నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. స్థిరమైన ఆదాయం కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – నివేష్ పటేల్
లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్‌్కతో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌తో పోలి్చతే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. లిక్విడ్ ఫండ్స్‌పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. లిక్విడ్‌ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు.
లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్‌స్టంట్‌గా అదే రోజు వెనక్కి తీసుకునేందుకు (నిరీ్ణత మొత్తం) కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతిస్తున్నాయి. లేదంటే మరుసటి రోజు అయినా పెట్టుబడులు చేతికి అందుతాయి. వీటిల్లో రాబడి ఎంతన్నది ముందుగానే అంచనాకు రావొచ్చు. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి యూనిట్ నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్‌ఏవీ)లో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. కనుక ఇది నెలవారీ ఉపసంహరించుకునే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.
నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు హెల్త్ రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉంది. అయినా, వ్యక్తిగతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆలోచనేనా? – రేణు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు హెల్త్ కవరేజీ ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, ఎంపానెల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు పరిహారం పొందొచ్చు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగా చికిత్సలకు సైతం రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు. వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు కుడా పరిహారం వస్తుంది. కాకపోతే ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితం. అయితే, ప్రభుత్వ ఆమోదం పొందిన ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉందో, అక్కడ వసతులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోండి.
ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన, రోబోటిక్ వంటి అత్యాధునిక చికిత్సలను తమకు ఇష్టమైన ఆస్పత్రిలో పొందాలని కోరుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కనీసం రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవాలి. అది కూడా వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి హెల్త్ ట్రాక్ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో–పే షరతుకు అంగీకరించాల్సి వస్తుంది. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సదుపాయం అధిక శాతం చికిత్సలకు రీయింబర్స్‌మెంట్ రూపంలోనే ఉంటుంది. కనుక ముందుగా తాము చెల్లించిన తర్వాతే ప్రభుత్వం వద్ద క్లెయిమ్ దాఖలు చేసి పొందగలరు. అదే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే అవసరమైన సందర్భంలో నగదు రహిత చికత్సను దాని కింద పొందొచ్చు.
ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్


