దినేష్ తేజ్, దష్విక.కె జంటగా అర్జున్ కోల దర్శకత్వంలో రూ పొందిన చిత్రం ‘తత్వం’.
త్రయతి ఇషాని క్రియేషన్స్ , ఎస్.కె ప్రోడక్షన్స్ పై శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది.
‘‘నా స్వస్థలం వైజాగ్. చిన్నప్పటి నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం.
నేను మూడో తరగతి చదువుతున్నప్పుడు ‘పెద్దయ్యాక ఏమవుతావు? అని టీచర్ అడిగితే హీరోయిన్ అవుతానని చెప్పాను.
చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీకి వెళ్లమని నా తల్లిదండ్రులు నన్ను సపోర్ట్ చేశారు.
బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. విజయ్ దేవరకొండతో కలిసి ఓ వాణిజ్య ప్రకటన చేశాను. హీరోయిన్ గా ‘తత్వం’ నా తొలి సినిమా.


