గణేష్‌ మండపాల వద్ద డీజేలపై ప్రత్యేక నజర్‌ | Special attention to DJs at Ganesh Mandapam | Sakshi
Sakshi News home page

గణేష్‌ మండపాల వద్ద డీజేలపై ప్రత్యేక నజర్‌

Sep 6 2026 12:22 PM | Updated on Sep 6 2026 1:00 PM

Special attention to DJs at Ganesh Mandapam

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందడి కొద్దిరోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో మండపాల వద్ద శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. డీజేల మోత మోగిస్తే స హించేది లేదని తేలి్చచెబుతున్నారు. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గర్భిణులు, నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండటంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. నిబంధనలు కచి్చతంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించారు.

సౌండ్‌ పెంచితే సీజ్‌ ఖాయం..  
నగర వ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాల్లో డీజే సిస్టంలపై పోలీసులు సైలెంట్‌ అటాక్‌ ప్రారంభించారు. శబ్ద తీవ్రతను కొలిచేందుకు ప్రత్యేకంగా డెసిబుల్‌ మీటర్లతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లౌడ్‌ స్పీకర్లు, డీజేలు వాడటానికి వీల్లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నివాస ప్రాంతాల్లో 55 డెసిబుల్స్, పగటిపూట గరిష్టంగా అనుమతించిన స్థాయులనే పాటించాలి. స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధిని నో నాయిస్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో శబ్దం చేస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

హామీ పత్రం ఇస్తేనే అనుమతి 
ఈ ఏడాది ఉత్సవ కమిటీలకు పోలీసుల అనుమతి లభించాలంటే కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మండపంలో శబ్ద పరిమితులు దాటవని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఆపివేస్తామని నిర్వాహకులు రాతపూర్వక పత్రం సమరి్పంచాలి. డీజే, సౌండ్‌ సిస్టమ్స్‌ సరఫరా చేసే యజమానులకు ముందస్తుగానే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. గతేడాది గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. గతేడాది శబ్ద కాలుష్య నియమావళిని దాటిన వారిపై 250కి పైగా కేసులు నమోదు చేయగా, 150కి పైగా భారీ డీజే సెట్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి ఉల్లంఘనలకు పాల్పడితే డీజే పరికరాలతో పాటు రవాణా చేసిన వాహనాలను కూడా జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

 చదవండి: అప్పుడు ఓనర్‌.. ఇప్పుడు డ్రైవర్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement