రూ. కోటి బీమా కాజేసేందుకు.. | Friends Attack on man for Rs 1 crore insurance | Sakshi
Sakshi News home page

రూ. కోటి బీమా కాజేసేందుకు..

Feb 17 2026 6:11 AM | Updated on Feb 17 2026 6:11 AM

Friends Attack on man for Rs 1 crore insurance

ఓ యువకుడికి బీమా చేయించి, ఆపై హత్యాయత్నం 

తీవ్రంగా కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

బూర్గంపాడు: రూ.కోటి బీమా సొమ్ము కోసం ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసేందుకు పథక రచన చేశారు. తీవ్రంగా కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన గత శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్‌ వద్ద జరిగింది. తాజాగా బాధితుడి బంధువుల కథనం ప్రకారం.. ఏపీలోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గన్నవరానికి చెందిన కట్టా యశ్వంత్‌కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మేనమామ ములిశెట్టి శ్రీనివాసరావు సంరక్షణలో ఉన్నాడు. ఆరు నెలల క్రితం వరకు యశ్వంత్‌ సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో కాంట్రాక్ట్‌ కారి్మకుడిగా పనిచేశాడు. 

అదే గ్రామానికి చెందిన కట్టా సాయిదీపక్‌తో ఆరునెలలుగా స్నేహం చేస్తూ అతని వ్యక్తిగత పనులకు సహాయకారిగా ఉంటున్నాడు. ఇదే సమయంలో భద్రాచలానికి చెందిన ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇన్సూరెన్స్‌ సేల్స్‌ ఆఫీసర్‌ కొండ భాను­ప్రకాశ్‌ కూడా వీరితో జత కలిశాడు. భానుప్రకాశ్, యశ్వంత్‌ మధ్య బంధుత్వం కూడా ఉంది. వ్యాపా­రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాయి­దీపక్, ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా ఉన్న భానుప్రకాశ్‌ కలిసి తల్లిదండ్రులు లేని యశ్వంత్‌ పేరిట బీమా చేయించి అతడ్ని హతమారిస్తే బీమా సొమ్ము దక్కించుకోవచ్చని ప్రణాళిక వేసుకున్నారు. కులాలు వేరైనా యశ్వంత్‌ ఇంటిపేరు, సాయిదీపక్‌ ఇంటి పేరు ఒకటే (కట్టా) కావడం వీరికి కలిసొచ్చింది. ఇందులో భాగంగా నాలుగు నెలల క్రితం యశ్వంత్‌ పేరిట ప్రీమియం చెల్లించి రూ.కోటి బీమా చేయించారు. ఇంటి పేరు ఒకటే కావడంతో కట్టా సాయిదీపక్‌ను సోదరుడిగా పేర్కొంటూ నామినీగా నమోదు చేయించారు.  

పరిహారం కాజేసేలా... 
పథకంలో భాగంగా శనివారం రాత్రి భద్రాచలంలో యశ్వంత్‌కు ఓ స్కూటీ ఇప్పించి మద్యం తీసుకుని సారపాకకు సమీపంలోని మోతె పట్టీనగర్‌కు రమ్మన్నారు. సాయిదీపక్, భానుప్రకాశ్‌ కారులో ముందుగా అక్కడికి చేరుకున్నారు. యశ్వంత్‌ వచ్చాక సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలో రోడ్డు పక్కన మద్యం తాగి యశ్వంత్‌ తలపై తీవ్రంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం తీసుకెళ్లి రోడ్డుపై పడుకోబెట్టారు. కొంతదూరంలో ఆయన వేసుకొచి్చన స్కూటీని పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పథకం వేశారు. అటుగా వస్తున్నవారు రక్తం మడుగులో ఉన్న యశ్వంత్‌ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. యశ్వంత్‌కు స్కూటీ ఎవరు ఇచ్చారని మేనమామ ప్రశి్నస్తే తామే ఇచ్చామని సాయిదీపక్, భానుప్రకాశ్‌ చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పథకం ప్రకారమే యశ్వంత్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారని గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement