సుధామూర్తిని వదలని డీప్‌ఫేక్‌ | Sudha Murty deepfake video | Sakshi
Sakshi News home page

సుధామూర్తిని వదలని డీప్‌ఫేక్‌

Jan 21 2026 2:49 PM | Updated on Jan 21 2026 3:22 PM

Sudha Murty deepfake video

ప్రస్తుత ఏఐ కాలంలో  నిజమైన సమాచారం ఏదో.. అసత్యమో ఏదో.. తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. డీప్‌ఫేక్ పుణ్యమా అని సెలబ్రేటీల మార్ఫింగ్ వీడియోలు చాలా వస్తున్నాయి. అయితే రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సైతం డీప్‌ ఫేక్ బాధితురాలిగా మారింది. వివిధ ఈ కామర్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా తాను చెబుతున్నట్లు వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయని అవి నమ్మద్దని తెలిపింది.

సుధామూర్తి మాట్లాడుతూ "నేను మిమ్మల్ని అలర్ట్ చేద్దామనుకుంటున్నాను ఆన్‌లైన్‌లో నా ముఖచిత్రంతో  ఫేక్‌ వీడియోస్ సర్యూలేట్ అవుతున్నాయి. వివిధ ఆర్థిక సంబంధమైన వ్యవహరాల్లో నేను పెట్టుబడి పెట్టమన్నట్లు ప్రచారం జరుగుతుంది. 200 డాలర్లు లేదా 20 వేల రుపాయలు పెట్టుబడి పెడితే 10 రెట్లు డబ్బు తిరిగి వస్తుందని అందులో ఉంది. అది నేను ప్రచారం చేసిన వీడియో కాదు పూర్తిగా అబద్ధం" అని సుధామూర్తి అన్నారు.

తన పేరుతో ప్రచారం జరగడంతో చాలా మంది పెట్టుబడి పెట్డి నష్టపోయినట్లు తెలిపారు. తానేప్పుడు ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లడలేదని కేవలం పని గురించి మాత్రమే మాట్లాడానని సుధామూర్తి అన్నారు. కనుక దయచేసి ఆ ప్రకటనను నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితమే. ఆమె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రముఖ సాప్టేవేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఛైర్మన్‌గా ఆమె పనిచేశారు. 2023లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement