భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఆర్య.ఏజీ.. జీఈఎఫ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ నుంచి రూ.725 కోట్లు ఈక్విటీ పెట్టుబడిగా సమీకరించినట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో.. కంపెనీ రైతులు, వారికి సంబంధించిన సంస్థలతో తన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసి, వాతావరణ మార్పులను ఎదుర్కొనే క్లైమేట్ స్మార్ట్, మార్కెట్ ఆధారిత వ్యవసాయ విధానాలను ప్రోత్సహించనుంది.
ఆర్య.ఏజీ.. సాంకేతిక పరిష్కారాల ద్వారా చిన్న రైతులు వాతావరణ మార్పుల అనిశ్చితులను ఎదుర్కొనేలా చేయడం, పంట కోత అనంతరం ఫార్మ్ గేట్ వద్ద & మొత్తం వ్యవసాయ సరఫరా గొలుసులో నష్టాలను తగ్గించడం వంటివి చేస్తుంది. దీనిని 2013లో ప్రసన్న రావు, ఆనంద్ చంద్ర, చట్టనాథన్ దేవరాజన్ స్థాపించారు.
ప్రస్తుతం ఆర్యా.ఏజీ కార్యకలాపాలు భారతదేశంలోని 60 శాతం జిల్లాలకు విస్తరించి ఉన్నాయి. 12,000 అగ్రి-వేర్‌హౌస్‌ల నెట్‌వర్క్ ద్వారా ఏటా సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ధాన్యాన్ని సమీకరించి నిల్వ చేస్తోంది. అలాగే, వ్యవసాయ రంగంలోని వివిధ వర్గాలకు 1.5 బిలియన్ డాలర్లకు పైగా రుణాల పంపిణీకి తోడ్పడుతోంది.


