అనాదిగా వస్తున్న పరంపరను కొనసాగిస్తూ వినాయక ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాలని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కోరారు.
శాంతియుతంగా ఉత్సవాలు
Sep 19 2013 2:12 AM | Updated on Aug 17 2018 2:53 PM
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : అనాదిగా వస్తున్న పరంపరను కొనసాగిస్తూ వినాయక ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాలని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వినాయక శిశుమందిర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో వినాయక ఉత్సవాలు కీలక పాత్ర పోషించాయని, బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలకు నాంది పలికారని తెలిపారు. వివేకానందుని స్ఫూర్తితో సమాజ ఉన్నతికి యువత పాటుపడాలని పిలుపునిచ్చారు.
అనంతరం వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చికిలి లక్ష్మీవేంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి వేద మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక శాస్త్ర నామాలు, అర్చనలు నిర్వహించారు. హారతి, వినాయక సంకీర్తనలు ఆలపించి భక్తి పారవశ్యాలతో వినాయక ప్రతిమలను వాహనంలో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. డీఎస్పీ లతామాధురి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, హిందూ సమాజ ఉత్సవ సమితి అధ్యక్షులు గోలి తిరుపతి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, అన్నమయ్య లలిత కళా సమితి అధ్యక్ష, కార్యదర్శులు కొండయ్య చౌదరి, ఎస్.రాజారాం, నాయకులు శ్రీరాం నాయక్, దశరథ్ పటేల్, సంతోష్, మటోలియూ, నగేశ్, రాజేశ్వర్, బండారి దేవన్న పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు
శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలల విద్యార్థులు శోభాయాత్రలో చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ బద్ధంగా వస్త్ర అలంకరణతో కోలాటాలు చేస్తూ భక్తి పారవశ్యాలతో దైవ భక్తి గీతాలపై చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత మాత, వివేకానందుని వేషధారణలతో చిన్నారుల ప్రదర్శనలు దేశ ఔనత్యాన్ని చాటారుు. విశేషంగా ఆకట్టుకున్నాయి.
Advertisement
Advertisement