ఎన్‌ఎస్‌ఈ, ఇండియా పోస్ట్‌ జట్టు | major developments NSE India and India Post have just been announced | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈ, ఇండియా పోస్ట్‌ జట్టు

Feb 11 2026 8:30 AM | Updated on Feb 11 2026 10:38 AM

major developments NSE India and India Post have just been announced

మ్యుచువల్‌ ఫండ్స్‌ని మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా పోస్టల్‌ శాఖ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) జట్టు కట్టాయి. ఇందుకోసం ఇండియా పోస్ట్‌కి చెందిన 1.64 లక్షల పోస్టాఫీసుల విస్తృత నెట్‌వర్క్‌ని, ఎన్‌ఎస్‌ఈ ఎంఎఫ్‌ ఇన్వెస్ట్‌ ప్లాట్‌ఫాంని ఉపయోగించుకోనున్నాయి. తొలి దశలో చిన్న పథకాలతో మొదలుపెట్టి రెండో దశలో పూర్తి స్థాయి స్కీములు, పోర్ట్‌ఫోలియో అనలిటిక్స్, ప్రాంతీయ భాషల్లో సపోర్ట్, సలహా సేవలను అందుబాటులోకి తేనున్నాయి.

గ్రామీణ, చిన్న పట్టణాల్లోని వారు తమ దగ్గరుండే పొదుపు మొత్తాలను, సంపద సృష్టికి ఉపయోగపడే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేలా ప్రోత్సహించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం మ్యుచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం రూ.81 లక్షల కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Advertisement
 
Advertisement
Advertisement