బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్‌డీఐలు | Govt notified 100 percent FDI in insurance sector | Sakshi
Sakshi News home page

బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్‌డీఐలు

Feb 17 2026 8:27 AM | Updated on Feb 17 2026 9:33 AM

Govt notified 100 percent FDI in insurance sector

బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలో భాగమైన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సా హక విభాగం (డీపీఐఐటీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో మాత్రం 20 శాతానికే అనుమతి ఉంటుంది.

విదేశీ పెట్టుబడులున్న భారతీయ బీమా కంపెనీల విషయంలో బోర్డ్‌ చైర్‌పర్సన్, మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లలో కనీసం ఒక్కరైనా రెసిడెంట్‌ భారతీయ పౌరులై ఉండాలి. ఇన్సూరెన్స్‌ చట్టాల సవరణకు సంబంధించిన సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా బిల్లు 2025ని డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.

ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Advertisement
 
Advertisement
Advertisement