ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకి రెడీ
ఏళ్ల నిరీక్షణకు బ్రేక్
సెబీ గ్రీన్ ఫ్లాగ్
న్యూఢిల్లీ: దశాబ్దకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్ ఇష్యూకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఐపీవో విషయంలో ముందుకెళ్లేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నో అబ్జక్షన్ సరి్టఫికెట్ (ఎన్‌వోసీ) జారీ చేసింది. ఇష్యూకి సెబీ అనుమతి లభించడం తమ సంస్థ ప్రయాణంలో కీలక మైలురాయని ఎన్‌ఎస్‌ఈ చైర్‌పర్సన్ శ్రీనివాస్ ఇంజేటి తెలిపారు. భాగస్వాములందరికి మరింత విలువను జోడించేందుకు ఇది తోడ్పడగలదని చెప్పారు. ఎన్‌వోసీ లభించిన తర్వాత ఇష్యూకి రావడానికి ఏడు నుంచి ఎనిమిది నెలలు పట్టొచ్చని ఎన్‌ఎస్‌ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహన్ గతంలో తెలిపారు.
సంస్థ ఐపీవో దేశీయంగా అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో సుమారు 1.77 లక్షల షేర్‌హోల్డర్లుండగా, అన్‌లిస్టెడ్ గ్రే మార్కెట్లో రూ. 5 లక్షల కోట్ల పైగా విలువ పలుకుతోందని అనలిస్టులు తెలిపారు. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటాల విక్రయం ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు 2016లో ఎన్‌ఎస్‌ఈ మొదటిసారిగా ముసాయిదా ఆఫర్ పత్రాలను సమర్పించింది.
అయితే, గవర్నెన్స్ లోపాల ఆరోపణలు, కో–లొకేషన్ కేసు తదితర అంశాల కారణంగా పబ్లిక్ ఇష్యూకి అప్పట్లో సెబీ ఆమోదముద్ర వేయలేదు. ఆ తర్వాత నుంచి ఎన్‌ఎస్‌ఈ పలుమార్లు సంప్రదింపులు జరుపుతూనే ఉంది. రూ. 1,388 కోట్లు చెల్లించి కో– లొకేషన్ కేసును పరిష్కరించుకునేందుకు ఎన్‌ఎస్ ఈ గతేడాది ముందుకొచి్చంది. ఈ నేపథ్యంలో కంపెనీ లిస్టింగ్ ప్రణాళికలను పరిశీలించేందుకు 2025 మార్చ్‌లో అంతర్గతంగా కమిటీని వేసింది. సెటి ల్మెంట్ అభ్యర్ధనకు ఆమోదముద్ర వేసినట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే ఇటీవలే తెలిపారు.


