దృశ్యం-3 మూవీ.. రిలీజ్‌కు ముందే రికార్డ్..! | Drishyam 3 Movie advance booking on fire with Rs 50 crore Day 1 | Sakshi
Sakshi News home page

Drishyam 3 Movie: దృశ్యం-3 మూవీ.. రిలీజ్‌కు ముందే రికార్డ్..!

Oct 1 2026 5:42 PM | Updated on Oct 1 2026 5:51 PM

Drishyam 3 Movie advance booking on fire with Rs 50 crore Day 1

దృశ్యం సిరీస్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే వచ్చిన దృశ్యం చిత్రాలు ఆడియన్స్‌కు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో దృశ్యం-  ది కంక్లూజన్ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ హీరోగా నటించారు. ఈ మూవీ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే ఇండియాలో మొదటి రోజే రూ. 50 కోట్ల నెట్ వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి  అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'ధురందర్ 2' తర్వాత రెండవ అతిపెద్ద హిందీ చిత్రంగా నిలిచేలా కనిపిస్తోంది. ఈ ఏడాది 'మిర్జాపూర్: ది మూవీ' (రూ. 28.11 కోట్లు), 'బోర్డర్ 2' (రూ. 32.10 కోట్లు) లాంటి సినిమాలను అధిగమించనుంది. శుక్రవారం నాడు 5.35 లక్షలకు పైగా టిక్కెట్లను అమ్మగా.. రూ. 19.75 కోట్ల అడ్వాన్స్ అమ్మకాలను నమోదు చేసింది. ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం.. భారతదేశంలో అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా రూ. 36.25 కోట్ల స్థూల వసూళ్లను రాబట్టనుంది. ఓవర్‌సీస్‌లో ఇప్పటికే రూ. 3 కోట్లకు పైగా వసూలు చేసింది. వారాంతపు అడ్వాన్స్ బుకింగ్స్‌ కలిపితే రూ. 5 కోట్లు దాటనుంది. ఓవరాల్‌గా చూస్తే  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాకముందే రూ. 50 కోట్లకు పైగా రాబట్టనుంది.  ఈ చిత్రం ఇప్పటికే దృశ్యం 2 అడ్వాన్స్ అమ్మకాల రికార్డును దాటేసింది.

కాగా.. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్.. తన కుటుంబ రహస్యాలను కాపాడటానికి ఏదైనా చేసే ఒక కుటుంబ పెద్ద అయిన విజయ్ సాల్గావ్‌కర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో పాటు శ్రియా శరన్, ఇషితా దత్తా, టబు, జైదీప్ అహ్లావత్, మృణాల్ జాదవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement