విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ముంబైకర్ తన సంచలన బ్యాటింగ్‌తో టీ20 మ్యాచ్‌ను తలపించాడు. ప్రత్యర్ది బౌలర్లను ఉతికారేశాడు.
ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మకు సర్ఫరాజ్‌చుక్కలు చూపించాడు. అభిషేక్ వేసిన 16 ఓవర్‌లో సర్ఫరాజ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
తద్వారా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన భారత ప్లేయర్‌గా సర్ఫరాజ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబిజిత్ కాలే, అటిత్ షేత్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. తాజా మ్యాచ్‌లో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే ఆర్ధ శతకం బాది ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్, కోహ్లి, రోహిత్ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.
మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ .. ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ ముంబై కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 217 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో టాపర్డర్ రాణించినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
సర్ఫరాజ్ రీ ఎంట్రీ ఇస్తాడా?
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్. ఇంగ్లండ్‌పై తన అరంగేట్రంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. తర్వాత మ్యాచ్‌లలో నిలకడ లేకపోవడంతో అతడిని టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు సర్ఫరాజ్ తన అద్భుత ప్రదర్శనలతో కేవలం టెస్టులకే కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు తన సిద్దమేనని సవాల్ విసురుతున్నాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సర్ఫరాజ్ దుమ్ములేపాడు.
చదవండి: ENG vs NZ: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన..! ఇంగ్లండ్ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్


