బిందాస్ లైఫ్.. మంచి కంపెనీలో లక్షల్లో జీతం, గుర్తింపు ఉన్నాయి. అయినా ఏదో తెలియని వెలితి..తన చుట్టూ ఉన్న వాళ్లు 30 ఏళ్లకే వైస్‌ప్రెసిడెంట్ హోదాను అనుభవిస్తుంటే..తాను 26 ఏళ్లు వచ్చినా..ఇదే 9 టు 5 జాబ్..రొటీన్ లైఫ్. రోబోటిక్‌గా పనిచేస్తూ..ప్రమోషన్లు,గుర్తిపుతోనే బతికేయాలా అనే ఆలోచన నిద్రపట్టనివ్వలేదు. అలాగని ఈ ఉద్యోగం వదులుకునే సాహసం కూడా లేద అతనికి. చివరికి ఏదోలా ఉద్యోగం వదిలేస్తే..ఊహించని విధంగా ఆ జాబ్ కాస్త ఊడిపోయింది. తలకిందులైన తన పరిస్థితికి కుమిలిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఓటమికి అవకాశం ఇవ్వనంటూ పడిలేచిన కెరటంలా సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి గొప్ప సక్సెస్ అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు.
అతడే ముంబైకి సెమ్లానీ. కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తాత్కలిక వర్క్ వీసాపై యూఎస్ వెళ్లాడు. అలా 2015లో జేపీ మోర్గాన్ యూఎస్ వీసాపై ఇంటర్న్‌గా పనిచేశాడు. తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి..అదే కంపెనీకి సంబంధించి.. ఆస్తినిర్వహణ విభాగంలో అసోసియేట్‌గా విధులు నిర్వర్తించేవాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆనందం లేదనే ఫీలింగ్ వెంటాడేది సెమ్లానికి. తన చుట్టూ ఉన్నవాళ్లు చకచక వైస్ ప్రెసిడెంట్ హోదా పొందేస్తుంటే..నేను మాత్రం ఇలా మెకానికల్‌గా 9 టు 5 జాబ్ చేస్తున్నాననే బాధ వెంటాడేది.
ఈ ఉద్యోగంలో లక్షల్లో వేతనం, మంచి గుర్తింపు ఉన్నాజజ ఏదో అసలైన సక్సెస్‌ని అందుకోలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉండేది. పోనీ జాబ్‌ని వదిలేద్దామంటే..అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునే ధైర్యం రావడం లేదు.ఎందుకంటే అద్దె కూడా చెల్లించని విధంగా మంచి సౌకర్యాలు, ప్రతి ఏడాది మంచి వేతనంతో కూడిన ప్రమోషన్లు, చక్కటి గుర్తింపు ఉన్నాయి. ఇవన్నీ వదులుకుని వెళ్లడం అంటే గుండెల్లో ఏదో తెలియని గుబులు వెంటాడింది.
ఏం చేయాలో తెలియక ధ్యానం, డిజటల్‌డిటాక్స్ వంటి మానసిక థెరపీలు తీసుకుని..తనకేం కావలి అనేదానిపై స్పష్టత తెచుకున్నాడు. అలా ఈ జాబ్ వద్దనే నిశ్చయానికి రావడమేగాక మంచి జాబ్‌లో తక్కువ వేతనానికి చేరిపోయాడు. తాను కోరుకున్న మానసికి ఆనందం దొరికింది చాలు..ఇక ఖర్చులు విషయమైతే..తన జీవినశైలిని సర్దుబాటు చేసుకుంటే సరి అనుకున్నాడు. అలా సాగిపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి లాక్‌డౌన్ రావడం..సంపాదించిన ఆ ఉద్యోగం కాస్తా పోవడం అన్ని చకచక జరిగిపోయాయి.
తీవ్ర నిరాశ, నిస్పృహ..తప్పు చేసిన ఫీలింగ్..
అనవసరంగా జేపీ మోర్గాన్‌లో ఉద్యోగాన్ని వదులుకున్నానా..తప్పు నిర్ణయం తీసుకున్నానా అంటూ..నిద్రలేని రాత్రుల గడిపేవాడు. తన మీద తనకే జాలేసిది. అలా..పూర్తిగా డిప్రెషన్‌లోకి కూరుకుపోయాడు. కానీ తను చేసే మెడిటేషన్, మానసిక థెరపీల సాయంతో మళ్లీ రీచార్జ్ అయ్యి..స్టార్టప్ దిశగా అడుగులు కదిపాడు.
ఆ విధంగా రూ. 53 కోట్లు టర్నోవర్ చేసే టార్టన్ స్టార్టప్‌ని నెలకొల్పి గొప్ప సక్సెస్‌ని అందుకున్నాడు. తాను కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా..పరిస్థితులు తలికిందులైనప్పుడూ ఎలా సంయమనంగా ఉండాలో నేర్చుకున్నాడు. అంతేగాదు విజయం అంటే పెద్దమొత్తంలో జీతం కాదు..అంతకుమించిన ఆనందం., సంతృప్తి అని చెబుతున్నాడు సెమ్లానీ.
(చదవండి: Inspiring Story: సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..)


