ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.కోటి ప్రమాద బీమా | Considers Rs 1 cr insurance for Singareni and govt staff: Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.కోటి ప్రమాద బీమా

Jan 10 2026 1:20 AM | Updated on Jan 10 2026 1:20 AM

Considers Rs 1 cr insurance for Singareni and govt staff: Bhatti Vikramarka

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను తమ కుటుంబ సభ్యులుగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిసినట్టు భట్టి వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎనీ్పడీసీఎల్, జెన్‌కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తెచి్చనట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement