
ముంబై: దేశవ్యాపంగా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గణపతి ఉత్సవాలను మహారాష్ట్ర పెట్టింది పేరు. ముఖ్యంగా ముంబైలో జరిగే గణనాథుని ఉత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతాయి. ఇక్కడి ‘లాల్‌బాగ్చా రాజా’ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లక్షలాదిగా భక్తులు ఈ గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తూ నగదును, విలువైన కానుకలను అందిస్తున్నారు.
VIDEO | Devotees throng Mumbai’s iconic Lalbaugcha Raja to offer prayers and seek blessings during the ongoing Ganesh Chaturthi celebrations.#Ganeshotsav #GaneshChaturthi2025
(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/6foYt5XqiL— Press Trust of India (@PTI_News) August 30, 2025
గణపతి నవరాత్రుల తొలిరోజునే లాల్ బాగ్చారాజాకు భారీగా విరాళాలు, కానుకలు అందాయి. అలాగే బంగారం, వెండి కానుకలు కూడా గణనీయంగా వచ్చాయని లాల్‌బాగ్చా రాజా సార్వజనిక్ గణేశోత్సవ మండల్ నిర్వాహకులు తెలిపారు. స్టేజ్ హుండీ నుండి రూ. 25.50 లక్షలు, రంగ్ హుండీ ద్వారా మరో రూ. 20.50 లక్షలు విరాళాలుగా అందాయని, తొలిరోజున మొత్తం విరాళాలు రూ. 46 లక్షలని నిర్వాహకులు వివరించారు. అలాగే పలువురు భక్తులు 144.050 గ్రాముల బంగారం, 7,159 గ్రాముల వెండిని సమర్పించారని తెలిపారు.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబైలో లాల్‌బాగ్చా రాజాను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థనలు చేసి, నగదు లేదా నగల రూపంలో విరాళాలు సమర్పిస్తుంటారు. ఈ విరాళాలను లెక్కించే ప్రక్రియ ఉత్సవాల రెండవ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఉత్సవ నిర్వాహకుల పర్యవేక్షణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జీఎస్ మహానగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు విరాళాలను లెక్కిస్తారు.