breaking news
Lalbagh Cha Raja
-
Lalbaugcha Raja: తొలిరోజే నిండిన హుండీలు.. భారీగా బంగారు, వెండి కానుకలు కూడా..
ముంబై: దేశవ్యాపంగా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గణపతి ఉత్సవాలను మహారాష్ట్ర పెట్టింది పేరు. ముఖ్యంగా ముంబైలో జరిగే గణనాథుని ఉత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతాయి. ఇక్కడి ‘లాల్బాగ్చా రాజా’ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లక్షలాదిగా భక్తులు ఈ గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తూ నగదును, విలువైన కానుకలను అందిస్తున్నారు. VIDEO | Devotees throng Mumbai’s iconic Lalbaugcha Raja to offer prayers and seek blessings during the ongoing Ganesh Chaturthi celebrations.#Ganeshotsav #GaneshChaturthi2025(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/6foYt5XqiL— Press Trust of India (@PTI_News) August 30, 2025గణపతి నవరాత్రుల తొలిరోజునే లాల్ బాగ్చారాజాకు భారీగా విరాళాలు, కానుకలు అందాయి. అలాగే బంగారం, వెండి కానుకలు కూడా గణనీయంగా వచ్చాయని లాల్బాగ్చా రాజా సార్వజనిక్ గణేశోత్సవ మండల్ నిర్వాహకులు తెలిపారు. స్టేజ్ హుండీ నుండి రూ. 25.50 లక్షలు, రంగ్ హుండీ ద్వారా మరో రూ. 20.50 లక్షలు విరాళాలుగా అందాయని, తొలిరోజున మొత్తం విరాళాలు రూ. 46 లక్షలని నిర్వాహకులు వివరించారు. అలాగే పలువురు భక్తులు 144.050 గ్రాముల బంగారం, 7,159 గ్రాముల వెండిని సమర్పించారని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబైలో లాల్బాగ్చా రాజాను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థనలు చేసి, నగదు లేదా నగల రూపంలో విరాళాలు సమర్పిస్తుంటారు. ఈ విరాళాలను లెక్కించే ప్రక్రియ ఉత్సవాల రెండవ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఉత్సవ నిర్వాహకుల పర్యవేక్షణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జీఎస్ మహానగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు విరాళాలను లెక్కిస్తారు. -
ఉగాండాలో ఘనంగా గణేష్ చతుర్థి
ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో గణనాథున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో గణేష్ చతుర్థి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అక్కడి సంప్రదాయ డప్పు వాయిద్యాలు వాయిస్తూ ఉగాండా వాసులు గణనాథునికి స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Auspicious Celebrations of Ganesh Chaturthi in Uganda🇺🇬 pic.twitter.com/iDTGFc3He0— Vertigo_Warrior (@VertigoWarrior) September 6, 2024 ‘లాల్బాగ్ చా’ రాజాకు అంబానీల రూ.20 కిలోల బంగారు కిరీటం..మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నగరంలోని లాల్‌బాగ్‌లో ప్రతి ఏటా ప్రతిష్టించే అత్యంత ఎత్తైన గణపతికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కేజీల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చింది. రూ.15 కోట్ల విలువైన ఈ కిరిటాన్ని గణేష్‌కు అలంకరించే వీడియోను సోషల్‌మీడియాలో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కోరిన కోరికలు తీరుస్తాడని లాల్బాగ్ గణపతికి పేరుంది. Undoubtedly he is the "RAJA"!Known as "नवसाचा (मन्नत पूरी करनेवाले) राजा" Lalbaug's Ganpati Bappa has his own Majestic Role.20kg Gold Crown worth ₹15 Crores donated by Reliance Foundation being bestowed upon Lalbaugcha Raja.गणपती बाप्पा मोरया 🙏🚩🚩🚩 pic.twitter.com/BeoJ9G2UOK— BhikuMhatre (@MumbaichaDon) September 6, 2024 -
ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయకుడికి, అనంత్ అంబానీ బంగారు కానుక
గణేష్ ఉత్సవాలకు మహారాష్ట్రలోని ముంబై నగరం పెట్టింది పేరు. అందులోనూ ముంబైలోని ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయక ఉత్సవం మరింత స్పెషల్‌గా ఉంటుంది. ఇప్పటికే లాల్బాగ్చా రాజా వినాయకుడి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తాజాగా పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, గణనాథునిపై తమ భక్తిని, గౌరవాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. ముఖ్యంగా అనంత అంబానీ, రాధిక వివాహం తర్వాత తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.నవ వరుడు అనంత్ అంబానీ ముంబైలోని వినాయకుడికి ఘనమైన కానుకను బహూకరించారు. 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.15 కోట్లు. ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. సంప్రదాయ మెరూన్ కలర్ దుస్తుల్లో విలువైన ఆభరణాలకు తోడు ఈ ఏడాది బంగారు కిరీటంతో భక్తుల పూజలందుకోనున్నాడు గణేశుడు.కాగా 'కింగ్ ఆఫ్ లాల్బాగ్' అని పిలిచే లాల్బాగ్చా రాజా ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మంటపం. ప్రతీ సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారు. గత పదిహేనేళ్లుగా అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారు అనంత్ అంబానీ.लालबागचा राजाचे, प्रसिद्धी माध्यमांसाठी फोटो सेशन गुरुवार दिनांक 5 सप्टेंबर 2024 रोजी संध्याकाळी ठिक 7 वाजता करण्यात आले आहे. त्या वेळेची क्षणचित्रे.#lalbaugcharaja Exclusive live on YouTube :https://t.co/XAHhCLjBM6 pic.twitter.com/fg07hI096z— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 5, 2024 -
రోడ్డు పాడైందని ఆ ‘బడా గణేష్’ కమిటీకి భారీగా ఫైన్!
ముంబై: ఈ నెల తొలివారంలో దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు పదోరోజు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉత్సవాలు ముగిసిన వారం తర్వాత ముంబై నగర పాలక సంస్థ చేసిన పని ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. ముంబైలోని ప్రముఖ లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవాల నిర్వహణ కమిటీకి భారీ జరిమానా విధించింది. మీ గణేష్ ఉత్సవాల కారణంగా రహదారిపై 183 గుంతలు పడి రోడ్డంతా పాడైపోయిందని నోటీసులు ఇచ్చింది. ఒక్కో గుంతకు రూ.2,000 చొప్పున మొత్తం రూ.3.66 లక్షలు చెల్లించాలని ఆదేశించింది బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ). గణేష్ ఉత్సవాలు ముగిసిన తర్వాత నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవ కమిటీకి పంపించిన లేఖలో.. డాక్టర్ బాబాసాహేబ్ రోడ్ నుంచి టీబీ కడమ్ మార్గ్ వరకు రోడ్డు మొత్తం పాడైపోయిందని తెలిపింది బీఎంసీ ఈవార్డ్ కార్యాలయం. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
‘రాజా’కు కానుకల వెల్లువ
సాక్షి, ముంబై: భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడిగా ప్రఖ్యాతి చెందిన ప్రముఖ ‘లాల్బాగ్ చా రాజా’ హుండీలో కానుకల వర్షం కురుస్తూనే ఉంది. కేవలం రెండు రోజుల్లో భక్తులు రూ.1.30 కోట్లు విలువచేసే కానుకలు సమర్పించుకున్నట్లు లాల్బాగ్ చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి కోశాధికారి రాజేంద్ర లాంజ్వల్ చెప్పారు. గణేశ్ ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కాని భక్తులు రాజాను దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి నుంచి క్యూలో నిలబడ్డారు. సోమవారం ఉదయం నుంచి ఈ ప్రాంతమంతా జనసంద్రమైపోయింది. దాంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడింది. సోమ, మంగళ, బుధవారం రాత్రి వరకు ఇలా కేవలం మూడు రోజుల్లో 50 లక్షలకుపైగా భక్తులు రాజాను దర్శించుకున్నారని మండలి కార్యదర్శి సుధీర్ సాల్వీ తెలిపారు. తమ మొక్కుబడులు తీరడంతో అనేక మంది తమ ఆర్థిక స్థోమతను బట్టి తోచిన విధంగా హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. ఇలా రెండు రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలు మండలి పదాధికారులు లెక్కించారు. ఏటా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసేవరకు లాల్బాగ్ చా రాజాకు దాదాపు రూ.తొమ్మిది కోట్లకుపైగా నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువుల రూపంలో కానుకలు చెల్లించుకుంటారు. ఈ కానుకలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం 11 రోజులపాటు సాగిన ఈ ఉత్సవాల్లో రాజాకు రూ.9.20 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చింది. కాని ఈ ఏడు తొమ్మిది రోజులు మాత్రమే ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో రూ.ఎనిమిది కోట్ల వరకు ఆదాయం రావచ్చని రాజేంద్ర లాంజ్వల్ అభిప్రాయపడ్డారు. భక్తుల రద్దీని నియంత్రించడం ప్రభుత్వ పోలీసులకు, మండలికి చెందిన వేలాది కార్యకర్తలకు, ఇతర ప్రైవేటు భద్రతా సిబ్బందికి అగ్నిపరీక్షగా మారింది. మొక్కుబడులు చెల్లించుకునే వారికి కనీసం 20 గంటలకుపైగా సమయం పడుతోంది. క్యూలో ఉన్నవారికి తాగునీరు, అల్పాహారం ఉచితంగా అందజేస్తున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో క్యూలో నిలబడినవారు కళ్లు తిరిగి లేదా స్పృహ తప్పిపడిపోవడం లాంటి సంఘటనలు ఏటా చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేం ఆస్పతి వైద్య బృందం, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు.