి ఏటికేడు గణపతి విగ్రహాలతో వచ్చే మహిళాభక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈసారి షీ బృందాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. దాదాపు 100 మంది సిబ్బంది బృందాలుగా విడిపోయి ఆకతాయిలపై కన్నేసి ఉంచనున్నాయి. ఎక్కడా ఎవరైనా అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చినా, వీరి కంటపడినా అరెస్టు చేస్తారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలోని నిమజ్జన యాత్ర మార్గాల్లో గస్తీ నిర్వహిస్తారు. బాధితులు 100కు కాల్ చేస్తే వెంటనే ఘటనాస్థలిలో వీరు వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు. ‘మఫ్టీ’తో నిఘా... నిమజ్జనోత్సవంలో దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. మహిళలు ఒంటి నిండా నగలు ధరించి నిమజ్జన యాత్రలో పాల్గొంటారు. ఇదే అదునుగా భావించి జనాల మధ్యలోనే దొంగలు తమ పనికానిచ్చే అవకాశముంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పె ట్టుకొని దొంగలను కట్టడి చేసేందుకు ఈసారి దాదాపు 12కు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీరి లో కొందరు పోలీసు డ్రెస్సులోనే విధులు నిర్వహిస్తుం డగా, మరికొందరు మఫ్టీలో నిఘా వేయనున్నారు. సీసీలతో పర్యవేక్షణ... కమిషనరేట్లలోని ముఖ్యకూడళ్ల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగే వినాయక శోభాయాత్రను బలగాల పహారాతో పాటు నిఘా నేత్రాలతో నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గణేశ్ శోభా యాత్ర ను అధికారులు వీక్షిస్తూ ఎప్పటికప్పుడూ స్థానిక పోలీ సు సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తారు. నిమజ్జన యాత్ర ల్లో లక్షలాది మంది భక్తులతో పాటు వేలాది వినాయకులు తరలివస్తాయి. పోలీసులు జంక్షన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలతో ఆయా ప్రాంతాల్లో గణేశుడి నిమజ్జన ర్యాలీల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరా మౌంట్ వెహికల్లను, అశ్విక దళాలను ఇప్పటికే భద్రత కోసం వినియోగిస్తున్నారు. -
శాంతియుతంగా గణేశ్ ఉత్సవాలు
జడ్చర్ల : జడ్చర్లలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ఈనెల 10న నిర్వహించే నిమ్మజ్జనోత్సవ ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. చిన్న విగ్రహాలను స్థానికంగా ఉన్న నీటి కొలనులో నిమజ్జనం చేసేలా స్థల పరిశీలన చేసి గురువారం నిర్ణయించనున్నట్లు తెలిపారు.్చ ఇక పెద్ద విగ్రహాలను బీచుపల్లి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో నిమజ్జనం శాంతియుతంగా కొనసాగేందుకు అందరు సహకరించాలన్నారు. నిమజ్జనోత్సవం్చ శనివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. నిమజ్జనయాత్ర రూట్‌మ్యాప్ తయారు చేసి విద్యుత్లైన్లు,తదితర రోడ్డు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నిమజ్జనోత్సవ ప్రదేశంలో బారీకేడ్లు, క్రేన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సమావేశంలో నగర పంచాయతీ కమిషనర్ గంగారాం, ట్రాన్స్‌కో ఏఈ నిరంజన్‌దాస్, వైస్ ఎంపీపీ రాములు, బీజేవైం జిల్లా అధ్యక్షుడు రాంమ్మోహన్, ఎస్ఐ జములప్ప, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నందకిశోర్‌గౌడ్, వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
అశ్లీల నృత్యాలపై విచారణకు ఆదేశం
విశాఖ : పవిత్ర పుణ్యక్షేతం సింహాచలంలో వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాల ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ స్పందించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ఆయన వేటు వేశారు. సింహాచలంలో వినాయకచవితి భద్రతా విధుల్లో ఉన్న ఏసీపీ భీమారావు, సీఐ బాల సూర్యారావులను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణకు యోగానంద్ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై అడిషనల్ సీపీ సత్తార్ ఖాన్ విచారణ జరపనున్నారు. కాగా అప్పన్న ఆలయం సమీపంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అశ్లీలం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మద్యం సేవించిన కొందరు యువకులు ఓ మహిళా డ్యాన్సర్ తో అసభ్యకర భంగిమల్లో నృత్యం చేయించారు. పోలీసులు పెట్రోలింగ్ కు వచ్చినా ఎదురుగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో రాత్రి మొదలయిన ఈ నృత్యాలు తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. అయితే పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వార్తలు మీడియాలోనూ ప్రసారం కావటంతో విశాఖ పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. -
గణేష్ విగ్రహాల ధరలకు రెక్కలు
సాక్షి,సిటీబ్యూరో: వినాయక నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో నగరంలో పండుగ కళ కనిపిస్తోంది. వైవిధ్య రూపాల్లో. ఆకట్టుకొనే రంగుల్లో తీర్చిదిద్దిన వినాయకులు రకరకాల భంగిమలు. అనేక అవతరాల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో కొలువుదీరనుండటంతో బొజ్జగణపయ్య చిన్న విగ్రహాలు మొదలుకొని భారీ విగ్రహాల వరకు వేలాదిగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విగ్రహాల కొనుగోలుకోసం ధూల్‌పేట్‌కు తరలి వస్తున్నారు. గత రెండు నెలలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైన ధూల్‌పేట్ కళాకారులు ఒకవైపు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతూనే మరోవైపు విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది గణనాధుల ధరలు బాగా పెరిగాయి. గతంలో రూ.10 వేలకు లభించిన విగ్రహాన్ని ఈ ఏడాది రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. కళాకారుల జీతాలు, ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు, గోడౌన్ల అద్దెలు భారీగా పెరిగినందునే విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల కారణంగా దీంతో కోరుకున్న విగ్రహాలను కొనుగోలు చేయలేకపోతున్నామని మండపాల నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా సృజనాత్మకతకు పదునుపెడుతూ అద్భుతమైన విగ్రహాలను రూపొందించే ధూల్‌పేట కళాకారులు ఈ ఏడాది కూడా వివిధ రకాల ఆకృతులలో అందమైన విగ్రహాలను తయారు చేశారు. రూ.2 వేల నుంచి రూ.2 లక్షలకు పైగా విలువైన విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. విభిన్నంగా, వినూత్నంగా విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. శివాజీగా, శ్రీకృష్ణుడిగా, తిరుపతి వెంకటేశ్వరుడిగా, రాధా సమేతుడైన గోపాలుడిగా ఆకట్టుకుంటున్నాడు. అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, అంగరక్షకులు, సేవకుల సమక్షంలో మందిరంలో కొలువైన దేవదేవుడు, షిరిడీ సాయిబాబా, ముంబయి గణేశుడిగా, మూషికవాహనుడు, స్పైడర్‌మెన్‌గా, ప్రధాని నరేంద్రమోదీ ధరించే తలపాగా తరహాలో అలంకృతుడై... నవరాత్రి ఉత్సవాల్లో కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు. ధూల్‌పేట్ నుంచి ఏటా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు విగ్రహాలను ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు కూడా వినాయక విగ్రహాలను ఎగుమతి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 200 కార్ఖానాల్లో విగ్రహాలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. గత ఏడాది 18 అడుగుల విగ్రహం ధరS రూ.65వేలు ఉండగా, ఈసారి ఏకంగా రూ.85 వేలకు పెరిగింది. 16 అడుగుల విగ్రహాలకు రూ.70 వేల వరకు చెబుతున్నారు. గత సంవత్సరం రూ. 45 వేలకు లభించిన భారీ విగ్రహాలు ఈ సారి రూ.60 వేలకు పెంచడంతో కొనుగోలుదారులు బిత్తరపోతున్నారు. 15 అడుగు విగ్రహాన్ని కొనేందుకు వచ్చిన వారు 10 అడుగులతో సరిపెట్టుకుంటున్నారు. -
నీకే విఘ్నాలా!?
పుష్కరఘాట్ వద్ద గణేశ్ ఉత్సవాలకు అనుమతి నిరాకరణ రోడ్డుపై పెట్టుకోవాలన్న అధికారులు అక్కడ ట్రాఫిక్ పోలీసుల అభ్యంతరం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే..! అధికారుల అండతో అధికార పార్టీ నేతలు అవిఘ్నుడికే విఘ్నాలు సృష్టిస్తున్నారు. ఏడేళ్లుగా నిర్వహిస్తున్న ఉత్సవాలకే ఆటంకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా ఈ ఉత్సవాలకు సారథ్యం వహిస్తుండడం వల్లే ఇలాంటి కుయుక్తులు పన్నారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇక్కడే ఉత్సవాలు జరిపి తీరుతామని జక్కంపూడి స్పష్టం చేశారు. – దానవాయిపేట (రాజమహేంద్రవరం) ఏడేళ్లుగా విభిన్న ఆకృతులతో రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో నిత్యం సుమారు 40 వేల మంది భక్తులు ఇక్కడి గణపతి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ అనుమతి కోసం అధికారులకు దరఖా స్తు చేసుకుంది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా రు. దీనిని అడ్డుకోవాలన్న తలంపుతో అధికార పార్టీ నేతలు అధికారులతో కలిసి కుయుక్తులు పన్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల కిందటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా, అనుమతి ఇవ్వలేదు. విచారణ కోసమని స్థానిక సబ్ కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, తహసీల్దార్ వద్దకు నిర్వాహకులు హాజరయ్యారు. ఉత్సవాల వద్ద ఎలాంటి ఘటనలు జరిగినా నిర్వాహకులదే బాధ్యతంటూ అధికారులు సంతకాలు కూడా తీసుకున్నారు. అనుమతి లేదంటూ అడ్డగింపు వినాయక చవితికి మరో ఐదు రోజులే ఉన్న నేపథ్యంలో పుష్కరఘాట్ వద్ద నిర్వాహకులు బుధవారం ఏర్పాట్లు ప్రారంభించారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి, విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేద ని స్పష్టం చేశారు. పుష్కరఘాట్ ఎదురుగా, రాజరాజ నరేంద్రుడి విగ్రహం పక్కన రోడ్డుపై ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఏడేళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, రోడ్డుపై ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడతాయని జక్కంపూడి రాజా.. సెంట్రల్‌జోన్ డీఎస్పీ జె.కులశేఖర్, కార్పొరేషన్ అధికారులకు వివరించారు. ససేమిరా అన్న వారు.. రోడ్డుపై ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఇది ముగిసిన కాసేపటికే ట్రాఫిక్ పోలీసులు పుష్కరఘాట్ వద్దకు వచ్చారు. రోడ్డుపై మండపం పెడితే ట్రాఫిక్‌కు ఇబ్బందని, అనుమతి ఇచ్చేది లేదని డీఎస్పీ బి.శ్రీకాంత్ నిర్వాహకులకు చెప్పడంతో అధికార పార్టీ నేతల వ్యూహం బయటపడింది. అధికారుల తీరును నిరసిస్తూ జక్కంపూడి రాజా తన అనుచరులతో రోడ్డుపై బైఠాయించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ అడగ్గా.. గోదావరి నిత్యహారతికి భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందనే అనుమతి ఇవ్వలేదని చెప్పారు. రాజరాజ నరేంద్రుని విగ్రహం పక్కన గణపతి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సూచించామని తెలిపారు. కావాలనే అడ్డుకుంటున్నారు : జక్కంపూడి రాజా ఏడేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను పుష్కరఘాట్ వద్ద ఎవరికీ ఇబ్బందులు కలగకుండా నిర్వహిస్తున్నామని జక్కం పూడి రాజా విలేకరులకు తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని రాజా ధ్వజమెత్తారు. ప్రస్తుతం నిత్య హారతి పుష్కరఘాట్‌లోని దేవాలయాల మెట్టపై నుంచి ప్రవాహానికి అభిముఖంగా ఇస్తున్నారని, అందువల్ల ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. అయినా పుష్కరఘాట్ వద్ద రెండు బ్రిడ్జీల మధ్య ఉన్న స్థలం రైల్వే, జలవనరుల శాఖదని, ఈ స్థలాన్ని రైల్వే శాఖ అద్దె ప్రాతిపదికన వ్యాపారస్తులకు వేలంలో కేటాయించిందని పేర్కొన్నారు. ఇతర శాఖలకు లేని ఇబ్బంది కమిషనర్‌కు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో తమ శాఖది కాని స్థలంపై కమిషనర్ జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. పోలీసులు కూడా రోడ్డుపై ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని చెబుతున్నా కమిషనర్ వినకుండా నిర ంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదో రోజు నుంచే రాజానగరం, అనపర్తి, జగ్గంపేట, కోనసీమలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం 500 విగ్రహాలు బ్రిడ్జిలంక ఇసుక ర్యాంపులో నిమజ్జనం కోసం వస్తుంటాయని, ఘాట్ లోపల పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పినా అధికారులు వినిపించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా తాము పుష్కరఘాట్ వద్దే గణపతి ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట కార్పొరేటర్ బొంతా శ్రీహరి, పార్టీ నాయకులు సుంకర చిన్ని, దంగేటి వీరబాబు, అడపా హరి, కరుణామయ శ్రీను ఉన్నారు. -
‘ఎకో’దంతుడే బెస్ట్
► సమీపిస్తున్న గణేష ఉత్సవాలు ► వినాయకుడి విగ్రహాల తయారీలో హానికారక రంగుల వినియోగం ► రసాయన మిశ్రిత విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు ► నిమజ్జనం తరువాత చెరువుల్లో కరగని వ్యర్థాలు ► ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటున్న పర్యావరణవేత్తలు విఘ్నాలన్నింటినీ తొలగించే వినాయకుడు, గణాలన్నింటికీ అధినాయకుడైన గణనాథుడు ప్రజలందరీ చేత పూజలందుకోవడానికి మరికొద్ది రోజుల్లో వాడవాడలా కొలువుదీరనున్నాడు. అయితే వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడడంతో పాటు అనేక రసాయన రంగులను ఉపయోగిస్తుండటంతో నిమజ్జనం తరువాత చెరువులు, కుంటలు కరగని వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ పరిణామం పర్యావరణానికి ఎంతో హానికలిగించడమే కాదు, జలసంపదపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే పర్యావరణానికి ఏ మాత్రం హానికలిగించని ‘ఎకో’దంతుని పూజించాలంటూ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. వినాయక విగ్రహాల అలంకరణ కోసం ప్లాస్టిక్‌తో తయారైన పూలు, థర్మోకోల్ ఉత్పత్తులను ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉత్సవాలు ఆఖరున విగ్రహాలతో పాటు అలంకరించిన సామగ్రి కూడా నిమజ్జనం చేస్తున్నారు. దీంతో ప్లాస్టిక్, థర్మోకోల్ పదార్ధాలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. వీటి బదులు సహజ సిద్ధమైన పూలు, మామిడి, నిమ్మ ఆకులు, పసుపు, చందనం, కుంకుమ, గరికలతో అలంకరించడం వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హాని జరగకపోగా పండుగను మరింత సంప్రదాయ బద్ధంగా నిర్వహించడానికి కూడా వీలవుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. వీటి వినియోగం ప్రమాదమే వినాయకుని విగ్రహానికి వేసే రంగుల్లో సిలికాన్‌పొడి, జింక్ పొడి, చాక్‌పీస్ పొడి, గాజు పొడి కలుపుతారు. ఇవి నీటిలో, భూమిలో కలిస్తే మానవళికి ప్రమాదం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఏళ్లు గడిచినా భూమిలో కలవదు. రంగుల కోసం మెర్క్యూరీ సల్ఫేట్, పొటాషియం, డ్రైక్రోమిట్,క్రోమియం, అయోడైడ్, లెడ్‌ఆక్సైడ్, కాడ్మియం, నికెల్ వాడకం వల్ల అలర్జీ, ఉబ్బసం, న్యూమోనియా, చర్మ వ్యాధులు, గ్రహణశక్తి తగ్గడం, కిడ్నీ ఇన్ఫెక్షన్, పిల్లల్లో శారీరక, మానసిక ప్రవర్తనలలో మార్పులు, ఎముకల బలహీనత సంభవించవచ్చు. భారీ శబ్ధతరంగాలను వెలువరించే సౌండ్ సిస్టమ్ కాకుండా మంద్ర స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల శబ్ధ కాలుష్యాన్ని నివారించుకోవచ్చు. మార్గదర్శకాల అమలులో ఉదాసీనత కాలుష్యాన్ని నివారించేందుకు 2010లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సమాజ హితానికి పనికొచ్చే ఈ మార్గదర్శకాల అమలును కాలుష్య నియంత్రణ శాఖ, మున్సిపాలిటీ/పంచాయతీ, మత్స్యశాఖ, నీటి పారుదల శాఖలు విస్మరించాయి. దీంతో వినాయకచవితి వేడుకలు పర్యావరణకు ముప్పు వాటిల్లేలా మారాయి. ప్రతి ఏటా జిల్లాలో 20వేల నుంచి 25వేల వినాయక విగ్రహాలు, ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 98శాతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసినవే కావడం గమనార్హం. వీటిని చెరువులు, కాలువలలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం పెరిగిపోతోంది. మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారుతోంది. మట్టి వినాయకులే మేలు మట్టికి సులువుగా కరిగే గుణం ఉంటుంది. విగ్రహాల తయారీలో చెరువు మట్టి వినియోగంతో పూడిక సమస్యలు తొలుగుతాయి. అందుకే మట్టికి ప్రాధాన్యం ఇచ్చేవారు. వినాయక చవితినాడు 18 రకాల ప్రతులతో మట్టి విగ్రహాన్ని పూజించేవారు. ఆధునిక వైద్యం అందుబాటులో లేని రోజుల్లో వర్షాకాలంలో వరదల తరువాత జరిగే నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ఈ 18 రకాల పత్రులతో మట్టి విగ్రహాన్ని పూజించి, వాటిని తెల్లారే నదిలో నిమజ్జనం చేసేవారు. ఈ ప్రతులను ఎందుకు వాడాలంటే ఇవి నీటిని శుభ్రపరచడంలో ఆరితేరినవి. ఆనాడు తాగే నీటిని శుభ్రపరచడంతోపాటు చవితి జరుపుకునేవారు. నిజానికి వినాయక చవితి పర్యావరణానికి పూర్తిగా మేలు చేసే పండుగ. వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహణ ఎంతో అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాణికోటికి ముప్పు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసే విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల ప్రాణికోటి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. విగ్రహాలకు వాడే రంగుల్లో హానికరమైన రసాయనాలున్నాయి. దీని వల్ల ఆ నీటిని వినియోగిస్తే చర్మవ్యాధులు సంభవిస్తాయి. మట్టి విగ్రహాలయితే ఎలాంటి హానీ ఉండదు. సహజ రంగులు వాడితే ప్రమాదం ఉండదు. గణపతి వద్ద ఉంచే వివిధ రకాల ఆకుల వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. పర్యావరణం దెబ్బతినదు. – డాక్టర్ పద్మావతి, దేవి నర్సింగ్‌హోమ్, ధర్మవరం -
బడా ఖానా..
ఈసారి జాగిలాలకు ప్రత్యేకం గణేష్ ఉత్సవాల్లో స్నిఫర్ డాగ్స్‌పై పని భారం 11 రోజుల్లో 3,500 ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు మూగజీవాల కష్టాన్ని గుర్తించిన సీపీ ‘బడా ఖానా’గా రూ.5 వేల వంతున మంజూరు గణేష్ ఉత్సవాల వంటి భారీ ఘట్టాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు తీవ్రంగా శ్రమించిన సిబ్బందికి ఉన్నతాధికారులు విందు ఇవ్వడం నగర పోలీసు కమిషనరేట్‌లో ఆనవాయితీ. దీన్ని పోలీసు పరిభాషలో ‘బడా ఖానా’ అంటారు. ఈసారి ఉత్సవాల్లో సేవలందించిన జాగిలాలకూ ‘బడా ఖానా’ వర్తింపజేశారు. వీటి కి పోషకాహారం అందించేందుకురూ.5 వేల వంతున అదనంగా మంజూరు చేశారు. సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాలు... నిమజ్జనం... నగర పోలీసు విభాగానికి ఇంతకు మించిన భారీ ఘట్టం మరొకటి ఉండదని చెప్పవచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దీటుగా మొత్తం 11 రోజుల పాటు ఇవి నడుస్తాయి. ఆఖరి రోజు జరిగే సామూహిక నిమజ్జనం ఓ సవాలే. ఈనేపథ్యంలో నిరంతర భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బంది... పర్యవేక్షించే అధికారులు, పరిశీలించి మార్పుచేర్పులు సూచించే ఉన్నతాధికారులు.... వీరంతా పడే కష్టం మనందరికీ తెలిసిందే. మన కోసం...మన భద్రత కోసం పని చేస్తూ.. మన కళ్లలో పడినా పట్టించుకోనివీ ఉన్నాయి. అవే స్నిఫర్ డాగ్స్‌గా పిలిచే పోలీసు జాగిలాలు. గడిచిన పక్షం రోజులుగా నిరంతర విధులతో ఊపిరి సలపకుండా పని చేసిన వీటి కష్టాన్ని కొత్వాల్ గుర్తించారు. ‘అదనపు ప్రొత్సాహకాలు’ మంజూరు చేశారు. సీఎస్‌డబ్ల్యూ ఆధీనంలో 30 జాగిలాలు... నగర భద్రతా విభాగంగా పిలిచే సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్‌డబ్ల్యూ) ఆధీనంలోనే కెన్నల్ వింగ్ ఉంది. ప్రస్తుతం ఇందులో 30 స్నిఫర్ డాగ్స్ పని చేస్తున్నాయి. బాంబులతో పాటు ఇతర పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులను వాసన చూడటం ద్వారా గుర్తించడంలో సుశిక్షితులైన వీటిలో 10 శునకాలు అనునిత్యం అత్యంత ప్రముఖుల భద్రతా విధుల్లో పని చేస్తుంటాయి. మిగిలిన 20 శునకాలూ నేర స్థలాలకు వె ళ్లి ఆధారాలు అందించడంతో పాటు నిత్యం తనిఖీల్లో సేవలందిస్తుంటాయి. సాధారణంగా ప్రతి జాగిలం 24 గంటలు విధులు నిర్వర్తించిన తరవాత మరో 24 గంటల పాటు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలోనే కచ్చితంగా కొంత సమయం ప్రాక్టీసు కూడా చేస్తుంది. 30 శాతం పని 11 రోజుల్లోనే... సాధారణ రోజుల్లో సరాసరి రోజుకు 40 నుంచి 50 ప్రాంతాల్లో ఈ జాగిలాలు తమ హ్యాండ్లర్లతో కలిసి తనిఖీలు చేస్తుంటాయి. అత్యవసర సందర్భాల్లో తప్ప ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటాయి. ఏడాదిలో ఈ జాగిలాలు దాదాపు 12 వేల ప్రాంతాల్లో తనిఖీలు చేయడం... నేర స్థలాలకు వెళ్లివస్తుంటాయి. ఒక్క గణేష్ ఉత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు ఇవి మొత్తం 3,500 ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాయి. ఏడాదిలో చేసే పనిలో 30 శాతం ఈ 11 రోజుల్లోనే చేసినట్లయింది. సీఎస్డబ్ల్యూలో ఉన్న జాగిలాలకు సహకరించేందుకు ఇతర జిల్లాల నుంచి 17 తీసుకువచ్చి ఉత్సవాలు ముగిశాక పంపారు. అదనపు నిధులు... గణేష్ ఉత్సవాల వంటి భారీ ఘట్టాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఉన్నతాధికారులు తీవ్రంగా శ్రమించిన సిబ్బందికి విందు ఇవ్వడం నగర పోలీసు కమిషనరేట్‌లో ఆనవాయితీ. దీన్ని నగర పోలీసు పరిభాషలో ‘బడా ఖానా’ అంటారు. హ్యాండ్లర్లు మారినా నిరంతరాయంగా పని చేసిన జాగిలాల శ్రమను కొత్వాల్ మహేందర్‌రెడ్డి గుర్తించారు. ఒక్కో జాగిలం ఆహారానికి ప్రతి నెలా రూ.12 వేల వరకు మంజూరు చేస్తుంటారు. 11 రోజుల గణేష్ ఉత్సవాలు, ఆ తరవాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ నిర్వరామంగా పని చేస్తున్న పోలీసు జాగిలాలకు ఈ నెల అదనంగా మరో రూ.5 వేలు చొప్పున ఆయన మం జూరు చేశారు. ఈ నిధులతో జాగిలాలకు కడెల్, పెట్గ్లో, ఫీ-ఫొలేట్ వంటి బలవర్థకమైన ప్రొటీన్డ్ ఫుడ్ అందిస్తున్నారు. -
హమ్మయ్య....
{పశాంతంగా ముగిసిన గణేశ్ ఉత్సవాలు ఊపిరి పీల్చుకున్న నగర పోలీసులు సిటీబ్యూరో: పదకొండు రోజులు పాటు జరిగిన గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడటంతో పాటు సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నగరవాసులకు పోలీసులు మరింత దగ్గరయ్యారు. వినాయక చవితి, బక్రీద్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒకే నెలలోనే రావడంతో... ఎక్కడేం జరుగుతుందోనని తొలుత ఆందోళన చెందిన పోలీసులు పక్కా ప్రణాళికతో బయటి రాష్ట్రాలు, కేంద్రం నుంచి బలగాలు రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బక్రీద్, వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ పోలీస్... బక్రీద్ పండుగ రోజున జంతువుల వ్యర్థాలను బ్యాగుల్లో వేసి కంటైనర్లలో వేసేందుకు ఇంటింటికీ భారీసైజు ప్లాస్టిక్ బ్యాగులను బల్దియా ఆరోగ్య అధికారులతో కలిసి పోలీసులు పంపిణీ చేశారు. వినాయక మండపాల వద్దకు ఈ జంతువుల వ్యర్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేసి ఎక్కడా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ‘హుమాయున్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని విజయ్‌నగర్ కాలనీ ఫుట్‌బాల్ మైదానం వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద బక్రీద్ రోజున ముస్లిం యువకులు జంతువుల వ్యర్థాలను తీసుకెళ్తున్న ప్లాస్టిక్ బ్యాగ్ జారి కింద పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే సదరు స్టేషన్ సిబ్బంది ఒకరు అక్కడికి చేరుకుని స్థానికులతో ఆ వ్యర్థాలను మండపం వైపు రాకుండా శుభ్రం చేయించారు. తాను కూడా నీళ్లు పోసి వారికి సహకరించారు. ఎటువంటి ఘర్షణ జరగకుండా చూసుకున్నారు. ...ఇతనొక్కరే కాదు పోలీసులు అం దరూ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ స్ఫూర్తిని చాటి నగరవాసులకు మరింత దగ్గరయ్యారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాల రాకపోకలను ఎప్పటికప్పడు గమనిస్తూ నిమజ్జనానికి వెళ్లే వాహనాలు వేగంగా కదిలేలా చొరవ తీసుకున్నారు. గణేశుడి శోభాయాత్ర మొదలుకొని నిమజ్జనం ముగిసే వరకు దాదాపు రోజున్నర పట్టినా...ఎక్కడా సహనం కోల్పోకుండా భక్తులకు మార్గ నిర్దేశనం చేశారు. ‘భగవంతుడి సేవలో భక్తులు’...‘భక్తుల సేవలో హైదరాబాద్ పోలీసులు’ అంటూ ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు సిబ్బంది చేసిన అనౌన్స్మెంట్లకు కూడా జనం కేరింతలు కొట్టడం కనిపించింది. పోలీసులకు భక్తులు, భక్తులకు పోలీసులు సహకరించుకునే దృశ్యాలు కనబడ్డాయి. కమాండ్ కంట్రోల్ భేష్... నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి, ఎప్పటికప్పుడూ ఉన్నతాధికారులు పర్యవేక్షించి స్థానిక పోలీసులకు మార్గనిర్దేశనం చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఏర్పాటు చేసిన 400 సీసీటీవీ కెమెరాలు, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన 120 సీసీటీవీ కెమెరాలతో పాటు నగరవ్యాప్తంగా దాదాపు 2,000కు పైగా సీసీటీవీ కెమెరాల్లో గణేశుడి శోభాయాత్ర దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. అన్ని ప్రాంతాల్లో జరిగిన నిమజ్జన దృశ్యాలను వీక్షిస్తూ, అవసరమైన చోటికి అదనపు బలగాలను పంపించారు. నిమజ్జన యాత్ర సాఫీగా సాగేలా చూడటంలో పోలీసులు పైచేయి సాధించారు. -
నిఘా నీడలో భైంసా
- శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి - ఎస్పీ తరుణ్‌జోషి ఆదిలాబాద్‌క్రైం : భైంసాలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగే ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ తరుణ్‌జోషి అన్ని చర్యలు తీసుకున్నారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో భైంసా గణేష్ నిమజ్జన శోభాయాత్రపై బందోబస్తు అంశాలను చర్చించారు. డివిజన్లో అదనపు బలగాలు మొహరించాలని తెలిపారు. గణేష్ శోభాయాత్ర, బక్రీద్ పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకుని తెలంగాణ రాష్ట్రానికి శాంతి సందేశాన్ని పంపి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎటువంటి పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగి ఉండకూడదని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, పూర్తిగా నిషేధించామని తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు కలిగితే డయల్ 100కు లేదా, భైంసా డీఎస్పీ రాములు సెల్ 9440795076లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పనసారెడ్డి, జీఆర్ రాధిక, స్పెషల్ బ్రాంచ్‌ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, ఎస్సైలు టీడీ నందన్, కరీం, వెంకటస్వామి, అన్వర్, మల్లేష్, సురేష్ పాల్గొన్నారు. బందోబస్తు వివరాలు.. అదనపు ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు ఎనిమిది మంది, సీఐలు 20 మంది, ఎస్సైలు 50 మంది, ఏఎస్సైలు 40, హెడ్‌కానిస్టేబుళ్లు 210, కానిస్టేబుళ్లు 300 మంది, సాయుధ బలగాలు 110, హోంగార్డులు 200 మంది, మహిళా పోలీసులు 40, నిఘా వర్గాలు 25, డాగ్‌స్క్వాడ్ 3, బాంబు నిర్వీర్య బృందాలు 8, లైట్ డిటెక్టివ్ బృందాలు 12 పాల్గొంటాయి. -
డబ్లిన్‌లో ఘనంగా గణేశ్ చతుర్థి
ఐర్లాండ్: తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఐటీవీ సహకారంతో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిపారు. కమ్యూనిటీ స్థానిక సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు తెలుగు ప్రజలు పాల్గొని భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక శనివారం నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేయడమే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించి, ఊరేగింపులు జరిపి ఘనంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాన్ని విజయవంతం చేసిన తెలుగువారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఐర్లాడ్ తెలుగు సమాజం(ఐటీఎస్) కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
జంట నగరాల్లో భారో బందోబస్తు
-
'శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి'
మహబూబ్‌నగర్: గ్రామాల్లో శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని నారాయణ పేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. పట్టణాల్లో గణేష్ విగ్రహాలను ఊరేగింపుచేసే సమయంలో విద్యుత్ వైర్లు సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంటపాల నిర్వాహకులు డీజేసౌండ్‌తో ప్రజలకు ఇబ్బంది కల్గించరాదన్నారు. రోడ్లపై మంటపాలు ఏర్పాటు చేసి డెకరేషన్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. అన్ని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. చందాల పేరుతో ప్రజలను బలవంతం చేయరాదని మంటపాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై మురళీగౌడ్, జడ్పీటీసీ వి.శ్రీహరి, తహశీల్దార్ అంజిరెడ్డి, సర్పంచ్ భాగ్యచంద్రకాంత్‌గౌడ్, ఈఓ స్వర్ణలత, బీజేపీ రాష్ట్ర వైస్ చైర్మన్ బి.కొండయ్య, టీఆర్ఎస్ నాయకులు ఆశిరెడ్డి, అబ్దుల్ కవి, మండల టీఆర్ఎస్ అద్యక్షులు మామిళ్ల అంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షులు మదుసూధన్‌రెడ్డి, జిల్లా బీజేవైఎం కార్యదర్శి కల్లూరినాగప్ప, ఎండీ సలాం, పోలీస్‌సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
రోడ్లపై ఉత్సవాలు ఆపండి: హైకోర్టు
ముంబై : గణేశ్ ఉత్సవాలు, దేవీ నవరాత్రులు సందర్భంగా రోడ్లపై మందిరాలు నిర్మించే సంస్థలు, వ్యక్తులపై బాంబే హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వీటన్నిటి కీ తాము వ్యతిరేకమని పేర్కొంది. నగరంలోని బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై గణేశ్, నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఆపాలని సూచించింది. వీటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారని ప్రశ్నించింది. మందిరాలు నిర్మించడానికి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని జస్టిస్ వీఎమ్ కనడే, షాలినీ ఫన్సాల్కర్‌ల ధర్మాసనం పేర్కొంది. జగన్నాథ రథయాత్రను ఆపాలంటూ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ఐఎస్‌కేసీఓఎన్) దాఖలు చేసిన పిటిషన్, గణేశ్ ఉత్సవాల సందర్భంగా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేస్తున్నారన్న పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. లౌడ్ స్పీకర్లు లేకుండా ఉత్సవాలు జరుపుకోవడం కుదరదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. వీటన్నిటికీ తాము వ్యతిరేకమని, నగరంలో ఖాళీ ప్రదేశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పింది. రెండు కేసులపై విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ పిటిషన్ కొట్టివేయం రాష్ట్రంలోని 15 ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోర్టు చెప్పింది. ఎఫ్ఏ ఎంటర్ప్రైజెస్, ఎఫ్ఏ కన్స్ట్రక్షన్స్ సంస్థలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని సదరు సంస్థలు కోర్టును కోరాయి. ఈ విషయంలో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించిందని, కాబట్టి మరో దర్యాప్తు అనవసరమని సంస్థల తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ప్రస్తుత పిటిషన్ రాయగఢ్‌లోని కొంధనే డ్యాంకు సంబంధించినది కాదని,15 డ్యాంలకు సంబంధించిందని కోర్టు చెప్పింది., 2012లో పిటిషన్ దాఖలైందని, విచారణ ఇప్పుడు జరుగుతోందని కోర్టు చెప్పింది. -
గణేశ్ ఉత్సవాలపై సందిగ్ధత
- నియమావళిని విడుదల చేయని బీఎంసీ - ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉత్సవ మండళ్లు - 30 రోజుల్లో మొదలుకానున్న ఉత్సవాలు సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాలు దగ్గర పడుతున్నా మండపాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనలపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఉత్సవ మండళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మండపాల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మండళ్ల పదాధికారులు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆంక్షలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో అనుమతులిచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. గణేశ్ ఉత్సవాలకు నెల రోజుల సమయమే ఉందని, అనుమతులిస్తే మండపాల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. భారీ గణేశ్ విగ్రహాలు ప్రతిష్టిం చే సార్వజనిక ఉత్సవ మండళ్లలో ఎక్కువగా ఫూట్పాత్లు, రహదారుల పక్కన మండపాలు ఏర్పాటు చేస్తాయి. దీంతో వాహనాల రాకపోకలకు, బాటసారులకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయని బాంబే హైకోర్టులో ప్ర జా ప్రయోజన వ్యాజ్యం గతంలో దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తుల బెంచి, మండపాలకు అనుమతిచ్చే ముందు వాహనాలకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని బీఎంసీని ఆదేశించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన బృ హన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ మం డళ్లు నిబంధనల్లో మార్పులు చేయాలని కోరు తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు వినతి పత్రం అందజేశాయి. సానుకూలంగా స్పందిం చిన సీఎం, తుది నిర్ణయం తీసుకోవాలని బీ ఎంసీ అధికారులకు సూచించారు. కాని గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన అనుమతుల ని యమావళి ఇంకా విడుదల చేయకపోవడంతో మండళ్ల పదాధికారులు గందరగోళంలో పడ్డా రు. పుణ్యకాలం కాస్తా గడచిపోయాక ప నులు ఎప్పుడు పూర్తి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడెట్లా..?: ప్రతి ఏడాది ఉత్సవాలకు 45 రోజుల ముందు బీఎంసీ అనుమతివ్వగానే ట్రాఫిక్ శాఖ, స్థానిక పోలీసు స్టేషన్, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తారు. కాని ఈసారి 30 రోజులే మిగిలి ఉండడంతో వివిధ శాఖల నుంచి అనుమతులు ఎప్పుడు తీసుకోవాలి, పనులు ఎప్పుడు ప్రారంభించాలో తెలియక నిర్వాహకులు సందిగ్ధంలో పడిపోయారు. -
గణేశ్ ఉత్సవాలకు 100 ప్రత్యేక రైళ్లు
ముంబై : గణేశ్ ఉత్సవాల సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా 100కు పైగా రైళ్లు నడపాలని సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 118 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో 36 రైళ్లు లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) నుంచి మడ్గావ్ వరకు నడవనున్నాయి. 01005 నంబర్ రైలు ఎల్టీటీ నుంచి అర్ధరాత్రి 12.55కు బయలుదేరి మడ్గావ్కు మధ్యాహ్నం 2.40కి చేరుకుంటుంది. ఈ సేవలు సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు (గురువారం మినహా) కొనసాగుతాయి. అలాగే 01006 నంబర్ రైలు మడ్గావ్లో మధ్యాహ్నం 3.25కు బయలుదేరి ఉదయం 3.55కు ఎల్టీటీకి చేరుకుంటుంది. ఈ సేవలు సెప్టెంబర్ 8 నుంచి 28 వరకు (గురువారం మినహా) కొనసాగుతాయి. గోవాలోని కర్మాలీ నుంచి ఎల్టీటీకి 42 స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. సెప్టెంబర్ 8 నుంచి 28 వరకు ఎల్టీటీ నుంచి 01025 అనే నంబర్ రైలు ఉదయం 5.30కు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు కర్మాలీ చేరుకుంటుంది. 01026 నంబర్ రైలు కర్మాలీ స్టేషన్ నుంచి ఉదయం 5.50 కు బయలుదేరి సాయంత్రం 5.45కు ఎల్టీటీ చేరుకుంటుంది. అలాగే 40 డీఈఎంయూ రైళ్లను నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. టికెట్ బుకింగ్స్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం అవనున్నట్లు తెలిపింది. -
‘ఉట్టి’ కొట్టేదెలా..?
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాలపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఉట్టి ఉత్సవాలు నిర్వహణ ప్రశ్నార్థకమైంది. వాహనాల రాకపోకలకు, బాటసారులకు ఇబ్బందులు కలగకుం డా మండపాలు ఏర్పాటు చేసే గణేశ్ ఉత్సవ మండళ్లకే అనుమతివ్వాలని బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)ని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉట్టి ఉత్సవాలకు కూడా వర్తిస్తాయి. అయితే ఉట్టి ఉత్సవాలు ఎక్కువ శాతం రోడ్లపైనే జరుగుతుండటంతో వాటి నిర్వహణపై మండళ్లు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏటా ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో సుమారు 10 వేల చోట్లకుపైగా ఉట్టి ఉత్సవాలు ఏర్పాటు చేస్తా రు. దాదర్, వర్లీ, లాల్బాగ్, పరేల్‌లో అత్యధిక శాతం రహదారులపైనే జరుగుతాయి. రైల్వే స్టేషన్ల బయట, మార్కె ట్ పరిసరాల్లోనూ ఉట్టి ఉత్సవాలు భారీగా జరుగుతాయి. ఇందులో 90 శాతం రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే వే ఉంటాయి. కోర్టు విధించిన ఆం క్షల వల్ల నేతలు ‘వెయిట్ అండ్ సీ’ అనే ధో రణిలో ఉన్నట్లు తెలిసింది. కోర్టు ఆంక్షలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉట్టి ఉత్సవాలు ఆధారపడి ఉంటాయని నిర్వాహకులు భావిస్తున్నా రు. 18 ఏళ్లలోపు పిల్లలకు నిషేధం ఉట్టి ఉత్సవాల్లో అందజేసే బహుమతులు, పారితోషకాల కోసం ప్రజలు ఎంతకైనా తెగిస్తున్నారు. తొమ్మిది, పది అంతస్తుల ఎత్తు మానవ పిరమిడ్లు నిర్మించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఫలితంగా ప్రతిసారి ఉత్సవాల్లో కొందరు చనిపోవడం, వికలాంగులుగా మారడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీనిపై సీరియస్ స్పందించిన బాంబే హైకోర్టు ఉట్టి ఉత్సవాల్లో 18 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడంపై నిషేధం విధించింది. అలాగే వాహన రాకపోకలకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఉత్సవాలకు అనుమతినివ్వకూడదని తాజాగా ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఇటీవల గణేశ్, ఉట్టి ఉత్సవ సార్వజనిక మండళ్ల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు. రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయంతోనే ఉత్సవాలు ఆధారపడి ఉం టాయని నిర్వాహకులు అంటున్నారు. -
కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం
-
తిరుపతిలో ముత్యాల వినాయకుడు
-
బీజేపీ కార్యాలయంలో వినాయకచవితి వేడుకలు
-
కాణిపాకంలో గణేష్ ఉత్సవాలు
-
నవరాత్రులకు ముస్తాబైన ఖైరతాబాద్ గణేష్
-
గణేష్ ఉత్సవాలకు సహకరించాలి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాతంగా జరుపుకునేం దుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. పండుగలు వైభవంగా జరుపుకునేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంటుందని, ప్రజలు కూడా అందుకు అనుగుణంగా కృషి చేయూలన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని మంగళవారం శాంతి కమిటీ, జిల్లా పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు సమాచారా న్ని అందజేయాలన్నారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి కాలనీలో శాంతి కమిటీని ఏర్పాటు చేసుకొని, చిన్న చిన్న సమస్యలను స్థానికంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, విద్యుత్ తదితర అనుమతుల కోసం వసూలు చేసే రుసుం గతంలో మాదిరి గానే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. పర్యావరణాన్ని దృష్టి లో ఉంచుకుని మట్టి గణేష్‌లను నెలకొల్పాలని సూచించారు. జిల్లా ఎస్పీ నా గేంద్రకుమార్ మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. శాంతిభద్రతలు అదుపు తప్పరాదని సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున బందోబస్తు కోసం సీఆర్పీఎఫ్ సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపా రు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు కచ్చితంగా పాటించాలన్నారు. శాంతి కమిటీ అవసరం రావద్దు: శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే పండుగుల సందర్భంగా శాంతి కమిటీ అవసరం లేకుండానే ఇరు వర్గాలు కృషి చేయాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన పెద్దలు సమష్టిగా సున్నితమైన ప్రాంతాల్లో పర్యటిస్తే 90శాతం సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. విద్యుత్ అధికారులు మండపాలకు అందించే కరెంట్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు అనవసర ఆంక్షలు విధించవద్దన్నారు. గణేష్ ఉత్సవాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పూర్తిగా సహకరిస్తాం: శాంతి కమిటీ నేతలు గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాగానికి అన్ని రకాలుగా సహకరిస్తామని శాంతి కమిటీ నేతలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ, ముస్లిం మతపెద్దలు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. -
18 అడుగుల విగ్రహాలు చాలు..
సాక్షి, ముంబై: ఈ ఏడాది వినాయక చవితికి నగరంలో ఏర్పాటుచేయనున్న గజానన్ విగ్రహాల ఎత్తు 18 అడుగులకు మించరాదని బృహన్ ముంబై సార్వజనిక్ గణేషోత్సవ్ సమన్వయ సమితి (బీఎస్జీఎస్ఎస్) కోరింది. ఈ సమితి నగరంలో దాదాపు 1,400 మండళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎత్తు ఎక్కువ ఉన్న విగ్రహాల తరలింపు చాలా కష్టంతో కూడుకున్నదని, కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆ సమితి పేర్కొంది. నగరంలో చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉంటున్నాయని, విగ్రహాల సమయంలో వీటిలో వాహనం దిగబడితే ప్రమాదాలు జరిగి ప్రాణనష్టానికి ఆస్కారమున్నందున ఈసారి విగ్రహాలను 18 అడుగులకు మించి ఏర్పాటుచేయరాదని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి చేటు కలగకుండా ప్రభుత్వం గణేష్ మండళ్లకు విగ్రహాల తయారీ కోసం క్లేను అందచేయాల్సిందిగా బీఎస్జీఎస్ఎస్ కోరింది. ఇటీవల గణేష్ మండళ్ల ప్రతినిధులతో బీఎస్జీఎస్ఎస్ అధ్యక్షుడు నరేష్ దహిబావ్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలు చేశారు. విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులుగా క్లేను ఉపయోగించుకోవాల్సిందిగా మండళ్లను కోరారు. ప్రతి ఏడాది నగరంలో దాదాపు 1.8 లక్షల విగ్రహాల తయారీ జరుగుతోంది. వీటన్నింటిని క్లే ఉపయోగించి తయారు చేసినట్లయితే నీటి కాలుష్యాన్ని నివారించినవారమవుతామన్నారు. అంతేకాకుండా ఈసారి తాము విగ్రహాల ఎత్తు 18 అడుగుల కంటే కూడా మించరాదని పరిమితి విధించామన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఉండడంతో భారీ విగ్రహాలను తరలించే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. విగ్రహాల ఎత్తును తగ్గించమని గత ఏడాదిలోనే తాము అన్ని మండళ్లకు వివరించామని దహిబావ్కర్ తెలిపారు. కాగా, లాల్బాగ్ సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఆ మండల్ కార్యదర్శి స్వప్నిల్ పరబ్ మాట్లాడుతూ.. తమ మండల్ ఎన్నో యేళ్లుగా 20 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ గణేషుడ్ని చూడటానికి భక్తులు వస్తారు కాబట్టి ఈ ఏడాది కూడా 20 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
నేరగాళ్లపై బైండోవర్ అస్త్రం
తొలివిడతలో 180 మందిపై అమలు స్థానిక ఆర్డీఓల వద్ద పక్కా పూచీకత్తులు మరోసారి నేరం చేస్తే ఆ మొత్తం స్వాధీనం ఆదేశాలు జారీ చేసిన సీసీఎస్ అధికారులు సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా గణేష్ ఉత్సవాలు, బోనాలతో పాటు ఎన్నికలు సమయాల్లో రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల్ని పోలీసులు బైండోవర్ చేస్తుంటారు. తద్వారా సదరు వ్యక్తి ఆ సందర్భంలో నేరం చేయడానికి, అలజడి సృష్టించడానికి వెనకడుగు వేస్తాడు. ఇది అనేక సందర్భాల్లో మంచి ఫలితాలే ఇచ్చింది. ఇదే అస్త్రాన్ని పదే పదే ప్రాపర్టీ అఫెన్సులు చేసే వారిపై ప్రయోగిస్తే... ఇదే ఆలోచన వచ్చింది సీసీఎస్ అధికారులకు. స్నాచింగ్స్, చోరీలు, దొంగతనాలు వంటి నేరాలను పదే పదే చేస్తున్న వారిపై బైండోవర్ అమలు చేయాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు.. అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించారు. గురువారం నగర వ్యాప్తంగా అన్ని ఠాణాలతో పాటు ప్రత్యేక విభాగాల్లో పనిచేసే డిటెక్టివ్, క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నేరగాళ్ల బైండోవర్‌కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నేర నివారణ, పాత నేరస్తుల కట్టడి చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు ‘సాక్షి’కి తెలిపారు. అప్డేట్ అయిన ఎంఓ క్రిమినల్స్ డేటా నగర కమిషనరేట్ పరిధిలో గడిచిన కొన్నేళ్ల గణాంకాలు, నేరాలను విశ్లేషిస్తే 80 శాతం పాతవారే పదే పదే నేరాలు చేస్తున్నట్లు తేలింది. వీరిపై కన్నేసి ఉంచితే కొంతవరకైనా నేర నివారణ సాధ్యమన్న కోణంలో సీసీఎస్ అధికారులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఎంఓ క్రిమినల్స్ డేటాను అప్డేట్ చేశారు. కమిషనరేట్ పరిధిలో గత దశాబ్ద కాలంలో 50 వేలకు పైగా నేరగాళ్లు అరెస్టు అయ్యారు. వీరిలో దాదాపు 30 వేల మంది ఒకసారి కంటే ఎక్కువసార్లే పోలీసులకు చిక్కారు. పోలీసు పరిభాషలో వీరినే ఎంఓ క్రిమినల్స్‌గా పరిగణిస్తారు. వీరికి సంబంధించి సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో డేటా బేస్ ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో సమీక్షించిన సీసీఎస్ అధికారులు.. ఎంఓ క్రిమినల్స్ చిరునామాలను వెతికి పట్టుకుని వారి ఫొటోలు, తాజా వివరాలతో పాటు వారి సంబంధీకులవీ నమోదు చేశారు. ఈ ఎంఓ నేరగాళ్లపై సస్పెక్ట్ షీట్స్ సాధారణంగా వారు నివసిస్తున్న ప్రాంతం పరిధిలోని ఠాణాలో ఉంటాయి. అయితే కొందరు తాము నివసిస్తున్న ప్రాంతంలో ఎలాంటి నేరాలు చేయట్లేదు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఇతడి విషయం తెలియట్లేదు. ప్రాథమికంగా 180 మందితో జాబితా ఎంఓ క్రిమినల్స్ డేటా అప్డేట్ చేసిన సీసీఎస్ పోలీసులు ఆయా షీట్లను పాత నేరగాళ్లు పంజా విసురుతున్న ప్రాంతాల్లోని ఠాణాలకూ పంపారు. ఎంఓ క్రిమినల్స్ డేటా అప్డేట్ చేయడంతో ఒకటి కంటే ఎక్కువసార్లు నేరాలు చేస్తున్న వారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనే విషయం స్పష్టంగా తెలిసింది. ఈ లిస్టును మరింత మధించిన ప్రత్యేక బృందాలు పదే పదే నేరాలు చేస్తూ అరెస్టు అవుతూ, బెయిల్ పొంది బయటకు వచ్చి మళ్లీ పంజా విసురుతున్న వారి వివరాలతో మరో డేటా రూపొందించింది. వీరిలోంచి అత్యంత సమస్యాత్మకంగా మారిన 180 మందిని గుర్తించారు. తొలివిడతలో వీరిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉండే ఆర్డీఓల వద్ద బైండోవర్ చేయాలని నిర్ణయించారు. సదరు నేరగాడు ఏ ప్రాంతానికి చెందిన వాడో ఆ స్థానిక ఆర్డీఓ వద్దే హాజరుపరుస్తారు. బైండోవర్ అంటే ఇదీ... దీన్నే సాంకేతిక పరిభాషలో ‘బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్’గా పరిగణిస్తారు. ఓ వ్యక్తి వల్ల నేరం జరుగుతుందని కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కానీ స్పష్టమైన సమాచారం ఉన్నప్పుడు విషయాన్ని పోలీసు అధికారి సెకండ్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా పిలిచే తహశీల్దార్/ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్తారు. ముందుజాగ్రత్త చర్యగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్ చేస్తారు. ఈ ప్రక్రియలో అనుమానిత వ్యక్తి నుంచి అధికారులు బాండ్ తీసుకుంటారు. తాను ఎలాంటి సంఘ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనంటూ ఆ వ్యక్తి అందులో స్పష్టం చేస్తారు. దీనికి కొంత మొత్తాన్ని ష్యూరిటీగా బాండ్లో నమోదు చేస్తాడు. దీన్ని ఉల్లంఘిస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. అనుమానిత వ్యక్తి వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే... 24 గంటల వరకు అదుపులో ఉంచుకునే అవకాశమూ పోలీసులకు ఉంటుంది. సీఆర్పీసీ 108 ప్రయోగం నగర పోలీసులు బైండోవర్ చేయాల్సిన ప్రాపర్టీ అఫెండర్స్‌పై సీఆర్పీసీలోని 108 సెక్షన్ ప్రయోగించనున్నారు. వీరిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడంతో పాటు అతడి పూర్తి నేరచరిత్రను ఆయనకు నివేదిస్తారు. పూచీకత్తు మొత్తాన్ని నేరగాడి వ్యవహారశైలిని బట్టి రూ.2 లక్షల వరకు ఉండేలా చూడాలని భావిస్తున్నారు. గరిష్టంగా ఏడాది కాలంలో ఆ వ్యక్తి మరోసారి నేరం చేసినట్లు తేలితే అరెస్టు చేయడంతో పాటు పూచీకత్తుగా ఉంచిన మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఎవరైనా పూచీకత్తు కట్టనంటే నేరుగా జైలుకు పంపించే అవకాశమూ ఉంటుంది. కట్టలేని పక్షంలో మరో వ్యక్తి ష్యూరిటీగా ఉండి పూచీకత్తుకు సమాన విలువ కలిగిన స్థిరాస్తి పత్రాలను అందించాలి. నేరగాడు బైండోవర్‌ను ఉల్లంఘిస్తే ఆ సొత్తు ప్రభుత్వ పరమౌతుంది. గురువారం నాటి సమావేశంలో ఈ వివరాలను సిబ్బందికి తెలిపిన అధికారులు... వచ్చే వారం నుంచి బైండోవర్ల ప్రక్రియ ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. -
మాఘీ గణేశుడికి జై...
ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన సాక్షి, ముంబై: నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మాఘీ గణేశ్ ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. టపాసులు కాల్చుతూ, బ్యాండు మేళాలు వాయిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని విగ్రహాలను సోమవారం ప్రతిష్ఠించారు. కొందరు ఆలంకరణల కోసం ఒకటి రెండు రోజుల ముందుగానే వినాయకుని విగ్రహాలను తమ మండళ్ల వద్దకు తీసుకురాగా, మరికొందరు సోమవారం తీసుకువచ్చి మండళ్ల వద్ద ప్రతిష్ఠించారు. వినాయక చవితి సందర్భంగా జరుపుకునే ఉత్సవాల మాదిరిగా ఈ మాఘీ ఉత్సవాలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వినాయకుని జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ఉత్సవాలు ప్రారంభంలో కేవలం మొక్కులు తీర్చుకునేందుకు చేసేవారు. అనంతరం ఈ ఉత్సవాలను సార్వజనిక మండళ్లు నిర్వహించడం మొదలైంది. ఈసారి ముంబైలో సుమారు 1,200కు పైగా సార్వజనిక మండళ్లు వినాయక విగ్రహాలను ప్రతిష్టించాయి. తూర్పు దాదర్‌లోని ‘సార్వజనిక్ మాఘీ గణేశ్ ఉత్సవ మండలి’ 44వసారి వేడుకలను నిర్వహిస్తోంది. ఈ మండలివారు ఆదివారం సాయంత్రం వినాయకుని ఊరేగిస్తూ తీసుకువచ్చి ప్రతిష్టించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని మండలి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు క్రికెట్, చిత్రకళా పోటీలను నిర్వహిస్తున్నారు. మరోవైపు గోరేగావ్‌లోని సంకల్ప్ గణేష్ మందిరం ఆధ్వర్యంలో భజనలు, కీర్తనలు, హోమాలు, ఊరేగింపులు చేస్తున్నారు. సిద్ధి వినాయకుని ఆలయం ఆధ్వర్యంలో కూడా మాఘీ గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకడ్ హారతి, మహాపూజా, శోభయాత్ర, రథయాత్ర, భజన తదితర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు బోరివలిలోని గణేష్ మందిరం కావడంతో పాటు భక్తులు పెద్ద ఎత్తున వినాయకున్ని దర్శించుకునేందుకు చేరుకుంటున్నారు. ఠాణే జిల్లాలో... ఠాణేతోపాటు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మాఘీ గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఠాణే లోకమాన్యనగర్ పాడ నంబర్ రెండులోని ‘సాయినాథ్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో ప్రతియేటా మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు సుధీర్ బర్గే తెలిపారు. 13వ సంవత్సరం సందర్భంగా జైపూర్‌లోని దేవీ ఆలయం నమూనాను అలంకరించామన్నారు. అలంకరణ కోసం ఆదివారం సాయంత్రం వినాయకుని విగ్రహాన్ని తీసుకువచ్చినప్పటికీ సోమవారం ఉదయం ప్రతిష్టించామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టీట్వాలాతోపాటు రాష్ట్రంలోని అష్టవినాయకుని ఆలయాల్లో భక్తుల రద్దీ కన్పించింది. సిద్ది వినాయకుని ఆలయానికి బస్సులు... ప్రతి మంగళవారంతోపాటు సంకష్టి చతుర్ధశి రోజున సిద్ధి వినాయకున్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం బెస్టు ప్రత్యేక బస్సు సేవలను నగర మేయర్ సునీల్ ప్రభూ ఆదివారం ప్రారంభించారు. దాదర్ రైల్వే స్టేషన్ నుంచి సిద్ధి వినాయకుని ఆలయం వరకు ‘దాదర్ ఫేరీ-3’ అనే పేరుతో ఈ బస్సు సేవలకు నామకరణం చేశారు. ఈ బస్సులు వృత్తాకారంలో దాదర్ రైల్వేస్టేషన్ (కబూతర్‌ఖానా) నుంచి బయలుదేరి శారదాశ్రమం మీదుగా సిద్ధి వినాయకుని మందిరం, ప్రభాదేవి, ప్రభాదేవి మందిరం, రవీంద్ర నాట్యమందిరం, శ్రీసిద్దవినాయక్ మందిరం (శంకర్గానేకర్మార్గం), శారాదాశ్రమం, దాదర్ రైల్వేస్టేషన్ (కబూతర్‌ఖానా) మీదుగా సేవలందించనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ బస్సు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలను భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని బెస్టు అధికారులు తెలిపారు. సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని చెప్పారు. -
ప్రతి పోలీసూ త్యాగధనుడే!
=నిత్యం కుటుంబాలకు దూరం =వెంటాడుతున్న అనారోగ్యం =అనేక మందిలో కనిపించని కృత జ్ఞత =నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సాక్షి,సిటీబ్యూరో: శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులే అత్యంత కీలకం. ఒక్కరోజు పోలీసు అనే వ్యక్తి లేకుంటే ఊహించడం చాలాకష్టం. అలాంటి పోలీసులు విధినిర్వహణలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే అయినా ప్రజ లకు సంబంధించి విధి కావడంతో ఎప్పుడు,ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి. అయితే పోలీసుల పరిస్థితి జంటకమిషరేట్లలో ఏంటో తెలుసా..? అరకొర సిబ్బంది, వేళాపాళా లేని విధులు, నిత్యం తన వారికి దూరంగా.. అనారోగ్యాలకు దగ్గరగా, పండుగలు, పబ్బాలు రోడ్లమీదే. అక్టోబర్ 21..పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఏడాదికాలంలో విధినిర్వహణలో ప్రాణాలు అర్పించి త్యాగధనులుగా మారిన అధికారులు, సిబ్బందిని స్మరించుకోవడం కోసం దీన్ని నిర్వహిస్తారు. కేవలం వీరు మాత్రమే కాదు...వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పనిచేసే ప్రతి పోలీసు త్యాగధనుడే. సర్వకాల సర్వావస్థల్లోనూ : నగరం మొత్తం ఆదమరిచి నిద్రిస్తున్న రాత్రివేళ కాపుకాయడానికి ప్రతిరాత్రీ 1400 మంది పోలీసులు మేల్కొనే ఉంటారు. గస్తీ తిరుగుతూ నగరాన్ని కంటికిరెప్పలా కాపాడుతుంటారు. పండుగలు, పబ్బాలు వచ్చిన సందర్భంలో నగరం దాదాపు సగంఖాళీ అవుతుంది. అదే సమయంలో నగర పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది మొత్తం ‘స్టాండ్టూ’లో ఉంటూ... కుటుంబాన్ని వదిలి విధినిర్వహణ కోసం 24 గంటలు పోలీసుస్టేషన్‌కే అంకితం అవుతారు. ఇటీవల పరిస్థితులే తీసుకుంటే జూలై నుంచి నేటివరకు కంటి నిండా నిద్రపోయిన పోలీసు అంటూ లేరు. రంజాన్ మాసం,గణేష్ ఉత్సవాలు, నిరసనలు, దసరా నవరాత్రులు ఇలా వరుసపెట్టి బందోబస్తులతో కమిషనరేట్ పరిధిలోని ప్రతిఅధికారి విధుల్లోనే ఉన్నారు. ఇది కేవలం మచ్చుతునక మాత్రమే. ఇక ట్రాఫిక్ పోలీసులు విధుల గురించి తెలియని వారుండరు. వెంటాడే అనారోగ్యం : పోలీసులకు విధి నిర్వహణలో ఎదురయ్యే మరో పెను ఉపద్రవం అనారోగ్యం. వేళాపాళాలేని విధులు..కంటినిండా నిద్ర, కడుపు నిండా తిండిలేని దుస్థితి వెరసి అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోం ది. రాష్ట్రంలో ఏటా అనారోగ్యానికిలోనై ప్రాణాలు వదులుతున్న వారిలో కిందిస్థాయి వారే ఎక్కువ. రాష్ట్రం మొత్తమ్మీద ఏటా 500మంది సిబ్బంది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక రోగులుగా మారి చికిత్సలు చేయించుకుంటూ నరకం అనుభవిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ట్రాఫిక్ పోలీసులకు ఇక శ్వాసకోస వ్యాధులు అధికం. ఆ స్థాయి గుర్తింపు శూన్యం : అనునిత్యం విధులకే అంకితమవుతూ మన కోసం, జనం కోసం కాపుకాస్తున్న పోలీసు త్యాగాలకు సరైన గుర్తింపు మాత్రం లభించట్లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. ‘జీవితంలో కనీసం ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లని వారికంటే...కనీసం ఒక్కసారైనా వారి వద్దకు వెళ్లిన వారికే పోలీసులంటే సదాభిప్రాయం ఉంటోంది’ అనేక అంతర్జాతీయ సర్వేలు చెప్పిన వాస్తవమిది. అయితే సమాజంలో దాదాపు 60 శాతం మందికి వారి జీవితంలో ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గడిచిపోతోంది. మరోపక్క పోలీసుస్టేషన్లకు వస్తున్న వారు సైతం ‘అధికారభాష’, ప్రవర్తనా తీరుతో ఉన్న సదాభిప్రాయాన్ని కోల్పోతున్నారు. వీటన్నింటికీ మించి పోలీసు విభాగంలో చోటు చేసుకునే చిన్నచిన్న తప్పులు, అపశ్రుతులు వల్ల వారు సమాజానికి మరితం దూరమవుతున్నారు. ‘అదుపు’ తప్పుతున్నారు : ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న మన పోలీసులు అనేక సందర్భాల్లో ‘అదుపు’ తప్పుతున్నారు. సహనాన్ని కోల్పోయి ఉన్నతాధికారులపై తిరగబడటం, దాడులు చేయడం జరుగుతోంది. ఈ ఒత్తిడికితోడు నిత్యం కుటుంబానికి దూరంగా ఉండటం, వారిని నిర్లక్ష్యం చేయడంతో కొన్ని చిన్నచిన్న కుటుంబసమస్యలను తట్టుకునే మానసిక పరిపక్వతను కోల్పోతున్నారు. -
శాంతియుతంగా ఉత్సవాలు
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : అనాదిగా వస్తున్న పరంపరను కొనసాగిస్తూ వినాయక ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాలని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వినాయక శిశుమందిర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో వినాయక ఉత్సవాలు కీలక పాత్ర పోషించాయని, బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలకు నాంది పలికారని తెలిపారు. వివేకానందుని స్ఫూర్తితో సమాజ ఉన్నతికి యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చికిలి లక్ష్మీవేంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి వేద మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక శాస్త్ర నామాలు, అర్చనలు నిర్వహించారు. హారతి, వినాయక సంకీర్తనలు ఆలపించి భక్తి పారవశ్యాలతో వినాయక ప్రతిమలను వాహనంలో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. డీఎస్పీ లతామాధురి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, హిందూ సమాజ ఉత్సవ సమితి అధ్యక్షులు గోలి తిరుపతి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, అన్నమయ్య లలిత కళా సమితి అధ్యక్ష, కార్యదర్శులు కొండయ్య చౌదరి, ఎస్.రాజారాం, నాయకులు శ్రీరాం నాయక్, దశరథ్ పటేల్, సంతోష్, మటోలియూ, నగేశ్, రాజేశ్వర్, బండారి దేవన్న పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలల విద్యార్థులు శోభాయాత్రలో చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ బద్ధంగా వస్త్ర అలంకరణతో కోలాటాలు చేస్తూ భక్తి పారవశ్యాలతో దైవ భక్తి గీతాలపై చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత మాత, వివేకానందుని వేషధారణలతో చిన్నారుల ప్రదర్శనలు దేశ ఔనత్యాన్ని చాటారుు. విశేషంగా ఆకట్టుకున్నాయి. -
‘రాజా’కు కానుకల వెల్లువ
సాక్షి, ముంబై: భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడిగా ప్రఖ్యాతి చెందిన ప్రముఖ ‘లాల్బాగ్ చా రాజా’ హుండీలో కానుకల వర్షం కురుస్తూనే ఉంది. కేవలం రెండు రోజుల్లో భక్తులు రూ.1.30 కోట్లు విలువచేసే కానుకలు సమర్పించుకున్నట్లు లాల్బాగ్ చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి కోశాధికారి రాజేంద్ర లాంజ్వల్ చెప్పారు. గణేశ్ ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కాని భక్తులు రాజాను దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి నుంచి క్యూలో నిలబడ్డారు. సోమవారం ఉదయం నుంచి ఈ ప్రాంతమంతా జనసంద్రమైపోయింది. దాంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడింది. సోమ, మంగళ, బుధవారం రాత్రి వరకు ఇలా కేవలం మూడు రోజుల్లో 50 లక్షలకుపైగా భక్తులు రాజాను దర్శించుకున్నారని మండలి కార్యదర్శి సుధీర్ సాల్వీ తెలిపారు. తమ మొక్కుబడులు తీరడంతో అనేక మంది తమ ఆర్థిక స్థోమతను బట్టి తోచిన విధంగా హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. ఇలా రెండు రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలు మండలి పదాధికారులు లెక్కించారు. ఏటా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసేవరకు లాల్బాగ్ చా రాజాకు దాదాపు రూ.తొమ్మిది కోట్లకుపైగా నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువుల రూపంలో కానుకలు చెల్లించుకుంటారు. ఈ కానుకలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం 11 రోజులపాటు సాగిన ఈ ఉత్సవాల్లో రాజాకు రూ.9.20 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చింది. కాని ఈ ఏడు తొమ్మిది రోజులు మాత్రమే ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో రూ.ఎనిమిది కోట్ల వరకు ఆదాయం రావచ్చని రాజేంద్ర లాంజ్వల్ అభిప్రాయపడ్డారు. భక్తుల రద్దీని నియంత్రించడం ప్రభుత్వ పోలీసులకు, మండలికి చెందిన వేలాది కార్యకర్తలకు, ఇతర ప్రైవేటు భద్రతా సిబ్బందికి అగ్నిపరీక్షగా మారింది. మొక్కుబడులు చెల్లించుకునే వారికి కనీసం 20 గంటలకుపైగా సమయం పడుతోంది. క్యూలో ఉన్నవారికి తాగునీరు, అల్పాహారం ఉచితంగా అందజేస్తున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో క్యూలో నిలబడినవారు కళ్లు తిరిగి లేదా స్పృహ తప్పిపడిపోవడం లాంటి సంఘటనలు ఏటా చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేం ఆస్పతి వైద్య బృందం, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. -
రాత్రిపూట కూడా బస్సుల సేవలు
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల రద్దీని తట్టుకోవడానికి పుణే, పింప్రి-చించ్వాడ్లోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందించడానికి అదనంగా బస్సులు నడుపుతున్నారు. చివరి మూడు రోజులు ‘పుణే మహానగర్ పరివాహన్ పరిమండల్ లిమిటెడ్’ (పీఎంపీఎల్) బస్సు సేవలు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం 622 బస్సులను ఏర్పాటు చేసినట్టు పీఎంపీఎల్ అధికారి కాలేకర్ తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవమైన వినాయకుని ఉత్సవాలు పుణేలో ఘనంగా నిర్వహిస్తారు. వీటిని తిలకిచేందుకు రాష్ట్రంలోని ప్రజలతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు పుణేకి వస్తుంటారు. ఈ నేపథ్యంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పుణే, పింప్రి-చించ్వాడ్లోని ప్రముఖ మార్గాలపై 24 గంటలపాటు బస్సు సేవలను అందిస్తున్నారు. ఈ సేవలు ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. శివాజీమార్గంలో అధిక బస్సులు నడుపుతామని పీఎంపీఎల్ తెలిపింది. అయితే ఉత్సవాల సందర్భంగా ఈ మార్గంలో మొదటి రోజు నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీంతో 17 బస్సు రూట్లను నెహ్రూ రోడ్డుపై నుంచి, మరో 18 బస్సులను తిలక్మార్గంపై మళ్లించి నడపనున్నారు. ఇందుకోసం కొన్ని బస్సులు ఎస్జీ బర్వే చౌక్ నుంచి జంగ్లీ మహారాజు రోడ్డుపై నుంచి తిలక్ మార్గం మీదుగా లేదా శాస్త్రినగర్ రోడ్డుపై నుంచి నడపనున్నారు. మరికొన్ని బస్సులను జీజామాతా చౌక్ నుంచి నెహ్రూ రోడ్డు వైపు మళ్లిస్తారు. శివాజీ రోడ్డుపై బస్టాప్‌లను మార్చి సంబంధిత వివరాలతో కూడిన బోర్డులను కూడా అమర్చనున్నారు. ప్రముఖ మార్గాలపై రాత్రంతా నడిచే బస్సుల్లో అదనంగా రూ.ఐదు వసూలు చేస్తారు. కార్పొరేషన్ భవనం, డెంగలే వంతెన, స్వార్గేట్, డెక్కన్ కార్నర్, పుల్గేట్ తదితర రద్దీ ప్రాంతాల్లో ఎక్కువ బస్సులు ఉంటాయి. వీటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే 9881495589 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు : ఎస్పీ త్రిపాఠి
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : గణేశ్ ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. శనివారం స్పెషల్ బ్రాంచ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రణాళిక తయారు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, బందోబస్తు విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఖానాపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, ఉట్నూర్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టాలని, ప్రధాన కూడళ్ల దగ్గర పీకెటింగ్, ప్రార్థన స్థలాల్లో పోలీసు పహారా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎప్పటికప్పుడు పేకాట స్థావరాలు, క్లబ్‌లపై దాడులు నిర్వహించి జూదాన్ని అరికట్టాలని ఆదేశించారు. కొంతమంది అసాంఘిక శక్తులు చేసే వదంతులు ప్రజలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలీసు అధికారులు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో యాంటీ సాబోటేజ్ చెకింగ్, వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాల ఉపయోగం, పోలీసు వీడియోగ్రాఫర్లను, అనుమానిత ప్రాంతాల్లో బాంబ్ స్వ్కాడ్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పోలీసులు సెలవుపై వెళ్లకుండా పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను పూర్తి చేసి ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరిగేలా చూడాలని కోరారు. ఇన్స్పెక్టర్లు కె.సీతారాములు, ఎస్.బాలరాజు, రాగ్యానాయక్, ఎస్సైలు అన్వర్‌ఉల్లాహక్, ఎంఏ కరీం, టీడీ నందన్ , తాజొద్దీన్ పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు : ఎస్పీ త్రిపాఠి
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : గణేశ్ ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. శనివారం స్పెషల్ బ్రాంచ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రణాళిక తయారు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, బందోబస్తు విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఖానాపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, ఉట్నూర్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టాలని, ప్రధాన కూడళ్ల దగ్గర పీకెటింగ్, ప్రార్థన స్థలాల్లో పోలీసు పహారా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎప్పటికప్పుడు పేకాట స్థావరాలు, క్లబ్‌లపై దాడులు నిర్వహించి జూదాన్ని అరికట్టాలని ఆదేశించారు. కొంతమంది అసాంఘిక శక్తులు చేసే వదంతులు ప్రజలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలీసు అధికారులు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో యాంటీ సాబోటేజ్ చెకింగ్, వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాల ఉపయోగం, పోలీసు వీడియోగ్రాఫర్లను, అనుమానిత ప్రాంతాల్లో బాంబ్ స్వ్కాడ్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పోలీసులు సెలవుపై వెళ్లకుండా పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను పూర్తి చేసి ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరిగేలా చూడాలని కోరారు. ఇన్స్పెక్టర్లు కె.సీతారాములు, ఎస్.బాలరాజు, రాగ్యానాయక్, ఎస్సైలు అన్వర్‌ఉల్లాహక్, ఎంఏ కరీం, టీడీ నందన్ , తాజొద్దీన్ పాల్గొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఎక్కడో ఏదో జరిగిందంటూ వ్యాపించే వదంతులను నమ్మవద్దని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ మో హన్‌రావు ప్రజలకు సూచించారు. ఇందుకు అన్ని వర్గాలవారూ సహకరించాలని కోరారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శుక్రవా రం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌లోనే గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్న కీర్తి ఉందన్నారు. దీనిని నిలబెట్టుకోవాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. గొడవలకు పాల్పడేవారిని ఇప్పటికే బైండోవర్ చేశామన్నారు. అనుమానాస్పద వ్యక్తులుగాని, వస్తువులు గాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అనుమానితులపై నిఘా పెంచామన్నారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాం నగరంలో అవసరమైన చోట రోడ్ల నిర్మా ణం, మరమ్మతులు చేపట్టామని కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు తెలిపారు. గణేశ్ మండళ్ల వద్ద, నిమజ్జన శోభాయాత్ర సాగే దారుల్లో చెత్త పడేయొద్దని ప్రజలకు సూచించారు. సంస్థలో పారిశుధ్య కార్మికుల కొరత ఉందని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. నిమజ్జనం కోసం స్థలం కేటాయించాలి ‘నగరంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గణేశ్ నిమజ్జ నం కోసం నగర శివారు ప్రాంతంలో ప్రభు త్వ భూమిలోంచి కొంత స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుంది’ అని శాంతికమిటీ సభ్యుడు, బోర్గాం ఉపసర్పంచ్ గంగారెడ్డి(చిరంజీవి) అధికారులకు సూచించారు. నగరంలోని గణేశ్ విగ్రహాలను వినాయక్‌నగర్ బావి, బోర్గాం వాగు, బాసరలోని గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. నది లో విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల తాగునీరు కలుషితమవుతోందని పలువు రు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగర శివారులోనే స్థలం కేటాయించాలని సూచించారు. సమావేశంలో నగర డీఎస్పీ అనిల్‌కుమార్, ఎస్హెచ్ఓ నర్సింగ్ యాదవ్, సీఐలు సైదులు, శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌కుమార్, తహశీల్దార్ రాజేందర్ పాల్గొన్నారు. -
గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష
హైదరాబాద్: జంట నగరాల్లో గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్ సమీక్షీంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె మహంతి, డిజిపి దినేష్ రెడ్డి, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగరంలో శాంతిభద్రతలపై చర్చించారు. అంతకు ముందు సీఎస్‌తో దినేష్ రెడ్డి, ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈనెల 9న గణేష్ చతుర్థి సందర్భంగా తీసుకోవల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. -
తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణపతికి 4 వేల కిలోల లడ్డూ
మండపేట, న్యూస్‌లైన్: వినాయక ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిచ్చే ఇక్కడి గణనాధుని విగ్రహం రాష్ట్రంలోనే ఎత్తైదిగా గణతికెక్కుతుంది. ఇంతభారీ విగ్రహం వద్ద ఉంచే భారీ లడ్డూ తయారీకి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఆధ్వర్యంలో బృందం సిద్ధమైంది. ఖైరతాబాద్‌లో ఈ సంవత్సరం ప్రతిష్టించే 59 అడుగుల ‘గోనాగ చతుర్ముఖ వినాయక’ విగ్రహం చేతిలో 4 వేల కేజీల భారీ లడ్డూను ఉంచనున్నారు. గురువారం మల్లిబాబు విలేకరులతో మాట్లాడుతూ తనతోపాటు, గణేష్‌మాల ధరించిన 16 మంది దీనిని తయారీ చేయనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 4న బూందీ తయారీని ప్రారంభించి 6న లడ్డూను తయారు చేస్తామన్నారు. 7న తుదిమెరుగులు దిద్దుతామని, 8న క్రేన్ సహాయంతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలోకి చేర్చి 9న హైదరాబాద్‌కు చేరుస్తామని వివరించారు. -
గణేష్ ఉత్సవాల వరకూ పోలీసు యాక్టు
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: గణేష్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు జిల్లా పరిధిలో పోలీసు యాక్టు 30 కొనసాగుతుందని ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె తాండూరులో విలేకరులతో మాట్లాడారు. గతేడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో ఈసారి పోలీసు యాక్టు 30ని కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇటీవల తాండూరు మండల పరిధిలో జరిగిన జంటహత్యల కేసులో వారంలోగా నిందితులను అరెస్టు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మృతి చెందిన మహిళలిద్దరూ దళితులని, నిందితులపై హత్య, అత్యాచారం కేసులతో పాటు అట్రాసిటి కేసు నమోదు చేయన్నుట్లు తెలిపారు. కరన్‌కోట ఠాణా పైనుంచి దూకి ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్న కేసులో ఇప్పటికే ఎస్సై పవన్‌కు మేజర్ చార్జ్ మెమో ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుపై మెజిస్టీరియల్ విచారణ సబ్‌కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతోందని చెప్పారు. జిల్లా పరిధిలో సస్పెన్షన్‌కు గురై, మెమోలు పొందిన పోలీసులకు ఏఎస్పీ ఆధ్వర్యంలో వచ్చే నెల మొదటివారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యాలాల మండలానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో రూరల్ సీఐ రవిపై ఏఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందన్నారు. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన కరన్‌కోట ఎస్సై శ్రీనివాస్ తప్పేమీ లేకున్నా కేవలం ఫోన్ స్విచాఫ్ చేసినందుకే చర్య తీసుకున్నట్లు ఆరోపణలున్నాయని ఎస్పీని విలేకరులు ప్రశ్నించగా.. ఠాణాలో విందు చేసుకుంటున్న సమయంలోనే సీఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని, అప్పుడు విధుల్లో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లపై కూడా సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఘటనలో ఎస్సై ప్రమేయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. బాలికలతో పాటు యువతులను ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ల బారి నుంచి రక్షించేందుకు ప్రతి కళాశాలలో పీఎస్‌ల ఫోన్ నంబర్లు ఏర్పాటుచేశామన్నారు. అంతేకాకుండా కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, విద్యార్థులు, పోలీసులతో కలిసి త్వరలోనే సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ రాజకుమారి వివరించారు -
చుక్కల్లో ధరలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పండుగల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాబోయే పండుగలు సగటు జీవికి భారంగా పరిణమించేట్లున్నాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంది. వచ్చే నెలలో వినాయక చవితి ఉంది. ఈ ప్రధాన పండుగల సమయాల్లో పళ్లు, కూరగాయల ధరలు కొండెక్కడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఉల్లి, అరటి, వెల్లుల్లి ధరలు అదుపు తప్పి పోయాయి. ఉల్లి ధర కేజీ రూ.70కి పెరిగింది. నిత్యం వంటకాల్లో దీని అవసరం ఉంటుంది. కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు కానీ పూర్తిగా మినహాయించలేని పరిస్థితి. ఇక దీనితో పచ్చి మిర్చి ధర కూడా పోటీ పడుతోంది. పండుగలంటే నైవేద్యం, పంచామృతాలకు అరటి తప్పనిసరి. రాష్ట్రంలో భారీ వర్షాలకు అనేక పొలాలు, తోటలు నీట మునిగాయి. దరిమిలా క్యారెట్, మిరప, కోసు, బఠాణి, అకు కూరల ధరలూ బాగా పెరిగిపోయాయి. బీన్స్, టమోటా ధరలు తగ్గడం వినియోగదారులకు కాస్త ఊరట. మహాలక్ష్మి వ్రతానికి ఇక కేవలం మూడు రోజులు మాత్రమే ఉండగా, అరటి (ఏలక్కి) ధర కేజీ రూ.60-70 పలుకుతోంది. హాప్‌కామ్స్‌లో ఏలక్కి ధర రూ.63, పచ్చ అరటి ధర రూ.23కు పెరిగిపోయాయి. పండుగల సమయానికి వీటి ధర కేజీకీ మరో రూ.10 పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అరటి ఉత్పత్తి తగ్గిపోయిందని అధికారులు చెప్పారు. దీనికి తోడు పండుగ సమయాల్లో మంచి ధర లభిస్తుందనే అంచనాతో రైతులు వాటి కోతను వాయిదా వేస్తూ వస్తున్నారని తెలిపారు. పండుగ సమయాల్లో అరటి మార్కెట్‌ను ముంచెత్తినా డిమాండ్ దృష్ట్యా ధర తగ్గే అవకాశాలు లేవని విశ్లేషించారు. కాగా ప్రస్తుతం కేజీ క్యారెట్ ధర రూ.72, పచ్చి మిరప రూ.70, బఠాణి రూ.68 చొప్పున పలుకుతున్నాయి. టమాట కేజీ రూ.10, సిమ్లా ఆపిల్ రూ.80, దానిమ్మ రూ.90 చొప్పున విక్రయిస్తున్నారు. బళ్లారిలోనూ అంతే.. బళ్లారి మార్కెట్లో పచ్చిమిర్చి, ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. మంగళవారం బళ్లారి మార్కెట్లో పచ్చి మిర్చి కేజీ ధర ఏకంగా రూ.90, ఉల్లిధర రూ.70 కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్ర సమ్మె కారణం.. అధిక వర్షాల వల్ల ఉల్లిగడ్డలు చెడిపోవడం.. మిర్చి పంట తగినంత రాకపోవడం తదితర కారణాలతో ఈ రెండు కూరగాయలు ధరలకు రెక్కలు వచ్చాయి. వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే రూ.500లు ఖర్చుపెట్టాల్సి వస్తోందని, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు జేబునిండా డబ్బులు తీసుకెళ్లినా బ్యాగు నిండా కూరగాయలు రాని పరిస్థితి నెలకుంది. వీటితోపాటు మిగిలిన ఓ కూరగాయలు ముట్టుకున్నా కిలో రూ.50లకు పైగా ధర ఉండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కిలో టమాట రూ.60 ఉండగా.. నేడు దాని ధర రూ.6కు పడిపోయింది. ఈ కష్టకాలంలో టమాట సామాన్యుల పాలిట ఆపద్బాంధవుడిలా మారింది -
గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు సర్కారే చేపట్టాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ ఏడాది హైదరాబాద్‌లో 34వ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి హిందువు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9 నుంచి18 వరకు హైదరాబాద్‌లో జరిగే గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం ఇక్కడి సిద్దిఅంబర్‌బజార్‌లోని బెహతీభవన్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. తొలుత దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో, కేథార్నాథ్, ఉత్తరాఖండ్ వరదల్లో, పాక్ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయినవారికి, గతేడాది చనిపోయిన ఉత్సవ సమితి కార్యకర్తలకు నివాళులు అర్పించారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. గణేష్ మండపాల నిర్వాహకులతో సెప్టెంబర్ 1న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సభకు వీహెచ్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్‌సింఘాల్, యూపీకి చెందిన చిన్మయానంద స్వామిజీతోపాటు రాష్ట్రంలోని ప్రధాన సాధు సంతులు హాజరవుతారన్నా రు. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు మాట్లాడుతూ.. నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని, హిందూ ఉత్సవాలపై పనిగట్టుకుని ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కల గకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు వైకుంఠం, ఆలె జితేందర్, టీడీపీ నేత జి.ఎస్.బుగ్గారావు, బీజేపీ నేత వై.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మరో రోజూ కావాలి
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సమయంలో అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు, బ్యాండ్‌మేళాలు, టపాసులు వినియోగించేందుకు నాలుగు రోజులపాటు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయి తే లౌడ్‌స్పీకర్ల సౌండ్‌లో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు. నియమాలకు లోబడి నిర్దేశించిన స్థాయుల ప్రకారమే సౌండ్ సిస్టంను వాడాల్సి ఉం టుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు హర్షం వ్యక్తం చేశాయి. ఉత్సవాల కోసం ఒక రోజు అదనంగా.. అంటే ఐదు రోజులపాటు అర్ధరాత్రి వరకు లౌడ్స్పీక ర్లు, బాణసంచా, బ్యాండ్, భజనలు, కీర్తనలు ఆల పించేందుకు అనుమతివ్వాలని సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. గతంలో మూడు రోజుల వరకు అనుమతి ఉండగా ఈసారి నాలుగు రోజులకు పెంచారు. అయితే లౌడ్‌స్పీకర్ సౌండ్‌ను మాత్రం తగ్గించాలని ప్రభుత్వం షరతులు విధించింది. దీంతో మండళ్ల నిర్వాహకులు నియమాలకు లోబడి అర్ధరాత్రిలోపు లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఉత్సవాలు మినహా మిగతా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిన విషయం తెలి సిందే. కాగా ధ్వని కాలుష్యం నియంత్రణకు కట్టుబడి ఏటా 15 రోజులు మాత్రమే అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు వినియోగించుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. గణేశ్ ఉత్సవాల సమయంలో ఐదోరోజు విగ్రహాల నిమజ్జనం, గౌరీవిగ్రహాల నిమజ్జనం, అనంత చతుర్థి ఇలా మూడు రోజులు మాత్రం అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లకు అనుమతి ఉండేది. ఈసారి అదనంగా మరోరోజు అనుమతి లభించింది. ఏటా శివాజీ జయంతి, ఈద్-ఏ-మిలాద్, అంబేద్కర్ జయంతి, మహారాష్ట్ర అవతరణ దినోత్సవం, దీపావళి, క్రిస్మస్, 31 డిసెంబర్, గణేశ్ ఉత్సవాల్లో నాలుగు రోజులు, నవరాత్రి ఉత్సవాల్లో 13 రోజులు అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు వినియోగించేందుకు అనుమతి ఉంటుంది. అవసరమైతే మరో రెండు రోజులు పొడగించడానికి జిల్లా అధికారులకు అధికారాలు ఉంటాయి. గణేశ్ ఉత్సవాల కోసం ఐదు రోజుల పాటు సంగీత పరికరాలకు అనుమతించాలని బృహన్ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి అధ్యక్షుడు నరేశ్ దహిబావ్కర్ జిల్లా అధికారికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇక్కడి నుంచి అనుమతి లభిస్తే మొత్తం ఐదు రోజు లు గణేశ్ ఉత్సవాలను భారీ ఆటపాటలతో నిర్వహించుకోవచ్చు.


